చెన్నై: మూగ జంతువులు పట్ల ఏ మాత్రం జాలి దయ లేకుండా ప్రవర్తించేవారు ఈ రోజుల్లో బాగా పెరిగిపోయారు. తమ బాధను వెల్లడించలేని మూగ జీవుల పట్ల కొందరు అమానుషంగా ప్రవర్తిస్తూ.. వాటిని హింసిస్తూ.. రక్షసానందం పొందుతున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలోని తిరుమూర్తి ఆనకట్ట దగ్గర గిరిజన యువకులు కొందరు అడవి ఏనుగును దారుణంగా హింసిస్తూ రక్షసానందం పొందారు. ఏనుగు మీదకు కుక్కలను వదిలి.. రాళ్లు, చెట్ల కొమ్మలతో కొడుతూ.. రక్షసానందం పొందారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. వీటిని చూసిన జంతు ప్రేమికుల వార మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు మనుషులా.. మీకు కాస్త కూడా జాలీ, దయ లేదా.. ఇంత రాక్షసంగా ప్రవర్తిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరలవుతోన్న వీడియోల ఆధారంగా తిరుపూర్ జిల్లా అటవీ అధికారులు ముగ్గురు గిరిజన యువకులపై కేసు నమోదు చేశారు. అడవి ఏనుగును ఆటపట్టించినందుకు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వారిపై కేసు నమోదైంది. ముగ్గురు యువకులను త్వరలో రిమాండ్‌కు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు.
చదవండి: మనిషిని అనుకరించిన ఏనుగు.. ఏకంగా తొండంతో
Comments
Please login to add a commentAdd a comment