14కు తెలుగు అకాడమీ కేసు వాయిదా
Published Thu, Aug 8 2013 4:01 AM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM
తిరుపతి లీగల్, న్యూస్‌లైన్: తిరుపతి తెలుగు అకాడమీ శాఖలో 2008లో జరి గిన నిధుల దుర్వినియోగం కేసు విచారణను తిరుపతి మూడో అదనపు జూనియర్ జడ్జి ఈనెల 14వ తేదీకి వాయిదా వేశారు. కేసులో నిందితుడిగా ఉన్న తెలుగు అకాడమీ శాఖ ఉద్యోగి రాఘవరెడ్డి బుధవారం కోర్టులో సాక్ష్యం ఇవ్వాల్సి ఉంది. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా న్యాయవాదులు కోర్టుకు హాజరుకాకపోవడంతో న్యాయమూర్తి కేసును వాయిదా వేశారు.
వేద పాఠశాల కేసు 19కు వాయిదా
తిరుమల ధర్మగిరి వేదపాఠశాలలో ఓ విద్యార్థిపై జరి గిన లైంగిక వేధింపుల కేసు విచారణను తిరుపతి రెండో అదనపు జూనియర్ జడ్జి కమలాకర్‌రెడ్డి ఈనెల 19వ తేదీకి వాయిదా వేశారు. కేసులో సాక్షిగా ఉన్న రుయా ఆస్పత్రి డాక్టర్ వెంకటేశ్వర్లను నిందితుల తరఫు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేయాల్సి ఉంది. న్యాయవాదులు బుధవారం హాజరుకాకపోవడంతో న్యాయమూర్తి కేసును వాయిదా వేశారు. తదుపరి విచారణకు ఇరుపక్షాల వారు హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు.
Advertisement