చెన్నై: కుక్క అంటేనే విశ్వాసానికి ప్రతీక. రోజు దానికో ముద్ద పెడితే చాలు.. అది చచ్చేవరకు మన పట్ల విశ్వాసం చూపిస్తుంది. ఇప్పుడంటే సెక్యూరిటీ గార్డులు, సీసీకెమరాల వాడకం పెరిగింది కానీ.. ఒకప్పుడు కాపలా కోసం కుక్కను పెంచుకునేవారు చాలా మంది. కొంచెం ట్రైనింగ్ ఇస్తే చాలు.. చిన్న చిన్న పనులు కూడా చేసి పెడతాయి. అయితే ఇప్పటి వరకు కేవలం ఇంటి పనులు మాత్రమే చేసే కుక్కలను చూశాం. కానీ ఇప్పుడు మీరు చూడబోయే శునకం చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఇది ఏకంగా బయటకు వెళ్లి యజమాని చెప్పిన సరుకులు కూడా తీసుకువస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ వివరాలు..
తమిళనాడు దిండిగల్ జిల్లా పళనికి చెందిన దాస్ ఫెర్నాండేజ్ అనే వ్యక్తి లాబ్రడార్ జాతికి చెందిన ఓ కుక్కను పెంచుకుంటున్నాడు. ఈ క్రమంలో దానికి చిన్న చిన్న పనులు చేయడం నేర్పించాడు. దానిలో భాగంగానే బయటకు వెళ్లి సరుకులు తీసుకువచ్చే విషయంలో కూడా తర్ఫీదు ఇచ్చాడు. సరుకులు అంటే మరీ సూపర్ మార్కెట్‌కు వెళ్లే రేంజ్ కాదు.. ఇంటి దగ్గర చిన్న చిన్న షాపులకు వెళ్లి.. లిస్ట్‌లో ఉన్న ఒకటి రెండు సరుకులు తీసుకు వస్తుంది.
ఈ క్రమంలో దాస్ కేజీన్నర చికెన్ తీసుకురమ్మని చిట్టీ మీద రాసి ఓ ప్లాస్టిక్ బుట్టలో వేసి.. దాన్ని కుక‍్క మెడకు తగిలించాడు. ఆ తర్వాత దాస్, తన పెంపుడు కుక్క రెండు కలిసి షాపింగ్‌కు వెళ్తాయి. ముందుగా కుక్క ఓ కిరాణా షాప్‌కు వెళ్లి.. బుట్టను దుకాణాదారుకు ఇస్తుంది. అతడు దానిలోని చిట్టిని తీసి.. అందులో ఉన్న వస్తువులు తీసి బుట్టలో వేస్తాడు. ఆ తర్వాత కుక్క చికెన్ షాప్ దగ్గరకు వెళ్తుంది. చిట్టిలో ఉన్న ప్రకారం చికెన్ తీసుకుంటుంది. ఆ తర్వాత యజమాని, కుక్క కలిసి ఇంటికి వస్తారు. బ్యాగ్ మోస్తూ.. యజమానికి సాయం చేస్తుంది కుక్క. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. యమజానికి సాయం చేస్తోన్న కుక్కపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment