
రజత్‌కుమార్
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈరోజు వాహనదారులకు ఎన్నికల సంఘం ఊరట కల్పించింది.
సాక్షి, హైదరాబాద్: పోలింగ్ సమయాన్ని పెంచేది లేదని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) రజత్ కుమార్ స్పష్టం చేశారు. సాంకేతిక సమస్యలతో చాలా చోట్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైన నేపథ్యంలో సమయాన్ని పెంచాలని ఓటర్లు కోరుతున్నారు. దీనిపై రజత్‌కుమార్ స్పందిస్తూ.. నిర్ణీత సమయానికే పోలింగ్ ప్రారంభమైందన్నారు. ఒకటి రెండు చోట్ల మాత్రమే సమస్యలు తలెత్తాయని, ఓటర్లు ఎక్కడా వెనుదిరగలేదని చెప్పారు. పరిష్కరించలేని సాంకేతిక సమస్యలు ఇప్పటివరకు ఎదురుకాలేదన్నారు. కాగా, 229 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించినట్టు తెలుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈరోజు వాహనదారులకు టోల్‌ప్లాజా రుసుం చెల్లింపు నుంచి ఎన్నికల సంఘం ఊరట కల్పించింది. వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది. వాహనదారులకు టోల్‌ప్లాజా రుసుం చెల్లింపు నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎన్నికల సంఘం ఆదేశించింది.