విజయవాడ: కృష్ణా జిల్లా విజయవాడలోని ఓ న్యూస్ ఛానల్ కార్యాలయం పైకి గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు రువ్వడంతో ఉద్రిక్తత రాజుకుంది. నగరంలోని నెంబర్ 1 న్యూస్ ఛానల్‌పై గుర్తుతెలియని దుండగులు శుక్రవారం రాత్రి రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో కార్యాలయ భవనంలోని అద్దాలు స్వల్పంగా ధ్వంసం అయ్యాయి.
దీంతో సదరు టీవీ ఛానల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోందని.. విచారణ అనంతరం వివరాలు తెలియజేస్తామని అధికారులు తెలిపారు.