
సాక్షి, హైదరాబాద్ : గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షులు కోదండరామ్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ..'రాజ్యాంగం రావటం అంటే.. రాజకీయ విప్లవం రావటమే. రాజ్యాంగ సమానతలు వచ్చాయి కానీ, సామాజిక సమానతలు మాత్రం రాలేదు. పాలకులు రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి పనిచేయాలి. భవిష్యత్తు నిర్మాణానికి రాజ్యాంగం ఓ బ్లూ ప్రింట్. పాలకులు అధికారంలోకి వచ్చాము ఏదైనా చేయొచ్చు అనే భావన వదిలేయాలి.
రాజ్యాంగంలోని చట్టాలకు లోబడి పాలన సాగించాలి. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ రాజ్యాంగానికి అతీతులు కాదు. ఎవరైనా రాజ్యాంగంకి లోబడి పనిచేయాలి. ఎన్నికల కమిషన్ సలహాలు అవసరం లేదు. ఏం చేయాలో మాకు తెలుసు. కోర్టుకు వెళ్ళండి అని చెప్పాల్సిన అవసరం రజత్ కుమార్‌కి లేదు. అడిగే హక్కు మాకుంది. సమాధానం చెప్పాల్సిన బాధ్యత రజత్ కుమార్ మీద ఉంది. భారత రత్నలో తెలంగాణకు అన్యాయం జరిగింది. బాధ కలిగింది' అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఆధికార ప్రతినిధి యోగెశ్వర రెడ్డి వెదిరె, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బద్రుద్దిన్‌లతో పాటూ కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment