కాంగ్రెస్ ర్యాలీలో మాట్లాడుతున్న విజయరమణారావు
సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి పట్టణం బుధవారం జన జాతర జరిగింది. ఒక్కసారిగా జన సంద్రమైన జిల్లా కేంద్రం.. వేలాది సంఖ్యలో గులాబీ శ్రేణులు, ఖద్దరు దుస్తుల కాంగ్రెస్ కండువాలు.. కషాయంతో నిండిన బీజేపీ నేతలు తమ ఆఖరి మోఖా చూపించారు. కోలాటం గ్రూపు మహిళ బృందాలు, డోల్ దెబ్బ కళాకారులతో తమ అభ్యర్థులకు మద్దతుగా ఆయా పార్టీల కార్యకర్తలు నినదించారు. పట్టణంలో ఎక్కడ చూసినా బుధవారం జన సందోహంతో కిక్కిరిసింది. ఎన్నికల ప్రచారంలో చివరి నిమిషం వరకుకూ పార్టీల అభ్యర్థులు తమ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. పెద్దపల్లి పట్టణానికి ఉదయం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, విజయరమణారావు మద్దతు దారులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు సైతం ఉదయమే రంగంపల్లి నుంచి రాజీవ్‌రహదారి మీదుగా కమాన్ చౌరస్తా నుంచి అయ్యప్ప గుడివరకు ర్యాలీగా చేరుకున్నారు.
టీఆర్‌ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి స్థానిక రైల్వేస్టేషన్ ఏరియా నుంచి ర్యాలీ చేపట్టారు కళాకారులు, డప్పు వాయిద్యాం డోల్‌దెబ్బ బృందాలు గులాబీ దళంతో కలిసి కమాన్ మీదుగా తిరిగి జెండా చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు చేరుకున్నారు. పార్టీ అభ్యర్థుల ప్రచార రథాలు ముందుకు నడుస్తూండగా జనం, కళాకారుల అనుసరిస్తూ ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ ర్యాలీ అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి బీజేపీ అభ్యర్థి గుజ్జుల రామకృష్ణారెడ్డి భారీగా కార్యకర్తలతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. బీజేపీ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కాశిపేట లింగయ్య, రాష్ట్ర నాయకుడు మీస అర్జున్‌రావు. ఎస్. కుమార్, కొంతం శ్రీనివాస్‌రెడ్డి, కర్రె సంజీవరెడ్డి, రాంసింగ్, పుట్టమొండయ్య, పిన్నింటిరాజు తదితరులు పాల్గొన్నారు.
ట్రాఫిక్ ఇబ్బందులు
పట్టణంలో మూడు ప్రధాన పార్టీలు తమ బల ప్రదర్శనలో టీఆర్‌ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో కనిపించినట్లు స్థానికుల నుంచి వినిపించింది. గులాబీ దళం ప్రత్యేకిం చి పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టడంతో పలుమార్లు ఇక్కడ ట్రాఫిక్ స్తంభించింది. రెండు కిలోమీటర్ల ప్రయా ణం దాదాపు రెండు గంటలపాటు కొనసాగింది. ఉద యం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బస్సులు ఇతర వాహనాల రాకపోకలకు తరచూ ఇబ్బం దులు ఎదురయ్యాయి. ట్రాఫిక్ నియంత్రణ కోసం జి ల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన పోలీసు అధికారులు ఇక్కడ ట్రాఫిక్ నియంత్రణ విధుల్లో పాల్గొన్నారు.
ముగింపు ర్యాలీలో వెలిగిన ముఖాలు
ప్రచార ముగింపు సమయంలో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు చేపట్టిన ర్యాలీతో ప్రత్యర్థులు దాసరి మనోహర్‌రెడ్డి, విజయరమణారావు, గుజ్జులరామకృష్ణారెడ్డి అనుచరులు ఉత్సహం చూపారు. వేలాదిగా తరిలివచ్చిన కార్యకర్తలతో అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ పదేపదే నినాదించారు. జిల్లా కేంద్రం ఒక్కసారిగా త్రివర్ణం జెండాలతో రెపరెపలాడింది. ముందుగా కాంగ్రెస్ జెండాలు, అ తర్వాత గులాబీ జెండాలు, చివరగా కషాయం జెండాలతో ముగింపు ఉత్సహంతో కార్యకర్తలు ముందుకు సాగారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి విజయరమణారావు. బీజేపీ అభ్యర్థి గుజ్జుల రామకృష్ణారెడ్డి అనుచరులంతా ఎవరికివారే చివరి ర్యాలీతో తమ విజయం ఖాయమైందంటూ వ్యాఖ్యనించారు. ఇక్కడి జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు, మున్సిపల్ చైర్మన్ ఎల్.రాజయ్య, మాజీ ఎమ్మెల్యే బిరు దురాజమల్లు, నల్లామనోహర్‌రెడ్డి, రేవతిరావు, ఎంపీపీ సారయ్యగౌడ్, సందవేన సునీత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment