
పత్రికను చదువుతూ బస్సు నడుపుతున్న డ్రైవర్
అన్నానగర్: చెన్నై కార్పొరేషన్ రవాణా సంస్థకి చెందిన ఓ బస్సు డ్రైవర్ పత్రిక చదువుతూ బస్సుని నడుపుతున్న వీడియో వైరల్ అవుతోంది. తమిళనాడులోని చెన్నై కార్పొరేషన్ రవాణా సంస్థలో 3,500పైన బస్సులు చెన్నై మొత్తం నడుస్తున్నాయి. డ్రైవర్లు ఇలా సెల్‌ఫోన్లలో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తుండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలా బస్సు నడిపే డ్రైవర్లపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ కార్పొరేషన్ బస్సు డ్రైవర్ బస్సు నడుపుతూ స్టీరింగ్‌పై పత్రిక ఉంచి చదువుతున్నట్టుగా ఓ వీడియో సామాజిక మాధ్యమంలో హల్‌చల్ చేస్తోంది.
ఇందలో శనివారం ఆవడి నుంచి తిరువాన్‌మ్యూర్ వైపుగా కార్పొరేషన్ బస్సు(నం 47డీ) వెళుతోంది. బస్సులో 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. బస్సు డ్రైవర్ అంబత్తూర్ ప్రాంతంలో వస్తుండగా పత్రికను స్టేరింగ్‌పై చదువుతూ బస్సు నడుపుతున్నాడు. ఇది చూసి దిగ్భ్రాంతి చెందిన ప్రయాణికులు అతన్ని హెచ్చరించినా పట్టించుకోలేదని తెలుస్తుంది.
బస్సులో ఉన్న ఓ ప్రయాణికుడు సెల్‌ఫోన్‌లో ఈ దృశ్యాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పోస్టుచేశారు. దీనిపై ఆ రవాణ సంస్థ అధికారి ఆదివారం మాట్లాడుతూ బస్సు అంబత్తూర్ బస్సు డిపోకి చెందిందని, డ్రైవర్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment