న్యూఢిల్లీ: వార్తా పత్రికలు, మ్యాగజీన్లలో టెండర్ల ప్రకటనలు ఇవ్వడం ఆపేయాలని రైల్వేబోర్డు నిర్ణయించింది. ప్రస్తుతం రైల్వేశాఖ అన్ని పనులకు ఈ–టెండర్లు ఆహ్వానిస్తున్న తరుణంలో ప్రత్యేకంగా పేపర్లలో ప్రకటనలు ఇవ్వడం అనవసరమని అభిప్రాయపడింది. అంతేకాకుండా దీనిద్వారా రైల్వేలు చేస్తున్న ఖర్చు గణనీయంగా తగ్గుతుందని పేర్కొంది. ఈ మేరకు రైల్వే బోర్డు ఉత్వర్వులను జారీచేసింది. వెబ్‌సైట్‌లో టెండర్ వివరాలు ఉంచిన తేదీనే టెండర్ పబ్లిషింగ్ చేసిన తేదీగా భావించాలని రైల్వే బోర్డు అందులో తెలిపింది. టెండర్లు తెరిచేందుకు తీసుకునే కనీస సమయం కూడా ఇందుకు అనుగుణంగానే ఉంటుందని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment