Tamil Nadu Traffic Police Slaps Food Delivery Agent, Watch The Viral Video - Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ ఓవరాక్షన్‌.. డెలివరీ బాయ్‌ అంటే అంత చులకనా.. వీడియో వైరల్‌

Published Sun, Jun 5 2022 10:21 AM | Last Updated on Sun, Jun 5 2022 1:07 PM

Tamil Nadu Traffic Cop Slaps Food Delivery Agent - Sakshi

నేను పోలీసును.. నేనేం చేసిన ఎవరూ అడ్డుచెప్పరు.. అనే అహంకారంతో ఓ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ నడిరోడ్డుపై అనుచితంగా ప్రవర్తించాడు. ఓ ఫుడ్‌ డెలివరీ బాయ్‌ను దారుణంగా కొట్టాడు. ఈ షాకింగ్‌ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. సింగనల్లూరు పోలీస్ స్టేషన్‌లో పరిధిలో ఓ స్కూల్‌కు చెందిన బస్సు డ్రెవర్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌ చేసి.. బైక్‌లను, పాదచారులను ఢీకొట్టబోయాడు. ఈ క్రమంలో స్విగ్గీ డెలివరీ బాయ్‌ మోహన సుందరం.. బస్సును ఆపి డ్రైవర్‌ను నిలదీశాడు. దీంతో రోడ్డుపై ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.  అది గమనించిన ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ సతీష్‌ అక్కడికి చేరుకున్నాడు. 

ట్రాఫిక్‌ జామ్‌ అవడంతో ఒక్కసారిగా ఆవేశం తెచ్చుకున్న సతీష్‌.. ఏం జరిగింది అని కూడా అడగకుండా.. డెలివరీ బాయ్‌ చెంపపై పదే పదే కొట్టాడు. అనంతరం అతడి సెల్‌ ఫోన్‌ను లాక్కొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో సతీష్‌.. మోహన సుందరాన్ని తిడుతూ ఆ స్కూల్‌ బస్సు ఓనర్‌ ఎవరో తెలుసా అని వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ తతంగాన్ని పక్కనే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. వీడియో వైరల్‌గా మారి పోలీసు ఉన్నతాధికారులకు చేరడంతో కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకున్నారు. వెంటనే కానిస్టేబుల్‌ను కోయంబత్తూరులోని పోలీస్ కంట్రోల్ రూమ్‌కు బదిలీ చేశారు.

ఇది కూడా చదవండి: వీడియో: ఇదెక్కడి ‘షాట్‌’.. డబుల్‌ మీనింగ్‌ యాడ్స్‌పై దుమారం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement