e tender
-
ఒకే రోజు 13 అనుమతులిచ్చారు: సీబీఐ
లక్నో/న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మొత్తం 14 మైనింగ్ లీజులకు ఆమోదం తెలిపారని సీబీఐ సోమవారం తెలిపింది. గనుల శాఖను తనవద్దే ఉంచుకున్న అఖిలేశ్ 13 లీజులను 2013, ఫిబ్రవరి 17న ఒక్క రోజులోనే క్లియర్ చేశారని వెల్లడించింది. ఇది యూపీ ఈ–టెండరింగ్ ప్రక్రియకు విరుద్ధమంది. సీఎం ఆమోదంతో ఈ లీజులను అప్పటి హమీర్పూర్ జిల్లా కలెక్టర్ చంద్రకళ ఇతరులకు కేటాయించారని పేర్కొంది. అలహాబాద్ హైకోర్టు ఆమోదించిన ఈ– టెండర్ పాలసీ 2012కు విరుద్ధంగా ఈ కేటాయింపులు సాగాయంది. అఖిలేశ్‌కు మాయావతి ఫోన్ అక్రమ మైనింగ్ కేసులో అఖిలేశ్‌ను సీబీఐ విచారించే అవకాశముందన్న వార్తల నేపథ్యంలో వివక్షాలు ఆయనకు మద్దతుగా నిలిచాయి. బీజేపీ ప్రతిపక్షాలను వేధింపులకు గురిచేస్తోందని బీఎస్పీ కాంగ్రెస్, ఆప్ ఆరోపించాయి. ఈ సందర్భంగా అఖిలేశ్‌కు ఫోన్ చేసిన బీఎస్పీ చీఫ్ మాయావతి..‘ఇలాంటి గిమ్మిక్కులకు భయపడొద్దు. మీకు నా పూర్తి మద్దతు ఉంటుంది. రాజకీయ విభేదాల నేపథ్యంలోనే బీజేపీ ప్రభుత్వం సీబీఐని ఉసిగొల్పుతోంది. రాజకీయ ప్రత్యర్థులను తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు యత్నిస్తోంది’ అని తెలిపారు. ఎస్పీ–బీఎస్పీ మధ్య పొత్తును అప్రతిష్టపాలు చేసేందుకే కేంద్రం ఇలాంటి వార్తలను వ్యాప్తిచేస్తోందని మండిపడ్డారు. సాక్షాత్తూ కేంద్ర మంత్రి సీబీఐ అధికార ప్రతినిధిగా మీడియా సమావేశం నిర్వహించడం రాజకీయ కుట్ర కాకుంటే మరేంటని ప్రశ్నించారు. కూటమిని నిలువరించేందుకే: కాంగ్రెస్ 2019 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో విపక్ష కూటమి ఏర్పాటును నిలువరించడానికి విచారణ సంస్థను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ విమర్శించారు. అఖిలేశ్ యాదవ్‌పై కేంద్రం నిసిగ్గుగా సీబీఐని ఉసిగొల్పుతోందని ప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. -
పత్రికల్లో రైల్వే టెండర్ ప్రకటనలు బంద్
న్యూఢిల్లీ: వార్తా పత్రికలు, మ్యాగజీన్లలో టెండర్ల ప్రకటనలు ఇవ్వడం ఆపేయాలని రైల్వేబోర్డు నిర్ణయించింది. ప్రస్తుతం రైల్వేశాఖ అన్ని పనులకు ఈ–టెండర్లు ఆహ్వానిస్తున్న తరుణంలో ప్రత్యేకంగా పేపర్లలో ప్రకటనలు ఇవ్వడం అనవసరమని అభిప్రాయపడింది. అంతేకాకుండా దీనిద్వారా రైల్వేలు చేస్తున్న ఖర్చు గణనీయంగా తగ్గుతుందని పేర్కొంది. ఈ మేరకు రైల్వే బోర్డు ఉత్వర్వులను జారీచేసింది. వెబ్సైట్లో టెండర్ వివరాలు ఉంచిన తేదీనే టెండర్ పబ్లిషింగ్ చేసిన తేదీగా భావించాలని రైల్వే బోర్డు అందులో తెలిపింది. టెండర్లు తెరిచేందుకు తీసుకునే కనీస సమయం కూడా ఇందుకు అనుగుణంగానే ఉంటుందని స్పష్టం చేసింది. -
వసూల్ రాజాలెవరు...?
వేములవాడ : భోళాశంకరుడి వద్దకు వస్తున్న భక్తులకు అక్రమార్కులు నిలువునా దోచుకుంటున్నారు. పార్కింగ్ ఫీజు పేరుతో ఒక్కో వాహనం వద్దనుంచి రూ. 150, రూ.100, రూ.50 చొప్పున బినామీ రశీదులు వసూలు చేస్తూ జేబులు నింపుకుంటున్న వైనం సోమవారం వెలుగుచూసింది. అనుమతి లేకుండా పార్కింగ్ ఫీజులు వసూలు చేసే నాయకుడెవరూ..? ఎవరి కనుసన్నల్లో ఈ వ్యవహారం జరుగుతుందన్నది ప్రశ్నార్థకంగా మిగిలింది. పక్షం రోజులుగా ఈ దందా సాగుతున్నా... అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఓ భక్తుడు సోమవారం స్థానిక విలేకరులకు సమాచారం అందించడంతో అక్రమార్కుల గుట్టురట్టయింది. దీంతో ఇందులో భాగస్వామ్యమైన వారంతా అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. తేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. జేబులు నింపుకున్న అక్రమార్కులు.. రాజన్న దర్శనం కోసం వచ్చే భక్తులు రవాణా సౌకర్యర్థాం సొంత, అద్దె వాహనాల్లో కుటుంబసభ్యులతో కలిసి వస్తుంటారు. సమ్మక్క జాతర నేపథ్యంలో వచ్చే వారి సంఖ్య లక్షల్లోకి చేరింది. ఇదే అదనుగా భావించిన అక్రమార్కులు పార్కింగ్ ఫీజు దందాకు తెరలేపారు. భక్తుల సౌకర్యాల బిజీలో ఆలయ అధికారులు, బందోబస్తులో పోలీసులునిమగ్నం కావడంతో అక్రమార్కులకు మరింత కలిసొచ్చింది. వేలాదిగా వచ్చిన వాహ నదారుల నుంచి రూ.150, రూ.100, రూ.50 చొప్పున పార్కింగ్ ఫీజు పేరుతో వసూలు చేసి జేబులు నింపుకున్నారు. అధికారి సంతకం, ముద్రలు లేకుండానే నిలువుదోపిడీ చేశారు. టెంపుల్ కాంట్రాక్టు ఇదీ... టీటీడీ ధర్మశాల ప్రాంగణం, గుడి చెరువు కట్టవద్ద పార్కింగ్ స్థలాల వద్ద ఉన్న వాహనాలకు మాత్రమే ఫీజు వసూలు చేయాలని ఆలయ అధికారులు 2015- 17 రెండేళ్ల కోసం టెండర్ నిర్వహించారు. తిరుపతి అనే కాంట్రాక్టర్ రూ.10లక్షలకు ఈ టెండర్ దక్కించుకున్నాడు. నిబంధనల ప్రకారం ఆటోలు రూ.20, కార్లకు రూ.50 చొప్పున తీసుకోవాలి. అయితే ఇందుకు భిన్నంగా జాత్రాగ్రౌండ్, బైపాస్‌రోడ్డు, గుడి చెరువు కట్ట కింద, ఇతర ప్రాంతంలో నిలుపుతున్న వాహనాలవద్ద బినామీ కాంట్రాక్టర్లు అధిక మొత్తం వసూలు చేస్తూ జేబులు నింపుకుంటున్నాడు. ఇదంతా జరుగుతున్నా.. ఈ వ్యవహారం అధికారులకు చేరలేదా? లేక ఇదంతా వారి కనుసన్నల్లోనే జరుగుతుందా..? అన్న అంశం తేలాల్సి ఉంది. పోలీసుల విచారణ షురూ పార్కింగ్ పేరుతో అక్రమంగా వసూలు దందాకు తెరలేపిన వారెవరనేది పోలీసులు కూపీ లాగుతున్నారు. దేవస్థానంపక్షాన పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్న కాంట్రాక్టర్ వారికి సంబంధించిన వ్యక్తులను విచారిస్తున్నట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు.