సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో రేపు (డిసెంబర్ 5) సాయంత్రం 5 గంటల నుంచి బహిరంగ సభలు నిర్వహించడం నిషిద్ధమని ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ తెలిపారు. నిషిద్ధ సమయంలో బహిరంగ సభలు, ఊరేగింపులు, సందేశాలు ప్రసారం, ఒపీనియన్ పోల్స్ సర్వేలు, ఇతరాత్ర కార్యక్రమాలు ప్రసారం చేయడం నిబంధనల ఉల్లంఘనకు వస్తుందన్నారు.
సిర్పూర్, బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల, అసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో రేపు సాయంత్ర నాలుగు గంటలకే ప్రచారం నిషేధమని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి చట్టప్రకారం రెండేళ్ల జైలు శిక్ష, లేదా జరిమానా విధించే అవకాశం ఉందని వివరించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 126 ప్రకారం ఈ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారులకు రజత్ కుమార్ ఆదేశాలు జారీచేశారు.
Comments
Please login to add a commentAdd a comment