
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీలో నిధులు గోల్‌మాల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో సీసీఎస్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. దీనిపై ఇప్పటి వరకు సీసీఎస్ పోలీసులకు మూడు ఫిర్యాదులు అందాయి. సుమారు 63 కోట్ల రూపాయలు గోల్ మాల్ అయినట్లు అకాడమీ అధికారులు సీసీఎస్‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు మూడు ఫిర్యాదులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
(చదవండి: తెలుగు అకాడమీలో నిధుల గోల్‌మాల్)
ఇప్పటికే పోలీసులు పలు బ్యాంక్ అధికారులను సీసీఎస్‌కు తరలించి విచారిస్తున్నారు. వీరిలో యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, అగ్రాసేన్ బ్యాంకు ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం పోలీసులు వీరిని విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment