వసూల్ రాజాలెవరు...? | Parking fees at Benami receipts | Sakshi
Sakshi News home page

వసూల్ రాజాలెవరు...?

Published Wed, Feb 3 2016 2:06 AM | Last Updated on Sun, Sep 3 2017 4:49 PM

వసూల్ రాజాలెవరు...?

వసూల్ రాజాలెవరు...?

వేములవాడ : భోళాశంకరుడి వద్దకు వస్తున్న భక్తులకు అక్రమార్కులు నిలువునా దోచుకుంటున్నారు. పార్కింగ్ ఫీజు పేరుతో ఒక్కో వాహనం వద్దనుంచి రూ. 150, రూ.100, రూ.50 చొప్పున బినామీ రశీదులు వసూలు చేస్తూ జేబులు నింపుకుంటున్న వైనం సోమవారం వెలుగుచూసింది. అనుమతి లేకుండా పార్కింగ్ ఫీజులు వసూలు చేసే నాయకుడెవరూ..? ఎవరి కనుసన్నల్లో ఈ వ్యవహారం జరుగుతుందన్నది ప్రశ్నార్థకంగా మిగిలింది. పక్షం రోజులుగా ఈ దందా సాగుతున్నా... అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఓ భక్తుడు సోమవారం స్థానిక విలేకరులకు   సమాచారం అందించడంతో అక్రమార్కుల గుట్టురట్టయింది. దీంతో ఇందులో భాగస్వామ్యమైన వారంతా అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. తేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
 
జేబులు నింపుకున్న అక్రమార్కులు..
రాజన్న దర్శనం కోసం వచ్చే భక్తులు రవాణా సౌకర్యర్థాం  సొంత, అద్దె వాహనాల్లో కుటుంబసభ్యులతో కలిసి వస్తుంటారు. సమ్మక్క జాతర నేపథ్యంలో వచ్చే వారి సంఖ్య లక్షల్లోకి చేరింది. ఇదే అదనుగా భావించిన అక్రమార్కులు పార్కింగ్ ఫీజు దందాకు తెరలేపారు. భక్తుల సౌకర్యాల బిజీలో ఆలయ అధికారులు, బందోబస్తులో పోలీసులునిమగ్నం కావడంతో అక్రమార్కులకు మరింత కలిసొచ్చింది. వేలాదిగా వచ్చిన వాహ నదారుల నుంచి రూ.150, రూ.100, రూ.50 చొప్పున పార్కింగ్ ఫీజు పేరుతో వసూలు చేసి జేబులు నింపుకున్నారు. అధికారి సంతకం,  ముద్రలు లేకుండానే నిలువుదోపిడీ చేశారు.
 
టెంపుల్ కాంట్రాక్టు ఇదీ...
టీటీడీ ధర్మశాల ప్రాంగణం, గుడి చెరువు కట్టవద్ద పార్కింగ్ స్థలాల వద్ద ఉన్న వాహనాలకు మాత్రమే ఫీజు వసూలు చేయాలని ఆలయ అధికారులు 2015- 17 రెండేళ్ల కోసం టెండర్ నిర్వహించారు. తిరుపతి అనే కాంట్రాక్టర్  రూ.10లక్షలకు ఈ టెండర్ దక్కించుకున్నాడు. నిబంధనల ప్రకారం ఆటోలు రూ.20, కార్లకు రూ.50 చొప్పున తీసుకోవాలి. అయితే ఇందుకు భిన్నంగా జాత్రాగ్రౌండ్, బైపాస్‌రోడ్డు, గుడి చెరువు కట్ట కింద, ఇతర ప్రాంతంలో నిలుపుతున్న వాహనాలవద్ద బినామీ కాంట్రాక్టర్లు అధిక మొత్తం వసూలు చేస్తూ జేబులు నింపుకుంటున్నాడు. ఇదంతా జరుగుతున్నా.. ఈ వ్యవహారం అధికారులకు చేరలేదా? లేక ఇదంతా వారి కనుసన్నల్లోనే జరుగుతుందా..? అన్న అంశం తేలాల్సి ఉంది.
 
పోలీసుల విచారణ షురూ
పార్కింగ్ పేరుతో అక్రమంగా వసూలు దందాకు తెరలేపిన వారెవరనేది పోలీసులు కూపీ లాగుతున్నారు. దేవస్థానంపక్షాన పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్న కాంట్రాక్టర్ వారికి సంబంధించిన వ్యక్తులను విచారిస్తున్నట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement