rajathkumar
-
3 ప్రాజెక్టులకు టీఏసీ లైన్‌క్లియర్
సాక్షి, న్యూఢిల్లీ: గోదావరి నదీ జలాలను వినియోగిస్తూ చేపట్టిన తెలంగాణలోని మూడు సాగునీటి ప్రాజెక్టులకు సాంకేతిక సలహా కమిటీ (టీఏఏసీ) ఆమోదం లభించింది. భూపాలపల్లి జిల్లాలోని ముక్తేశ్వర(చిన్న కాళేశ్వరం) ఎత్తిపోతల పథకం, ఆదిలాబాద్ జిల్లాలోని ఛనాక–కొరట బ్యారేజీ, నిజామాబాద్ జిల్లాలోని చౌటుపల్లి హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల పథకాలకు టీఏసీ ఆమోదం ఇస్తున్నట్లు కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ సెక్రెటరీ పంకజ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రకటించారు. ఈ ప్రాజెక్టుల ఆమోదానికి సంబంధించి అడ్వైజరీ కమిటీ మినిట్స్ త్వరలోనే జారీ చేయనున్నారు. జూలై 2021లో కేంద్ర ప్రభుత్వం జారీ చేసి న గెజిట్ నోటిఫికేషన్లో ఈ మూడింటినీ ఆమోదం లేని ప్రాజెక్టులుగా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుల డీపీఆర్‌లను గతేడాది సెప్టెంబర్‌లో కేంద్ర జల సంఘానికి, గోదావరి బోర్డుకు సమర్పించింది. కేంద్ర జల సంఘం పరిధిలోని వివిధ డైరెక్ట రేట్లు ఈ డీపీఆర్‌లను కూలంకషంగా పరిశీలించి ఆమోదించాయి. అనంతరం డీపీఆర్‌ల పరిశీలనకు సంబంధించి కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ఆమోదించిన ఫ్లో చార్ట్ ప్రకారం వీటిని గోదావరి బోర్డు పరిశీలన కోసం పంపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన బోర్డు భేటీలో వీటి అనుమతులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకించినా, బోర్డు తన రిమార్కులతో మళ్ళీ కేంద్ర జల సంఘానికి పంపింది. కేంద్ర జల సంఘం ఏపీ లేవనెత్తిన అన్ని అభ్యంతరాలను పున: సమీక్షించి వాటిని పూర్వ పక్షం చేస్తూ ఈ మూడు ప్రాజెక్టులను టీఏసీ సిఫారసు చేస్తూ అడ్వైజరీ కమిటీకి పంపింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లోని జల శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ 3 ప్రాజెక్టులపై చర్చించారు. సభ్యులు అడిగిన అన్ని ప్రశ్నలకు తెలంగాణా ప్రభుత్వం తరుఫున హాజరైన స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్‌కుమార్, ఈఎన్సీలు మురళీధర్, నల్లా వెంకటేశ్వర్లు, సీఈలు శ్రీనివాస్, మధుసూధన్‌రావు, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఎస్ఈ శ్రీనివాస్‌రెడ్డి సమాధానాలు ఇచ్చారు. ఈ సమాధానాలకు సంతృప్తి చెంది ఈ మూడు ప్రాజెక్టులకూ ఆమోదం తెలుపనున్నట్టు పంకజ్ ప్రకటించారు. -
Krishna River Water Dispute: ఈ ఏడాది పాత వాటాలే
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలను ఈ ఏడాది కూడా పాత పద్ధతి ప్రకారమే పంచుకోవాలని ఇరు తెలుగు రాష్ట్రాలు నిర్ణయానికి వచ్చాయి. ఈసారి ప్రాజెక్టుల్లో చేరే నీటిని 34ః66 నిష్పత్తిలో తెలంగాణ, ఏపీ పంచుకోవాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశంలో ఒప్పందానికి వచ్చాయి. కృష్ణా జలాల్లో వాటా పెంపు అంశాన్ని ట్రిబ్యునళ్లు మాత్రమే తేల్చగలవని.. తాము నిర్ణయం తీసుకోలేమన్న బోర్డు సూచన మేరకు దీనికి తెలంగాణ అంగీకరించింది. అయితే శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి విషయంలో మాత్రం ఏకాభిప్రాయం రాలేదు. విద్యుత్ ఉత్పత్తి చేస్తామని తెలంగాణ స్పష్టం చేయగా.. సాగు, తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ఏపీ వాదించింది. కాగా ఢిల్లీలో ఉన్న సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు రజత్‌కుమార్‌కు ఫోన్ చేసి.. కృష్ణాబోర్డు సమావేశంలో జరుగుతున్న వాదనలపై ఆరా తీశారు. ఏపీ ఏయే అంశాలను లేవనెత్తుతోందన్నది తెలుసుకుని, పలు సూచనలు చేశారు. వాడివేడిగా వాదనలు కృష్ణాజలాల్లో వాటాలు, వినియోగం, విద్యుదుత్పత్తి సహా పలు కీలక అంశాలపై హైదరాబాద్‌లోని జలసౌధలో బుధవారం కృష్ణాబోర్డు సమావేశాలు జరిగాయి. మొదటి సమావేశం బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మొదలైంది. తెలంగాణ, ఏపీ జలవనరుల శాఖల కార్యదర్శులు రజత్‌కుమార్, శ్యామలారావు, ఈఎన్సీలు మురళీధర్, నారాయణరెడ్డితోపాటు తెలంగాణ అంతర్రాష్ట్ర జల విభాగం సీఈ మోహన్‌కుమార్, ఎస్ఈ కోటేశ్వర్రావు తదితరులు హాజరయ్యారు. సుమారు 7 గంటలపాటు సాగిన ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాలు వాదనలు వినిపించాయి. తర్వాత బోర్డు పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ అంశాల అమలుపై మరో నాలుగు గంటల పాటు సమావేశం జరిగింది. మొత్తంగా 11 గంటల పాటు సమావేశాలు జరిగాయి. వాటాలపై తెలంగాణ పట్టు సమావేశంలో వాటాల పెంపు అంశాన్ని తెలంగాణ ప్రధానంగా ప్రస్తావించింది. ‘‘కృష్ణాబోర్డు 12వ భేటీలో తెలంగాణ, ఏపీ మధ్య 34ః66 నిష్పత్తిలో ఒక ఏడాదికి నీటి పంపకాలు చేయడానికి అంగీకరించాం. మైనర్ ఇరిగేషన్ వినియోగం, పట్టిసీమ నుంచి కృష్ణాడెల్టాకు మళ్లించే గోదావరి నీళ్లు, ఆవిరి నష్టాలను ఈ నిష్పత్తిలో లెక్కించకూడదని నిర్ణయం తీసుకున్నాం. పరీవాహకం, సాగుయోగ్య భూమి, కరువు పీడిత ప్రాంతాలు, జనాభా ఆధారంగా చూస్తే కృష్ణా జలాల్లో తెలంగాణ, ఏపీల వాటా 70.8ః 29.2 శాతంగా ఉండాలి. కనీసం బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చేవరకు కృష్ణా జలాల్లో లభ్యత నీటిని 50ః50 నిష్పత్తిన పంచాలి’’ అని తెలంగాణ స్పెషల్ సీఎస్ రజత్‌కుమార్ వాదించారు. పోలవరం మళ్లింపు వాటాల ప్రకారం సైతం తమకు 45 టీఎంసీలు అదనంగా దక్కుతాయని, వాటిని ఈ ఏడాది నుంచి వినియోగిస్తామని తెలిపారు. అయితే దీనిని ఏపీ వ్యతిరేకించింది. కృష్ణాడెల్టాకు మళ్లించే 80 టీఎంసీల గోదావరి జలాలకు సంబంధించి.. నాగార్జునసాగర్ ఎగువన నీటిని పంపిణీ చేసే అధికారం బ్రిజేశ్ ట్రిబ్యునల్‌కే ఉందని ఏపీ సెక్రటరీ శ్యామలారావు వాదించారు. నిజానికి ప్రస్తుత వాటాలను సవరిస్తే ఏపీకే 70 శాతం నీటిని ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దీనిపై కల్పించుకున్న బోర్డు.. నీటి వాటాల అంశం బోర్డులు తేల్చే పనికాదని, ట్రిబ్యునల్‌లో విషయం తేలేవరకు పాత పద్ధతి ప్రకారమే నీటిని వాడుకోవాలని కోరింది. దీనికి తెలంగాణ అంగీకరించింది. విద్యుదుత్పత్తిపై గరంగరం శ్రీశైలంలో విద్యుదుత్పత్తిపై సమావేశంలో వాడీవేడిగా చర్చ జరిగింది. శ్రీశైలంలో ఇష్టారీతిగా విద్యుదుత్పత్తి చేస్తున్నారని, దానిని తక్షణమే నిలిపేయాలని ఏపీ డిమాండ్ చేయగా.. అనుమతుల్లేని ప్రాజెక్టుల ద్వారా శ్రీశైలం నుంచి కృష్ణాజలాలను తరలించడం ఆపాలని తెలంగాణ వాదించింది. ‘‘కృష్ణా బేసిన్ అవతల ఎలాంటి అనుమతుల్లేని ఆయకట్టుకు పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ నీటిని తరలిస్తోంది. 1976, 1977లో జరిగిన అంతర్రాష్ట్ర ఒప్పందాలు, 1981లో ప్రణాళికా సంఘం అనుమతుల మేరకు ఏపీ కేవలం 15 టీఎంసీల నీటిని చెన్నై తాగునీటి అవసరాలకు, మరో 19 టీఎంసీల నీటిని ఎస్ఆర్బీసీకి జూలై–అక్టోబర్ నెలల మధ్య తరలించుకోవచ్చు. కానీ ఏపీ అధికంగా నీటిని వాడుతోంది. ఇలా ఓవైపు అక్రమంగా నీటిని తరలిస్తూ.. మరోవైపు శ్రీశైలంలో విద్యుదుత్పత్తిని ఆపాలని కోరడం సరికాదు. నిజానికి శ్రీశైలం పూర్తిగా విద్యుదుత్పత్తి ప్రాజెక్టు..’’ అని రజత్‌కుమార్ స్పష్టం చేశారు. అయితే ప్రాజెక్టు ప్రొటోకాల్ ప్రకారం తాగు, సాగు అవసరాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, ఆ అవసరాలు లేనప్పుడే శ్రీశైలం నుంచి విద్యుదుత్పత్తి చేయాలని ఏపీ వాదించింది. కేవలం విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని వృధాగా సముద్రంలోకి వదిలేయడం ఏమిటని ప్రశ్నించింది. ఈ ఏడాది ఏకంగా 100 టీఎంసీలను వృధాగా సముద్రంలోకి వదిలేశారని పేర్కొంది. ఈ సందర్భంగా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ స్పందిస్తూ.. తాగు, సాగు అవసరాలకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. దీనిపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ అవసరం ఎక్కువగా ఉందని స్పష్టం చేసింది. అయినా తమ సూచనలు పాటించాలని బోర్డు కోరడంతో.. తెలంగాణ అధికారులు రజత్‌కుమార్, ఈఎన్సీ మురళీధర్ తదితరులు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. క్యారీ ఓవర్ కుదరదు శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో ఒక ఏడాది వాడుకోలేకపోయిన నీటిని తర్వాతి ఏడాదిలో వాడుకునేలా (క్యారీఓవర్) తమకు అనుమతి ఇవ్వాలన్న తెలంగాణ ప్రతిపాదనను కృష్ణాబోర్డు తోసిపుచ్చింది. ఈ విషయంలో ఏపీ వాదనలతో ఏకీభవించింది. బచావత్ ట్రిబ్యునల్ క్లాజ్–8 ప్రకారం ఏ నీటి సంవత్సరం లెక్కలు ఆ ఏడాదితోనే పూర్తవుతాయని పేర్కొంది. ‘వరద’ లెక్కలు వద్దు బేసిన్‌లోని ప్రాజెక్టులన్నీ నిండి నీరు సముద్రంలో కలుస్తున్నప్పుడు వరద జలాలను ఎవరు వాడుకున్నా వాటాల్లో పరిగణించకూడదని ఏపీ కోరగా.. బోర్డు అంగీకరించింది. అయితే తెలంగాణ విజ్ఞప్తి మేరకు.. ఎవరెవరు ఎంతమేర వరద జలాలను వాడుతున్నారో లెక్కలు చెప్పాలని సూచించింది. బోర్డుకు మూడు ప్రాజెక్టుల డీపీఆర్‌లు గెజిట్ అంశాల అమలుపై జరిగిన చర్చ సందర్భంగా.. కాళేశ్వరం అదనపు టీఎంసీ, సీతారామ, తుపాకులగూడెం ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లను తెలంగాణ గోదావరి బోర్డుకు సమర్పించింది. చిన్న కాళేశ్వరం, మోదికుంటవాగు, చనాఖా–కొరట డీపీఆర్‌లను మరో వారంలో సమర్పిస్తామని తెలిపింది. గెజిట్‌లో కొన్ని అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేయాల్సి ఉందని.. ఏవైనా ప్రాజెక్టులకు సంబంధించి ప్రజాప్రతినిధుల నుంచి ఫిర్యాదులుగానీ, వినతులుగానీ వస్తే ఎవరు పరిష్కరిస్తారని తెలంగాణ సందేహం వ్యక్తం చేసింది. ఏపీ మాత్రం గెజిట్ అమలుకు సంపూర్ణంగా సహకరిస్తామని తెలిపింది. ఇక గెజిట్ నోటిఫికేషన్ అమలు అంశాల పరిశీలన కోసం రెండు బోర్డులకు సంబంధించి ఉప కమిటీలను ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. శ్రీశైలంలో విద్యుదుత్పత్తి ఆపం బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం శ్రీశైలం హైడల్ ప్రాజెక్టు. దీనిద్వారా విద్యుదుత్పత్తి ఆపం. తాగు, సాగు అవసరాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్న సూత్రం శ్రీశైలానికి వర్తించదు. తెలంగాణకు విద్యుత్ వినియోగం ఎక్కువ. కాబట్టి ఉత్పత్తి కొనసాగిస్తాం. కృష్ణా జలాలను ఏపీ అక్రమంగా తరలించుకుపోతున్నా కృష్ణాబోర్డు నిలువరించడం లేదు. ఎన్ని లేఖలు రాసినా అడ్డుకోలేకపోయింది. టెలీమెట్రీ వ్యవస్థలోనే విఫలమైంది’’ రజత్‌కుమార్, తెలంగాణ స్పెషల్ సీఎస్ -
పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయండి
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధి లో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. జిల్లా పరిధిలోని ప్రాజెక్టులకు సంబంధించి ఆయన మంగళవారం నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్సీ మురళీధర్‌తో బీఆర్కే భవన్లో భేటీ అయ్యారు. కృష్ణా జలాల వివాదం, బ్రాహ్మణవెల్లెంల, ఎస్సె ల్బీసీ టన్నెల్ పనులపై చర్చించారు. బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తయ్యాయని, రూ.100 కోట్లు కేటాయిస్తే పనులు పూర్తవుతాయని కోమటిరెడ్డి వివరించారు. కాంగ్రెస్ హయాంలో 70 శాతం పూర్తయిన శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. కాగా, సీఎం దృష్టికి తీసుకెళ్లి పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు కోమటిరెడ్డి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. -
రాష్ట్రంలో 2,98,64,689 మంది ఓటర్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 2,98,64,689 మంది ఓటర్లున్నారు. ఇందులో 1,50,07,047 మంది పురుషులు, 1,48,56,076 మంది మహిళలు, 1,566 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం 2020లో భాగంగా సోమవారం ముసాయిదా ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్‌కుమార్ ప్రకటించారు. ఈ కార్యక్రంలో భాగంగా వచ్చే నెల 15 వరకు ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, తప్పుల సవరణకు దరఖాస్తులతో పాటు కొత్త ఓటర్ల నమోదు దరఖాస్తులను స్వీకరించనున్నారు. జనవరి 27 నాటికి ఈ దరఖాస్తులను పరిష్కరించి ఫిబ్రవరి 7న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. 2020 జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయస్సు కలిగి ఉండి, ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు లేని వారందరూ ఓటరుగా నమోదు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకోవాలని రజత్‌కుమార్ సూచించారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణలో భాగంగా రాష్ట్రంలో కొత్తగా 105 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. దీంతో మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 34,707కి పెరిగిందని రజత్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. -
ఓట్ల లెక్కింపు పకడ్బందీగా జరగాలి
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు అత్యంత పకడ్బందీగా నిర్వహించాల ని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ కన్సల్టెంట్ భన్వర్‌లాల్ ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఈ నెల 23న చేపట్టే ఓట్ల లెక్కింపు ప్రక్రియపై జిల్లా ఎన్నికల ప్రధాన అధికారులకు, రిటర్నింగ్ అధికారులకు, సహాయ రిటర్నింగ్ అధికారులకు సోమవారం రెండవ విడత శిక్షణ, పునశ్చరణ కార్యక్రమాలు జరిగాయి. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భన్వర్‌లాల్ పాల్గొన్నారు. ఎన్నికల అధికారులకు పలు సలహా లు, సూచనలు ఇచ్చారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించిన చట్టపరమైన అంశాలతోపాటూ, కౌంటింగ్‌కు ముందు, తర్వాత దశలవారీగా తీసుకోవాల్సిన చర్యలపై ఎన్నికల అధికారులకు సవివరంగా తెలియజేశారు. స్ట్రాంగ్ రూమ్‌లు తెరిచే సమయంలో అభ్యర్థులు, ఏజెంట్లు, పరిశీలకులు తప్పనిసరిగా అక్కడ ఉండడం వంటి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను, మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ విమర్శలకు, ఆరోపణలకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా చూడాలని వారికి స్పష్టం చేశారు. లెక్కింపు ప్రక్రియకు తుది రూపం ఇవ్వడానికి మొదటి రెండు రౌండ్లు దశలవారీగా ఎలా లెక్కించాలో ఆ సమయంలో ఏఆర్ఓలు ఎలా అప్రమత్తం గా ఉండాలో వివరించారు. రిటర్నింగ్ అధికారుల, పరిశీలకులకున్న పరిమితులు అలాగే వారికున్న అధికారాలు వాటిని ఎలా వినియోగించాలో వివరిస్తూ, కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఓటింగ్ యంత్రాల భద్రత, ఎన్నికల తాలూకు రికార్డులు, పత్రాలను ఎలా సీలు వేయాలి, ఫలితాల ప్రకటనను ఎన్నికల సంఘానికి నిర్దేశిత ఫారాల్లో ఎలా నింపి పంపాలన్న విషయాలపై కూడా అవగాహన కల్పించారు. ఈటీపీబీఎస్ వంటి అధునాతన టెక్నాలజీని మొదటిసారిగా వినియోగిస్తున్నందువల్ల దానికి అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చుకోవడం, ఎన్వలప్‌లమీద క్యూఆర్ కోడ్ వంటివి స్కాన్ చేయడం వంటి అంశాలను దానికి సంబంధించిన విషయ నిపుణులు వివరించారు. ఓట్ల లెక్కింపులో సువిధ అనే అప్లికేషన్‌ను ఎలా ఉపయోగించాలో కూడా మాస్టర్ ట్రైనర్లు వివరించారు. సువిధ పోర్టల్‌లో డేటా ఎంట్రీ జరిగిన తర్వాతనే ఆ రౌండ్ ఫలితాలను ప్రకటించాల్సి ఉంటుందని కూడా వారికి స్పష్టం చేశారు. 21వ తేదీన ఓట్ల లెక్కింపు సన్నద్ధతను పూర్తిస్థాయిలో పరీక్షించి చూసుకోవడానికి డ్రెస్ రిహార్సల్ నిర్వహించాలని భన్వర్‌లాల్ ఆదేశించారు. దేశవ్యాప్తంగా ఈనెల 23న ఓట్ల లెక్కింపు జరుగుతున్న దృష్ట్యా అందరి దృష్టి ఈవీఎంల మీద ఉంటుందనీ, ఎక్కడా అజాగ్రత్తకు అవకాశం లేకుండా లెక్కింపు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని రజత్ కుమార్ ఆదేశించారు. లెక్కింపు ప్రక్రియలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించి శిక్షలు విధిస్తుందని భన్వర్ లాల్ హెచ్చరించారు. -
చివరలో వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు
సాక్షి, హైదరాబాద్: పోస్టల్ ఓట్లు, ఈవీఎం యంత్రాల్లోని ఓట్లను లెక్కించాకే వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) రజత్‌కుమార్ వెల్లడించారు. ప్రతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో యాదృచ్ఛికంగా ఎంపిక చేసిన 5 వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించి సంబంధిత పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలలో పార్టీలకు పడిన ఓట్ల సంఖ్యతో సరిపోలుస్తామని చెప్పారు. అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, ఇతర సంబంధిత అధికారులకు గురువారం హైదరాబాద్‌లో శిక్షణ నిర్వహించారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో పోలైన ఓట్లను షెడ్యూల్ ప్రకారం ఈ నెల 23న లెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మే 23 ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఏయే స్థాయిలో ఏ ఓట్లు లెక్కించాలి. లెక్కించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు.. ఎన్నికల ఏజెంట్లతో వ్యవహరించాల్సిన తీరు.. ఈవీఎంలు, వీవీప్యాట్స్‌లోని ఓట్లను లెక్కించాల్సిన పద్ధతి.. పరిశీలకుల సంతకాలకు ఉన్న ప్రాముఖ్యం తదితర అంశాల్లో కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నియమ నిబంధనలను శిక్షణలో భాగంగా వివరించినట్లు చెప్పారు. దేశంలోనే అత్యధికంగా 185 మంది అభ్యర్థులు పోటీపడిన నిజామాబాద్ నియోజకవర్గ ఓట్లను లెక్కించేందుకు 18 టేబుళ్లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే అత్యధిక ఓటర్లున్న మల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధించి 24 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం కన్సల్టెంట్ భన్వర్‌లాల్, డిప్యూటీ ప్రధాన ఎన్నికల అధికారి బుద్ధ ప్రకాశ్ జ్యోతి, జాయింట్ సీఈవో ఆమ్రపాలి పాల్గొన్నారు. -
నేటితో ప్రచారానికి తెర!
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. మంగళవారం సాయంత్రానికి మైకులు మూగబోనున్నాయి. ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం పోలింగ్ ముగిసే సమయానికి సరిగ్గా 48 గంటల ముందు ఎన్నికల ప్రచార గడువు ముగియనుంది. రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలకు ఈ నెల 11న ఎన్నికలు జరగనుండగా, అందులో 16 లోక్‌సభ స్థానాలకు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ లోక్‌సభ స్థానాల పరిధిలో మంగళవారం సాయంత్రం 5కి ఎన్నికల ప్రచార గడువు ముగియనుంది. నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి 185 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండడంతో.. అక్కడ మాత్రం ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో నిజామాబాద్‌లో ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్‌కుమార్ సోమవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం ఓటర్లు 2,97,08,599 పాలుపంచుకోనున్నారని, అందులో 11,320 సర్వీస్ ఓటర్లు, 1,731 మంది ఓవర్సీస్ ఓటర్లు ఉన్నారన్నారు. ఆ ప్రాంతాల్లో 4 గంటలకే ప్రచారం బంద్ రాష్ట్రంలోని 5 లోక్‌సభ స్థానాల పరిధిలోని 13 వామపక్ష తీవ్రవాద ప్రభావిత అసెంబ్లీ ప్రాంతాల్లో పోలిం గ్ వేళలను తగ్గిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలోని సిర్పూర్, ఆసిఫాబాద్, పెద్దపల్లి లోక్‌సభ స్థానం పరిధిలోని చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, వరంగల్ లోక్‌సభ స్థానం పరిధిలోని భూపాలపల్లి, మహబూబాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలోని ములు గు, పినపాక, ఎల్లెందు, భద్రాచలం, ఖమ్మం లోక్‌సభ స్థానం పరిధిలోని కొత్తగూడెం, అశ్వారావుపేట అసెంబ్లీ ప్రాంతాల పరిధిలో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 వరకు మాత్రమే పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాల పరిధిలోని లోక్‌సభ ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రం 4తో ముగియనుందని తెలిపారు. ఓటరు స్లిప్పుతోనే ఓటేయలేరు ఓటు వేసేందుకు ఓటరు స్లిప్పును గుర్తింపు కార్డుగా పరిగణించమని రజత్‌కుమార్ తెలిపారు. ఓటరు తప్పనిసరిగా ఓటరు గుర్తింపు కార్డు లేదా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిన 11 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒక కార్డును చూపిస్తేనే ఓటేసేందుకు అనుమతిస్తామన్నారు. నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో అన్ని పోలింగ్ కేంద్రాలతో పాటు రాష్ట్రం లోని 6,445 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. నిజామాబాద్ స్థానంలో ఎన్నికల నిర్వహణకు వినియోగించనున్న ఎం–3 మోడల్ ఈవీఎంలకు ప్రథమ స్థాయి తనిఖీలు పూర్తి చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 34,604 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, అందులోని 4,169 కేంద్రాల్లో వెబ్‌క్యాస్టింగ్ నిర్వహిస్తున్నామని రజత్‌కుమార్ వెల్లడించారు. మిగతా పోలింగ్ కేంద్రాల్లో డిజిటల్ కెమెరా, వీడియో రికార్డింగ్ ఏర్పాట్లు చేశామన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది అందరూ తమ ఓటు హక్కు కలిగిన లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోనే పనిచేస్తున్నారని, అందులో 80% మందికి ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్ ద్వారా పనిచేసే చోటే ఈవీఎంతో ఓటేసే అవకాశం కల్పిస్తున్నామన్నా రు. సామాజిక మాధ్యమాల్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబం ధించి ఇప్పటి వరకు 460 కేసులు, పెయిడ్ న్యూస్‌కు సంబంధించి 579 కేసులు బుక్ చేశామన్నారు. సీఎం కేసీఆర్ పథకాలపై రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ ఎస్కే జోషి ప్రగతి నివేదికను విడుదల చేసిన ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదికను పంపించామన్నారు. కమలనాథుల్లోనూ ఉత్సాహం జాతీయ రాజకీయాలతో ముడిపడి ఉన్న ఈ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. ప్రధాని మోదీ తో పాటు పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా కూడా ఎన్నికల ప్రచారానికి రావడంతో కమలనాథులు ఒకింత ఉత్సాహంగానే ప్రచారంలో పాల్గొన్నారు. మహబూబ్‌నగర్, ఎల్బీ స్టేడియం సభల్లో మోదీ.. టీఆర్ఎస్ను లక్ష్యంగా చేసుకుని మాటల తూటాలు పేల్చారు. వీరిద్దరితో పాటు కేంద్రమంత్రులు సుష్మా స్వరాజ్, రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్, షానవాజ్ హుస్సేన్, హర్దీప్సింగ్ పురి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు రాంమాధవ్, మురళీధర్‌రావు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వంటి ప్రముఖులు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. చివరిరోజు కూడా అమిత్‌షా చేవెళ్ల పార్లమెంటు పరిధిలో ప్రచారానికి వస్తున్నారు. ముఖ్యంగా తాము ప్రభావం చూపగలిగిన స్థానాలపై ప్రత్యేక దృష్టిపెట్టిన బీజే పీ నేతలు ఆయా స్థానాల్లోనే పార్టీ అగ్రనేతల చేత ప్రచా రం చేయించారు. లోక్‌సభ బీజేపీ ఎన్నికల ప్రచారం కూడా సందడిగానే సాగింది. రాహుల్ గాంధీ ఒక్కసారే! ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ చప్పగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినా చివరికొచ్చేసరికి ఊపందు కుంది. ఆ పార్టీ పక్షాన ముఖ్య నేతలంతా దాదాపు పోటీలో ఉండడంతో వారు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ప్రచార సందడి జోరుమీద కనిపించింది. ఉత్తమ్, కోమటిరెడ్డి, రేవంత్, విశ్వేశ్వర్‌రెడ్డి, రేణుకలతో పాటు మిగిలిన అభ్యర్థులు గత 15 రోజులుగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. రోడ్‌షోలు, బహిరంగసభలతో కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఆ పార్టీ అధినేత రాహుల్‌గాంధీ ఈసారి ఒక్కటే రోజు ప్రచారంలో పాల్గొన్నారు. జహీరాబాద్, నాగర్‌కర్నూ ల్, నల్లగొండ పార్లమెంటు స్థానాల పరిధిలో ఒకే రోజు ఆయన మూడు బహిరంగ సభల్లో పాల్గొన్నా రు. సోనియా కూడా వస్తారని, రాహుల్ మరోసారి వస్తారని భావించినా సాధ్యం కాలేదు. పార్టీ ముఖ్య నేతలు గులాంనబీ ఆజాద్, రాజస్తాన్ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ తదితరులు ప్రచారానికి వచ్చారు. మొత్తంమీద ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా ఒకింత ఆశలతోనే లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించింది. సీపీఐ, సీపీఎంల పక్షాన కూడా ఆయా పార్టీల అగ్రనేతలు ఈసారి ఎన్నికల ప్రచారం లో పాల్గొన్నారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందా కారత్, బీవీ రాఘవులు, సీపీఎం జాతీయ ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి తదితరులు తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. డబ్బు పంపిణీపై జాగ్రత్త ఓటింగ్ గదిలో ఓటే స్తూ సెల్ఫీలు తీసుకుంటే కేసులు తప్పవని రజత్‌కుమార్ హెచ్చరించారు. రహస్య ఓటింగ్ విధానంలో ఎన్నికలు నిర్వహిస్తున్నామని, దీనికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. కుల, మతాల ప్రాతిపదికన సమావేశాలు పెట్టి ఓట్లు అభ్యర్థించడం నేరమన్నారు. ఇలా ఎన్నికల్లో గెలిచినా, న్యాయ స్థానంలో ఎలక్షన్ పిటిషన్ పడితే పదవిని కోల్పోవాల్సి వస్తుందన్నారు. డబ్బులు, మద్యం పంపిణీ చేసినా ఇలానే ఎలక్షన్ పిటిషన్ ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. టీఆర్ఎస్ దూకుడు.. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు గాను 16 స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం ప్రారంభించిన టీఆర్ఎస్ జోరుగా దూసుకెళ్లింది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఏకంగా 14 లోక్‌సభ స్థానాల పరిధిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో పాల్గొని క్షేత్రస్థాయి శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నంచేశారు. రానున్న రోజుల్లో ప్రాంతీయ పార్టీలదే భవిష్యత్తు అంటూ థర్డ్‌ఫ్రంట్ పోషించాల్సిన కీలకపాత్ర ఆవశ్యకత గురించి ఓటర్లకు చెప్పే ప్రయత్నం చేశారు. తాను ఓవైపు సభల్లో పాల్గొంటూనే మరోవైపు పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, పార్టీ నేతలు, అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారాయన. కేసీఆర్‌కు తోడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఎన్నికల ప్రచారంలో కీలకంగా పాల్గొన్నా రు. చేవెళ్ల, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల్లోని అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఆయన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోడ్‌షోలు నిర్వహించి పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. దీంతో పాటు మిగిలిన స్థానాల్లో కూడా కొన్ని చోట్ల ఆయన బహిరంగసభల్లో పాల్గొన్నారు. మొత్తం మీద కేసీఆర్, కేటీఆర్‌లే స్టార్ క్యాంపెయినర్లుగా అధికార పార్టీ లోక్‌సభ ఎన్నికల ప్రచారం సాగింది. -
ఎన్నికలు వాయిదా వేయరాదు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ఏర్పాట్ల పేరుతో నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయరాదని కాంగ్రెస్ కోరింది. షెడ్యూల్ ప్రకారమే ఇక్కడ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) రజత్‌కుమార్‌కు సోమవారం టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ కన్వీనర్ ఎన్.నిరంజన్ లేఖ రాశారు. వీవీప్యాట్ రశీదులను ఏడు సెకన్ల పాటే ప్రదర్శిస్తుండడంతో ఓటు ఎవరికి పడిందో గుర్తించడానికి ఓటర్లు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. వీవీప్యాట్ల రశీదులను 30 సెకన్లపాటు ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నిజామాబాద్ నుంచి పోటీ చేస్తున్న 185 మంది అభ్యర్థుల్లో తమకు కావాల్సిన అభ్యర్థిని 12 బ్యాలెట్ యూనిట్లలో వెతికి గుర్తించడానికి సమయం పట్టనుందని, దీంతో పోలింగ్ వేళలను పెంచాలని కోరారు. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడ పోలింగ్ నిర్వహిస్తే సమయం సరిపడదని అన్నారు. -
‘రజత్ కుమార్ రాజ్యాంగానికి అతీతులు కాదు’
సాక్షి, హైదరాబాద్ : గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షులు కోదండరామ్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ..'రాజ్యాంగం రావటం అంటే.. రాజకీయ విప్లవం రావటమే. రాజ్యాంగ సమానతలు వచ్చాయి కానీ, సామాజిక సమానతలు మాత్రం రాలేదు. పాలకులు రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి పనిచేయాలి. భవిష్యత్తు నిర్మాణానికి రాజ్యాంగం ఓ బ్లూ ప్రింట్. పాలకులు అధికారంలోకి వచ్చాము ఏదైనా చేయొచ్చు అనే భావన వదిలేయాలి. రాజ్యాంగంలోని చట్టాలకు లోబడి పాలన సాగించాలి. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ రాజ్యాంగానికి అతీతులు కాదు. ఎవరైనా రాజ్యాంగంకి లోబడి పనిచేయాలి. ఎన్నికల కమిషన్ సలహాలు అవసరం లేదు. ఏం చేయాలో మాకు తెలుసు. కోర్టుకు వెళ్ళండి అని చెప్పాల్సిన అవసరం రజత్ కుమార్‌కి లేదు. అడిగే హక్కు మాకుంది. సమాధానం చెప్పాల్సిన బాధ్యత రజత్ కుమార్ మీద ఉంది. భారత రత్నలో తెలంగాణకు అన్యాయం జరిగింది. బాధ కలిగింది' అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఆధికార ప్రతినిధి యోగెశ్వర రెడ్డి వెదిరె, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బద్రుద్దిన్లతో పాటూ కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఎడ్ల బండిలో తిరుగుతున్నారా?
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ నుండి 25న జాతీయ ఓటర్ల దినోత్సవ ఆహ్వానం వచ్చిందని మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. ఈ సారి ఓటర్స్ డే థీమ్ ఒక్క ఓటర్ను వదిలిపెట్టొద్దని తనతో చెప్పారన్నారు. గత ఎన్నికల్లో లక్షలాది ఓటర్లను తొలగించామని రజత్ కుమార్ అంగీకరించారని, పార్లమెంట్ ఎన్నికల నాటికి అర్హులందర్ని ఓటరు జాబితాలో చేరుస్తామన్న హామీ నెరవేరే పరిస్థితి కనిపించడం లేదన్నారు. అందుకే ఈ ఓటర్స్ డేను బహిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. రేపటి ధర్నాలో అధికార పార్టీకి తొత్తుగా ఉన్న ఎన్నికల సంఘంపై తమ వైఖరి చెబుతామన్నారు. ధర్నాకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జానారెడ్డి, షబ్బీర్ అలీ, రేవంత్ రెడ్డి, డీకే అరుణలతో పాటు సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్, ఎంబీటీ నేతలను ఆహ్వానించామని తెలిపారు. విమానాలు ట్యాంపరింగ్ జరిగితే ఎడ్ల బండిలో తిరుగుతారా? అన్న రజత్ కుమార్ వ్యాఖ్యలపై శశిధర్ రెడ్డి మండిపడ్డారు. అమెరికా విమానాలను కాదని ఎడ్ల బండిలో తిరుగుతుందా, అక్కడ బ్యాలెట్‌లోనే ఎన్నికలు జరుగుతున్నాయి కదా అని ధ్వజమెత్తారు. ఈవీఎం మొట్టమొదట ప్రవేశ పెట్టిన జపాన్‌లో కూడా ఇప్పుడు బ్యాటెట్ పేపర్‌తో ఎన్నికలు నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కువగా బ్యాలెట్ పేపర్లోనే ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. ఈవీఎంలపై విశ్వాసం లేదనే వీవీ ప్యాట్ తీసుకొచ్చారని మరిచి పోవద్దన్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీ నియామకం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆమె రాకతో దేశ వ్యాప్తంగా మరింత బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు. -
అత్యధికం నర్సంపేట.. అత్యల్పం యాకుత్‌పురా:ఈసీ
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రజత్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. ఈ సారి ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని తెలిపారు. కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని వెల్లడించారు. ఎన్నికలకు సంబంధించి న్యూస్ కవరేజీ చేసినందుకు, ప్రశాంతంగా జరగడానికి దోహదపడినందుకు మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. 2014లో తెలంగాణాలో 69.5 శాతం ఓటింగ్ నమోదైందని, కానీ సాయంత్ర 5 గంటల వరకు అందిన రిపోర్టు ప్రకారం ఈ సారి 67 శాతం ఓటింగ్ జరిగినట్లు వివరించారు. మరో రెండు మూడు శాతం పోలింగ్ ముగిసేనాటికి పెరగవచ్చునని వ్యాఖ్యానించారు. అన్ని పోలింగ్ స్టేషన్లలో దాదాపుగా ఉదయం ఏడున్నర గంటలకు పోలింగ్ ప్రారంభమైందని తెలిపారు. కొన్ని చోట్ల ఈవీఎం, వీవీపాట్లు మొరాయించాయని వాటి స్థానంలో వేరే వాటిని మార్చామని తెలిపారు. 754 బ్యాలెట్ యూనిట్లు, 628 కంట్రోల్ యూనిట్లు, 1444 వీవీపాట్లు పోలింగ్ జరుగుతుండగా మార్చినట్లు వివరించారు. ఎన్నికల అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించారని కొనియాడారు. లెటర్, ఈ-మెయిల్స్, పర్సనల్‌గా 1042 ఫిర్యాదులు అందాయని, అలాగే నేషనల్ గ్రీవెన్స్ ద్వారా 3250 ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించారు. వీటిలో 3650 ఫిర్యాదులు అప్పటికప్పుడు పరిష్కరించామని, మరో 642 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. గత ఎన్నికల్లో రూ.76 కోట్ల నగదును సీజ్ చేయగా ఈసారి 117 కోట్ల నగదు సీజ్ చేశారు. 2014లో 2.8 లక్షల లీటర్ల మద్యం సీజ్ చేయగా 2018లో 5.5 లక్షల లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈసారి గుడుంబా సమస్య లేదని పూర్తిగా సమసిపోయిందని వివరించారు. పట్టుబడిన లిక్కర్ విలువ రూ.11.6 కోట్లు కాగా మరో రూ 9.6 కోట్లు బంగారం, వెండి, బహుమతుల రూపంలో స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా రూ.138 కోట్ల విలువైన నగదును సీజ్ చేసినట్లు రజత్ కుమార్ వెల్లడించారు. పోలీసులు కూడా లా అండ్ ఆర్డర్ చక్కగా మేనేజ్ చేశారని కితాబిచ్చారు. ఓటరు లిస్టులో పేరు లేని వారు క్షమించండి ఓటరు లిస్టులో పేరు లేని వారు క్షమించాలని , మరోసారి పొరపాటు జరగకుండా చూసుకుంటామని చెప్పారు. 3 లక్షల చనిపోయిన ఓటర్లు, 2 లక్షల డూప్లికేట్ ఓట్లు తొలగించామని, అలాగే 25 లక్షల కొత్త ఓటర్లకు ఓటు హక్కు కల్పించామని వెల్లడించారు. బోగస్ ఓట్ల గురించి రాజకీయ పార్టీలు ఫిర్యాదు చేశాయి..ఒకసారి మాక్ ఓటర్ జాబితా వస్తే దాన్ని మార్చలేమని చెప్పారు. ఓట్లు తొలగించిన వారికి మళ్లీ దరఖాస్తు చేసుకుంటే వచ్చాయని తెలిపారు. దరఖాస్తు చేయని వారికి రాలేదన్నారు. అత్యధికంగా నర్సంపేటలో 84 శాతం, ఆలేరు 83.02 శాతం పోలింగ్ నమోదు అయిందని, అత్యల్పంగా యాకుత్‌పురాలో 33 శాతం పోలింగ్ నమోదైందని రజత్ కుమార్ అన్నారు. ఆదిలాబాద్‌లో 76.5 శాతం, వరంగల్ రూరల్ జిల్లాలో 76 శాతం, హైదరాబాద్ జిల్లా 50 శాతం పోలింగ్ జరిగిందని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా కూడా రీపోలింగ్ కోసం అభ్యర్థనలు రాలేదన్నారు. 119 నియోజకవర్గాల్లో కౌంటింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. -
పోలింగ్ డే; వాహనదారులకు ఊరట
సాక్షి, హైదరాబాద్: పోలింగ్ సమయాన్ని పెంచేది లేదని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) రజత్ కుమార్ స్పష్టం చేశారు. సాంకేతిక సమస్యలతో చాలా చోట్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైన నేపథ్యంలో సమయాన్ని పెంచాలని ఓటర్లు కోరుతున్నారు. దీనిపై రజత్‌కుమార్ స్పందిస్తూ.. నిర్ణీత సమయానికే పోలింగ్ ప్రారంభమైందన్నారు. ఒకటి రెండు చోట్ల మాత్రమే సమస్యలు తలెత్తాయని, ఓటర్లు ఎక్కడా వెనుదిరగలేదని చెప్పారు. పరిష్కరించలేని సాంకేతిక సమస్యలు ఇప్పటివరకు ఎదురుకాలేదన్నారు. కాగా, 229 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈరోజు వాహనదారులకు టోల్‌ప్లాజా రుసుం చెల్లింపు నుంచి ఎన్నికల సంఘం ఊరట కల్పించింది. వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది. వాహనదారులకు టోల్‌ప్లాజా రుసుం చెల్లింపు నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎన్నికల సంఘం ఆదేశించింది. -
ఓటు హక్కే కాదు బాధ్యత
సాక్షి, హైదరాబాద్: ‘ప్రజాస్వామ్యం దేవాలయం వంటిది. ఎవరో చెప్పారని, ఎవరు బలవంత పెట్టారనో, తాయిలాలు ఇచ్చారనో కాకుండా, అంతరాత్మ ప్రబోధంతో గుడికి వెళ్లి ప్రార్థన చేసి వచ్చినంత పవి త్రంగా ప్రతి ఒక్క పౌరుడూ పోలింగ్ కేంద్రానికి బాధ్యతతో వెళ్ళి ఓటు వేసి రావాలి’ అని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) రజత్‌కుమార్ పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లను చైతన్యపరచడానికి విస్తృతంగా కృషి చేసినందు వల్ల గత ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ శాతం పెరగవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓటును కేవలం హక్కుగానే కాకుండా ఓటర్లు బాధ్యతను గుర్తించి ఓటేయాలని కోరారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవడానికి నేడు సెలవు కూడా ప్రకటించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు తెలంగాణ శాసనసభ పరిధిలోని 119 నియోజకవర్గాలకు శుక్రవారం ఎన్నికలు స్వేచ్ఛగా, శాంతియుతం గా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లతో సర్వ సన్నద్ధంగా ఉన్నట్లు సీఈ ఓ ప్రకటించారు. ఎన్నికల ఏర్పాట్లపై గురువారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. శుక్రవారం సాయంత్రం 5 వరకు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వారికి టోకెన్లు ఇచ్చి వారికి రాత్రి 7 వరకు ఓటేసే అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఈ ఎన్నికల్లో తొలిసారి ఈవీఎంలతో పాటు వీవీ ప్యాట్లను వినియోగిస్తున్నామన్నారు. ఈవీఎంల వినియోగం పట్ల అపోహలను తొలగించడానికి, అవగాహన కల్పించడానికి రాష్ట్రవ్యాప్తంగా నమూనా పోలింగ్ నిర్వహించామని, ఎటువంటి ఫిర్యాదు రాలేదన్నా రు. ఇప్పుడు మొత్తం 44,415 బ్యాలెట్ యూనిట్లను (7,557 అదనంగా), 32,016 కంట్రోల్ యూనిట్లను (4,432 అదనంగా), 32,016 వీవీప్యాట్ల (5,261, అదనంగా)ను ఓటర్లు ఉపయోగించుకోబోతున్నారని చెప్పారు. సాంకేతిక లోపాలను సరిదిద్దేందుకు 240 మంది బీఈఎల్/ఈసీఐఎల్ ఇంజనీర్లను అన్నిచోట్ల అందుబాటులో ఉంచామని తెలిపారు. అరగంటలో కొత్త ఈవీఎంల ఏర్పాటు ఈవీఎంలతో అత్యాధునిక సాఫ్ట్వేర్ వినియోగిస్తున్నామని రజత్‌కుమార్ చెప్పారు. ఈవీఎంలతో ఎక్కడా ఎలాంటి సమస్యలు రావని, పోలింగ్ ప్రక్రియ ఎక్కడా ఆగదని వెల్లడించారు. ప్రతి సెక్టార్ మేజిస్ట్రేట్ వద్ద 2 ఈవీఎంలు, వీవీప్యాట్లు అదనంగా అందుబాటులో ఉంటాయని, ఎక్కడైనా ఈవీ ఎంలు మొరాయిస్తే కేవలం 30 నిమిషాల్లో కొత్తవి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో భాగంగా ఇప్పటివరకు రూ.135 కోట్లు సీజ్ చేశామని, ఇప్పటివరకు ఇదే రికార్డు అని చెప్పారు. కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి అరెస్టు ఘటనపై వచ్చిన ఫిర్యాదును కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలన జరుపుతోందన్నారు. డిసెంబర్ 26 నుంచి పార్లమెంటు ఎన్నికల కోసం ఓటర్ల జాబితా రూపకల్పన ప్రారంభిస్తామని, ఓటు లేని వాళ్ళు ఓటరుగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. తుది జాబితాలో కొన్ని తప్పులున్నాయని ఫిర్యాదులున్న నేపథ్యంలో మళ్ళీ పరిశీలన చేసి సరిదిద్దుతామని చెప్పారు. -
తీవ్రంగా కలతచెందిన సీఈఓ
సాక్షి, హైదరాబాద్: రేవంత్‌రెడ్డి అరెస్టు ఘటనను హైకోర్టుతోపాటు కేంద్ర ఎన్నికల సంఘం సైతం తీవ్రంగా తప్పుబట్టడంతో సీఈఓ రజత్‌కుమార్ కలత చెందారు. సజావుగా సాగుతున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికలు మరో వారంలో ముగుస్తాయన్న తరుణంలో ఈ ఘటనతో ఆయన తీవ్ర ఆగ్రహానికి లోనైయ్యారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. రెండ్రోజులుగా సీఈఓను కలిసేందుకు ఆయన కార్యాలయ వర్గాలు సైతం భయపడుతున్నట్లు సమాచారం. రాష్ట్ర శాసనసభ రద్దయినప్పటి నుంచి రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నిర్వహణకు గత నాలుగు నెలలుగా పడిన కష్టం ఈ ఒక్క ఘటనతో విలువ లేకుండా పోయిందని సీఈఓ ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. రేవంత్ అరెస్టుపై దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ సందర్భంగా.. ఎన్నికల సంఘం పనితీరుపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఆయన కలత చెందారు. ‘అవసరమైన చర్యలకే’ ఆదేశం ఈ నెల 4న కొడంగల్‌లో సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించడాన్ని వ్యతిరేకి స్తూ రేవంత్‌రెడ్డి బంద్‌కు పిలుపునివ్వడం, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి నిరసనలు తెలపాలని కోరిన విషయం తెలిసిందే. రేవంత్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేయగా, సీఎం సభ రోజు శాంతిభద్రతల సమస్య రాకుండా ‘అవసరమైన చర్యలు’ తీసుకోవాలని మాత్రమే సీఈఓ పోలీసు శాఖకు ఆదేశించారని అధికారవర్గాలంటున్నాయి. రేవంత్ దుందుడుకు స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుని ముందు జాగ్రత్త చర్యగా ఆయనను అరెస్టు చేయాలని ఎస్పీ అన్నపూర్ణ నిర్ణయం తీసుకున్నారని, ఆయన్ను అరెస్టు చేసి తరలించకుండా గృహ నిర్బంధంలో ఉంచితే వివాదానికి అవకాశముండేది కాదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. రేవంత్ అరెస్టు పట్ల ఎన్నికల సంఘం పనితీరుపై ప్రశ్నలు తలెత్తుతుండటంతో సీఈఓ తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు సమాచారం. గత రెండ్రోజులుగా ఆయన విలేకరులను సైతం కలవడానికి ఇష్టపడకపోవడం గమనార్హం. -
రేపు సాయంత్రం 5లోపు ప్రచారం బంద్!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో రేపు (డిసెంబర్ 5) సాయంత్రం 5 గంటల నుంచి బహిరంగ సభలు నిర్వహించడం నిషిద్ధమని ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ తెలిపారు. నిషిద్ధ సమయంలో బహిరంగ సభలు, ఊరేగింపులు, సందేశాలు ప్రసారం, ఒపీనియన్ పోల్స్ సర్వేలు, ఇతరాత్ర కార్యక్రమాలు ప్రసారం చేయడం నిబంధనల ఉల్లంఘనకు వస్తుందన్నారు. సిర్పూర్, బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల, అసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో రేపు సాయంత్ర నాలుగు గంటలకే ప్రచారం నిషేధమని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి చట్టప్రకారం రెండేళ్ల జైలు శిక్ష, లేదా జరిమానా విధించే అవకాశం ఉందని వివరించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 126 ప్రకారం ఈ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారులకు రజత్ కుమార్ ఆదేశాలు జారీచేశారు. -
డిసెంబర్ 7న సెలవే
సాక్షి, హైదరాబాద్: డిసెంబర్ 7న ముమ్మాటికీ వేతనంతో కూడిన సెలవేనని, ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదని ఎన్నికల సంఘం ప్రధానాధికారి సీఈఓ రజత్ కుమార్ స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన, సంయుక్త ముఖ్య ఎన్నికల అధికారి ఆమ్రపాలితో కలిసి మాట్లాడారు. ఆ రోజు పౌరులంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, విధిగా ఓటింగ్‌లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఓటరు స్లిప్పుల పంపిణీ వేగంగా జరుగుతోందని చెప్పారు. 77 అసెంబ్లీ నియోజకవర్గాలకు బ్యాలెట్ పేపర్ల ముద్రణ పూర్తయిందన్నారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణ 30వ తేదీ ఉదయానికి పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈవీఎంలు, వీవీ ప్యాట్ యంత్రాలు చేరుకున్నాయని వెల్లడించారు. లోగో డిజైన్‌కు బహుమతి.. ఈ సందర్భంగా ‘నా వోట్ యాప్’ను సీఈఓ రజత్ కుమార్ ఆవిష్కరించారు. ఓటర్లకు ఉపయుక్తంగా ఉండేలా దీన్ని రూపొందించామని తెలిపారు. అనంతరం యాప్ ప్రత్యేకతలను ఆమ్రపాలి వివరించారు. ఈ యాప్ అన్ని ఐఓఎస్, ఆండ్రాయిడ్ ప్లేస్టోర్లలో అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఇందులో పేరు లేదా ఎపిక్ నంబరు టైప్ చేయగానే.. ఓటరుకు సమీపంలో ఉన్న పోలింగ్ బూత్, అధికారుల వివరాలు ప్రత్యక్షమవుతాయని చెప్పారు. నా వోట్ లోగో డిజైన్ కోసం దరఖాస్తులను ఆçహ్వానించారు. తెలుగు, హిందీ, ఊర్దూలలో చక్కటి లోగో పంపిన వారికి రూ. 15,000 బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఎంట్రీలను నవంబర్ 30 నుంచి డిసెంబర్ 6వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా పంపాలని చెప్పారు. ఉత్తమ ఎంట్రీని డిసెంబర్ 10న ప్రకటిస్తామని తెలిపారు. దరఖాస్తులను n్చ్చఠి్టౌ్ఛ్టటఃజఝ్చజీ . ఛిౌఝ మెయిల్‌కు పంపాల్సి ఉంటుంది. ఆ నగదు నరేందర్‌రెడ్డి అనుచరుడిదే.. కొడంగల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి అనుచరుడి ఇంట్లో జరిగినవి ఐటీ దాడులేనని రజత్ కుమార్ స్పష్టతనిచ్చారు. దాడులు జరిగినవి నరేందర్‌రెడ్డి సంబంధీకుడు శేఖర్‌రెడ్డికి చెందిన ఫాంహౌస్‌లో అని తెలిపారు. ఈ దాడిలో దాదాపు రూ. 51 లక్షల నగదు దొరికిందని, దీనిపై కేంద్ర ప్రధాన ఎన్నికల సంఘానికి నివేదిక పంపామని వెల్లడించారు. ఇప్పటిదాకా మొత్తం రూ. 105 కోట్ల నగదు పట్టుకున్నామని తెలిపారు. ఇందులో ఎవరికీ చెందని సొమ్మే అధికంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతిభవన్‌లో కండువాలు కప్పిన విషయంపై ఇంకా వివరణ రాలేదని, వచ్చాక స్పందిస్తానని చెప్పారు. 7న సెలవు పాటించాల్సిందే.. డిసెంబర్ 7న దేశ రక్షణ, భద్రతా కారణాలు తప్ప అన్ని కంపెనీలు, సంస్థలూ అందరూ సెలవు పాటించేల్సిందేనని రజత్ కుమార్ స్పష్టం చేశారు. ఐటీ, సాఫ్ట్వేర్ రంగ ప్రముఖులతో గురువారం ఇష్టాగోష్టి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశం, ప్రజాస్వామ్యం.. వీటిదే మొదటి ప్రాధాన్యతగా ఉండాలని, మీరంతా మార్పునకు ప్రతినిధులుగా వ్యవహరించాలని ఉద్బోధించారు. విదేశీ ఖాతాదారుల ప్రయోజనాల దృష్ట్యా అక్కడి వారి పనివేళలను అనుసరించడం తదితర కారణాల వల్ల రోజంతా పూర్తిగా సెలవు ప్రకటించకుండా తమకు మినహాయింపు ఇవ్వాలని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్.సి.ఎస్.సి) ప్రతినిధులు కోరారు. ఓటు వేసే బాధ్యతను పక్కనబెట్టి, మనదేశ వ్యవస్థను విదేశాలతో పోల్చి బాగాలేదనడం సరికాదని రజత్ కుమార్ వారికి హితవు పలికారు. ఐటీ కంపెనీల్లోనే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం సాధ్యం కాదన్నారు. ఓటు ప్రజాస్వామ్యానికి చిహ్నం.. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి చిహ్నమని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ శ్రీ మహేశ్ భగవత్ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఒక అభ్యర్థి కేవలం 45 ఓట్ల తేడాతో గెలిచాడనీ, దీనిని బట్టి ఒక్క మాదాపూర్‌లోనే ఉన్న 24 వేల మంది ఐటీ ఉద్యోగులు ఓటింగ్ సరళిలో, అభ్యర్థుల గెలుపోటముల్లో ఎంత మార్పు తీసుకురాగలరో ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ సెంట్రల్ జోన్ కమిషనర్ శ్రీమతి హరిచందన, కార్మికవిభాగం జాయింట్ కమిషనర్ ఆర్.చంద్రశేఖర్, ఎస్.సి.ఎస్.సి కార్యదర్శి, ఇన్ఫోపీర్స్ సీఈఓ భరణీ కుమార్ ఆరోల్, రాష్ట్ర ఐటీ ప్రిన్సిపల్ కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. -
టీ అమ్ముకుంటాను.. కానీ ఓటమ్ముకోను
సాక్షి, సూపర్‌బజార్(కొత్తగూడెం): ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో చైతన్యం పెంచేందుకు ఎన్నికల అధికారులు వినూత్న రీతిలో అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ ప్రత్యేక దృష్టి పెట్టి విస్తృతస్థాయిలో ప్రచారం చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. ఈవీఎం, వీవీప్యాట్ల వినియోగంపై మారుమూల గ్రామాల్లో కూడా అవగాహన కల్పించారు. పోస్టర్లు, ఆకాశవాణి ద్వారా కూడా ప్రచారం చేపట్టారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో, వాహనాలు సైతం వెళ్లడానికి అవకాశం లేని ప్రాంతాలకు ప్రత్యేకంగా పోలీస్ అధికారితో కలిసి మోటారుసైకిల్‌పై 21 కిలోమీటర్లు ప్రయాణించి ఆయా గ్రామాలకు చేరుకుని ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ప్రజలకు ఓటు హక్కు విలువను తెలియజేసే విధంగా కూరగాయల, పండ్ల వ్యాపారులకు ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకుంటాం.. ప్రలోభాలకు గురికాం అనే ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. మండల సమాఖ్య, డ్వాక్రాసంఘ సమావేశాల్లో మహిళలకు, కళాశాలల్లో యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దివ్యాంగులకు కల్పిస్తున్న రవాణా సౌకర్యాలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అంతర్జాతీయ స్థాయిలో విలువిద్యలో జిల్లా కీర్తిప్రతిష్టలను ఇనుమడింపచేసిన గొంది మారెప్పను ఐకాన్‌గా నియమించారు. జిల్లాలో గత ఎన్నికల్లో నమోదైన 70 శాతం ఓటింగ్‌ను ఈసారి మరింత పెంచాలని కలెక్టర్, ఇతర అధికారులు కృషి చేస్తున్నారు. -
మొత్తం 3583 నామినేషన్లు : రజత్ కుమార్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో మొత్తం 2.8 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలకు తుది ఓటర్ల జాబితా అందజేస్తామన్నారు. 23 నుంచి 1 డిసెంబర్ వరకు ఓటర్ స్లిప్స్ పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. ఫోటో ఓటర్ స్లిప్పులు కూడా ఇస్తామన్నారు. మీడియా సమావేశంలో ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై మాట్లాడారు. ఈ సందర్భంగా రజత్ కుమార్ మాట్లాడుతూ.. 'ఓటింగ్ శాతం పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాము. 2014 ఎన్నికలకు 2018 ఎన్నికలకు పోలింగ్ కేంద్రాల విషయంలో తేడా ఉంది. ఇంకా కొన్ని పోలింగ్ కేంద్రాలను మార్చే అవకాశం ఉంది. 9445 సర్వీస్ ఓటర్లు ఉన్నారు. ఓటర్ల నమోదు పెరిగింది. 1,60,509 మంది ఎన్నికల సిబ్బందిని వినియోగించుకుంటాం. రాష్ట్రంలో 35 వేల మంది పోలీసులు, 18 వేల మంది పోలీసులు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు. 279 సీఆర్పీఎఫ్ బలగాలు ఉంటాయి. వీరికి తోడు 20 శాతం సిబ్బంది అదనంగా ఉంటారు. మొత్తం 3583 నామినేషన్లు దాఖలు అయ్యాయి. 3500 కేసులు సీవిజిల్ కు వచ్చాయి. ఎపిక్ కార్డులు పంపిణీ ప్రారంభం అయ్యింది. ఈసేవలో 5 లక్షల కార్డులు అందుబాటులో ఉన్నాయి. నెల చివరి వరకు ఓటర్ల అందరికి ఎపిక్ కార్డులు అందజేస్తాం. ఎపిక్ బ్రెయిలి కార్డులను కూడా అందుబాటులో ఉంచాము. పోలింగ్ కేంద్రాల్లో ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ వాలంటీర్ల సేవలను ఉపయోగించుకుంటాం. కేసులు లేని అభ్యర్థులు పత్రికలలో, మీడియాలో ప్రకటనలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు 90.72 కోట్లు సీజ్ చేశాం. 77.38 నగదు, 7కోట్లు 55 లక్షల విలువైన లిక్కర్ మిగతావి నగలు సీజ్ చేశాం. సంగారెడ్డి కలెక్టర్‌పై వచ్చిన ఆరోపణలు అవాస్తవం అని మా పరిశీలనలో తేలింది. ఈసీఐకి నివేదిక సమర్పించాము. 23న బ్యాలెట్ ప్రింటింగ్ చేపడతాం. నామినేషన్ దాఖలు చేసే ప్రక్రియ నుంచే అభ్యర్థి ఖర్చు పరిగణనలోకి తీసుకుంటాం. హరీష్, రేవంత్, ఒంటేరు, రేవూరిలకు నోటీసులు ఇచ్చాము. వాళ్ళు వివరణ ఇచ్చారు. మా అభిప్రాయం ఈసీఐకి నివేదిక ఇచ్చాము. ఉత్తమ్ ఒక మత సమావేశంలో మాట్లాడారు దానిపై వివరణ ఇచ్చారు. గంగుల కమలాకర్ పై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. దీనిపై ఈసీఐకి నివేదిక ఇచ్చాము. ప్రగతి భవన్లో జరుగుతున్న రాజకీయ సమావేశాలపై పార్టీ ముఖ్యులకు నోటీసులు ఇచ్చాము. వాళ్ళు వివరణ ఇచ్చారు. దానిపై మా అభిప్రాయం ఈసీఐకి నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఏపీ ప్రభుత్వం తెలంగాణలో ప్రకటనలు ఇవ్వొద్దు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుంది. ఎన్నికల విధుల నుంచి ఆర్థిక శాఖ ఉద్యోగులకు మాత్రమే మినహాయింపు ఉంది. మరికొందరికి జిల్లా ఎన్నికల అధికారులు కూడా మినహాయింపు ఇచ్చే వెసులుబాటు ఉంది' అని రజత్ కుమార్ తెలిపారు. -
ప్రజలు ఓటేస్తేనే నేతల పిల్లలు ప్రజాప్రతినిధులవుతున్నారు
సాక్షి, హైదరాబాద్: ‘ఎన్నికల్లో ధనప్రవాహాన్ని అడ్డుకోవాలంటే మనలో మార్పు రావాలి. సామాజిక మార్పుతోనే ఇది సాధ్యమవుతుంది. డబ్బు తీసుకునే ఓట్లేస్తారని చాలా మంది అంటున్నారు. కానీ డబ్బు తీసుకున్న ఓటరు కచ్చితంగా ఆ అభ్యర్థికి ఓటేస్తారని అనుకుంటే పొరపాటు. కొన్ని సందర్భాల్లో ఇద్దరు, ముగ్గురు అభ్యర్థుల నుంచి కూడా డబ్బు తీసుకుని తనకు నచ్చిన వ్యక్తికే ఓటేస్తాడు. ఇలా డబ్బు తీసుకునే వాళ్లు చాలా తక్కువ. ఇది ఆర్థికపరమైన అంశాలతో ముడిపడి ఉంది’అని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) రజత్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన మీట్ ది ప్రెస్‌లో పాల్గొన్న ఆయన విలేకరుల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో ఎన్నికల ఖర్చు తక్కువగానే ఉందన్నారు. కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రూ. 86 కోట్లు సీజ్ చేశామని... అదే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా రూ. 800 కోట్లకుపైగా నగదును సీజ్ చేశారని గుర్తుచేశారు. వారసులను ప్రజలే ఎన్నుకుంటున్నారు రాజకీయ నాయకుల పిల్లలు నేరుగా పదవులు చేపట్టడం లేదని, లక్షల మంది ప్రజలు ఓట్లేస్తేనే ప్రజాప్రతినిధులవుతున్నారని రజత్ కుమార్ గుర్తుచేశారు. ప్రజలు కోరుకున్న వ్యక్తే నాయకుడవుతున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికలతోనే ప్రజాస్వామ్యం సాధ్యమని, అయితే ఇందులో కోరుకుంటున్న మార్పులు ఒక్కరోజుతో అయ్యేవి కావని, కానీ క్రమంగా ఆ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. అభ్యర్థుల వాస్తవ ఆదాయం, అఫిడవిట్లలో చూపుతున్న లెక్కలకు పొంతన ఉండటం లేదన్న విమర్శలపై స్పందిస్తూ అభ్యర్థులు సమర్పించిన లెక్కలను పరిగణిస్తామని, వాటిపై అభ్యంతరాలుంటే కోర్టును ఆశ్రయించవచ్చని రజత్ కుమార్ సూచించారు. ఎన్నికల సంఘం పరిమితులకు లోబడి పనిచేస్తుందని, నిబంధనల మేరకే నడుచుకుంటుందని, ఇందులో కొత్తగా తీసుకునే నిర్ణయాలుండవన్నారు. ఎన్నికల సంఘంపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని, తాను పనిచేసిన కాలంలో ఇప్పటివరకు రాజకీయ ఒత్తిళ్లకు గురికాలేదని చెప్పారు. అభ్యర్థులు నిబంధనలు ఉల్లంఘించినట్లు తమ దృష్టికి వస్తే ఎవరినీ ఉపేక్షించబోమని, అధికార పార్టీని ఒకలా, ప్రతిపక్ష పార్టీలను ఇంకోలా చూడాల్సిన అవసరం లేదన్నారు. ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలకు నోటీసులు జారీ చేస్తున్నామన్నారు. ఎన్నారైల ఓటు నమోదుకు అవకాశం ఇచ్చామని, తక్కువ మంది నమోదు చేసుకున్నారని, వారికి ఓటేసే అవకాశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. పోలింగ్ రోజు సెలవు ఇవ్వకపోవడం నేరమే పోలింగ్ రోజు వ్యాపార, వాణిజ్య సంస్థలు సెలవు ఇవ్వకపోతే నేరంగా పరిగణిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అకారి రజత్ కుమార్ స్పష్టం చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ లైవ్ ఉందని, వెబ్‌కాస్టింగ్ సర్వీసు లేని ప్రాంతాల్లో రికార్డింగ్ చేస్తామని పేర్కొన్నారు. పోలింగ్ సిబ్బంది కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తామని, పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ 55 శాతం మించడం లేదని, ఈసారి యువతే లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టామని ఆయన వివరించారు. గతంలో కంటే ఈసారి 120 శాతం అధికంగా యువత ఓటు హక్కు నమోదు కోసం ముందుకొచ్చారని రజత్ కుమార్ వివరించారు. కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ అధ్యక్ష, కార్యదర్శులు సోమయ్య, బసవ పున్నయ్య, ఉపాధ్యక్షుడు ప్రభాకర్, హెచ్‌యూజే ప్రధాన కార్యదర్శి గండ్ర నవీన్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల కేసు రుజువైతే కఠిన శిక్షలు : రజత్‌కుమార్
సాక్షి, హైదరాబాద్ : నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) రజత్‌కుమార్ తెలిపారు. అభ్యర్థులు కచ్చితంగా నిబంధనలు పాటించాలని, తెలియకపోతే పుస్తకాలు చదవాలని సూచించారు.17 నుంచి ఏజెన్సీ ప్రాంతంలోని పోలింగ్ కేంద్రాల తనిఖీ ఉంటుందన్నారు. అభ్యర్థులు రూ.10 వేలు మాత్రమే నగదు కలిగి ఉండొచ్చని, 10 వేల కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తే చెక్కుల రూపంలో చెల్లింపు చేయాలన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ప్రభావం ఉన్నంతగా తెలంగాణలో లేదని రజత్‌కుమార్ చెప్పారు. ఎన్నికల ప్రచారం చేస్తున్న నేతలపై మావోయిస్టులు నిఘా పెట్టినట్టు తెలుస్తుందని, అభ్యర్థులకు స్థానిక పోలీసులు భద్రత కల్పించాల్సి ఉంటుందని తెలిపారు. పక్క రాష్టాల ఎన్నికల అధికారులు కూడా వచ్చి ఇక్కడ సమావేశం నిర్వహిస్తున్నారని, తాను కూడా ఆ సమావేశానికి హాజరు అవుతానని చెప్పారు. ఇప్పటి వరకు 2614 సివిజిల్ ఫిర్యాదులు అందగా,1950 హెల్త్ లైన్ కు 78272 కాల్స్ వచ్చాయన్నారు. కుల, మత సమావేశాలు ఏర్పాటు చేసి ఓటర్లను ప్రభావితం చేయడం నేరం అన్నారు. సరైన సమాధానం రాకపోతే ఈసీఐకి పంపిస్తామన్నారు. ఎన్నికల కేసు రుజువు అయితే శిక్షలు కఠినంగా ఉంటాయన్నారు. కుల, మత సమావేశాలకు సంబంధించిన పూర్తి నిబంధనలు అన్ని పార్టీలకు పంపిస్తామన్నారు. సంగారెడ్డి కలెక్టర్ కేసుకు సంబంధించి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, ఆ విషయం తన దృష్టికి రాలేదని రజత్‌కుమార్ అన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులకు నోటీసులు ఇచ్చామని, కొందరి నుంచి సమాధానాలు వచ్చాయన్నారు. మిగిలినవారి నుంచి ఇంకా సమాధానం రాలేదన్నారు. స్మిత సబర్వాల్ పై మాజీ ఎంపీ మధుయాష్కీ ఫిర్యాదు చేసిన విషయం తన దృష్టికి రాలేదన్నారు. ఒక వేళ వస్తే వివరణ అడుగుతామని తెలిపారు. టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్‌కు భాష సక్రమంగా లేదని నోటీసులు ఇచ్చామన్నారు. కుల, మత సమావేశాలు నిర్వహిస్తే 153ఏ, 505 ఐపీసీ సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తామన్నారు. అభ్యంతరకరమైన భాష వాడినా కూడా కఠిన శిక్షలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పార్టీ కాబట్టి టీడీపీకి సైకిల్ గుర్తు ఇస్తామని, సమాజ్ వాదీ పార్టీకి మరో గుర్తు కేటాయిస్తామన్నారు. ఆన్లైన్లో ఓటర్లకు బహుమతులు పంపిణీ చేస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని, సోషల్ మీడియాలో అభ్యర్థుల ప్రచారంకు సంబంధించి ఖర్చును లెక్కింపు చేయడానికి థర్డ్ పార్టీతో ఒప్పందం చేసుకున్నామని రజత్‌కుమార్ అన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులపై పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించామని తెలిపారు. రెండు, మూడు ఓట్లు కలిగిన వారు ఒక్క ఓటే ఉపయోగించుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. 53 మంది వ్యయ పరిశీలకులు రాష్ట్రానికి వచ్చారని, ఒక్కో నియోజకవర్గానికి అసిస్టెంట్ అబ్జర్వర్ ఉంటారన్నారు. ఒక వీడియో గ్రాఫర్‌తో పాటూ మరొకరు ఉంటారని చెప్పారు. ఒక్కో నియోజకవర్గ పరిధిలో ఒక్కో అకౌంటింగ్ టీమ్ ఉంటుందన్నారు. ఇప్పుడు జరిగే ఎన్నికల్లో 47 మందిని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) అనర్హులుగా ప్రకటించిందని పేర్కొన్నారు. -
కేటీఆర్ వ్యాఖ్యలపై వివరణ కోరిన ఈసీ
సాక్షి, హైదరాబాద్ : సిరిసిల్లలో ఇటీవల జరిగిన ఓ సభలో ఆర్ఎంపీలు, పీఎంపీలకు ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ ఇచ్చిన వరాలపై ఎన్నికల కమీషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సిరిసిల్ల సభలో కేటీఆర్ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం లేఖ రాసింది. సిరిసిల్లలో జరిగిన సభలో ఆర్ఎంపీలు, పీఎంపీలు ఫుల్‌గా ప్రాక్టీస్ చేసుకునేలా ప్రస్తుతం ఉన్న జీఓను సవరిస్తామని వారికి తెలంగాణ సర్కారు పూర్తి సహకారం అందిస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు కుల సంఘాల సమావేశాలు ఏర్పాటు చేసి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. కేటీఆర్, హరీశ్ రావు, పలువురు టీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ, ఏఐసీసీ నేత మధుయాష్కీ, నిరంజన్లు రజత్ కుమార్‌ను కోరారు. -
తొలిరోజు 43 నామినేషన్లు: రజత్‌కుమార్
సాక్షి, హైదరాబాద్ : మంత్రులు కుల సంఘాల మీటింగ్‌లలో పాల్గొనవద్దని, కుల సంఘాల సమావేశాల్లో పాల్గొనడం ఎన్నికల ఉల్లంఘనగా పరిగణిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్ తెలిపారు. నామినేషన్ వేసినప్పటి నుంచి ఖర్చు లెక్కలోకి వస్తుందన్నారు. తొలిరోజు 43 నామినేషన్లు వచ్చాయని, ఇంకా 7 నియోజకవర్గాల నుంచి వివరాలు అందవల్సి ఉందన్నారు. ఎక్కువగా బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు వేశారని చెప్పారు. 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో మాత్రం ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో పోలింగ్ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటి వరకు రూ.77.62 కోట్ల నగదును సీజ్ చేసినట్టు రజత్ కుమార్ చెప్పారు. 4038 మద్యం దుకాణాలు తొలగించామన్నారు. 47,234 కేసులు నమోదయ్యాయన్నారు. సీ విజిల్ యాప్ ద్వారా 2251 ఫిర్యాదులు అందగా, 1279 పరిష్కరించామన్నారు. మొత్తం 2, 76, 29610 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని నోటీసులు ఇచ్చిన ముగ్గురు నేతలు బదులిచ్చారని పేర్కొన్నారు. తన మీద రాజకీయ ఒత్తిళ్లు లేవని రజత్ కుమార్ స్పష్టం చేశారు. బోగస్, డబుల్ ఓట్లు లక్ష 60 వేలు ఉన్నాయని, వాటి మీద కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశామన్నారు. -
అభ్యంతరకరమైన భాష వాడిన నేతలకు నోటీసులు
-
టీఆర్ఎస్కు పత్రిక లేదు
సాక్షి, హైదరాబాద్: టీఆ ర్ఎస్కు పార్టీ పత్రిక, వార్తా చానల్ లేదని ఆ పార్టీ ఎంపీ బి.వినోద్‌కుమార్ స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు చెందిన నమస్తే తెలంగాణ పత్రిక, టీ– న్యూస్ చానల్లో టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ప్రచారం కల్పిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదును ఆయన తోసిపుచ్చారు. పార్టీ ఎమ్మె ల్యే శ్రీనివాస్‌రెడ్డితో కలిసి బుధవారం సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈ ఓ) రజత్‌కుమార్‌ను కలిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ నిర్వహించే ఎన్నికల ప్రచార సభలకు హెలికాప్టర్ వినియోగం, స్టార్ క్యాంపెయినర్లతో ప్రచారం నిర్వహిం చడంపై సీఈఓను కలిసి అనుమానాలు నివృత్తి చేసుకున్నామని చెప్పారు. -
ఓటర్ల తుది జాబితా రెడీ: రజత్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ రద్దయిన నేపథ్యంలో ముందస్తు ఎన్నికల నిర్వహణ కోసం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా రెండో సవరణ కార్యక్రమం దాదాపు పూర్తయిందని, తుది జాబి తా ప్రచురణకు సిద్ధంగా ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్‌కుమార్ తెలిపారు. హైకోర్టు అనుమతి లభించిన నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారం ఈ నెల 12న ఓటర్ల తుది జాబితా ప్రచురిస్తామన్నారు. తొలిసారిగా ఈఆర్వో నెట్ వెబ్సైట్లో ఓటర్ల జాబితాను ప్రచురిస్తున్న నేపథ్యంలో పొరపాట్లు లేకుండా సరిచూసుకున్న తర్వాతే తుది జాబితా ప్రకటిస్తామన్నారు. ఎన్నికల ఏర్పాట్లపై బుధవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఓటర్ల సవరణ కార్యక్రమం కింద మొత్తం 33,14,006 దరఖాస్తులు రాగా వాటిలో కొత్త ఓటర్ల నమోదు (ఫారం–6)కు 22,36,677, ఓట్ల తొలగింపు (ఫారం–7)నకు 7,72,939, వివరాల సవరణ (ఫారం–8, 8ఏ)కు 2,91,256 దరఖాస్తులు వచ్చాయన్నారు. వచ్చిన దరఖాస్తుల్లో 30,00,872ను ఆమోదించగా, 3,12,335 దరఖాస్తులను తిరస్కరించామన్నా రు. 799 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.