tenders for works
-
‘నామినేషన్’ దందా!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలో అధికార పార్టీ నేతలు మరోసారి నామినేషన్ పనుల పర్వానికి తెరతీశారు. మొత్తం రూ.25 కోట్ల పనులను నామినేషన్‌పై కాజేసేందుకు పథక రచన చేశారు. ఇందుకోసం ఒక్కో పని విలువను రూ.5 లక్షలకే పరిమితం చేశారు. ఈ విధంగా మొత్తం 500 పనులను తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. వీటిని అప్పగించేందుకు కాంట్రాక్టర్లను సైతం ముందుగానే ఎంపిక చేసుకున్నారు. వారి నుంచి ఏకంగా 20 శాతం కమీషన్ తీసుకునేందుకు ఇటు కర్నూలు, అటు పాణ్యం నియోజకవర్గ అధికార పార్టీ నేతలు నిర్ణయించుకున్నారు. ఎంపిక చేసుకున్న పనుల విషయంలోనూ అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో చేసిన పనులతో పాటు సగం పూర్తి చేసిన వాటిని ఎంపిక చేసుకుని భారీగా కమీషన్లు దండుకునేందుకు ఎత్తుగడ వేసినట్లు సమాచారం. గతంలో ఒకసారి నామినేషన్ పనుల రుచి మరిగిన అధికార పార్టీ నేతలు మరోసారి నిధులను ఆరగించేందుకు రంగం సిద్ధం చేశారు. కర్నూలు నగరంతో పాటు కల్లూరు అర్బన్ ప్రాంతంలో సీసీ రోడ్లు, మురుగుకాలువల నిర్మాణానికి మొత్తం 500 పనులను నామినేషన్‌పై తీసుకునేందుకు గుర్తించారు. వీటి అంచనాలు కూడా ఇప్పటికే తయారుచేయించిన అధికారపార్టీ నేతలు..ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకునేందుకు యత్నిస్తున్నారు. టెండర్లు లేకుండానే... గతంలోనూ నామినేషన్‌పై పనులు చేపట్టారు. నామినేషన్‌పై పనులు అప్పగించాలంటే ఎంతో అత్యవసరమైనవై ఉండాలని మునిసిపల్ శాఖ డైరెక్టర్ కన్నబాబు మొదట్లో కొర్రీలు వేశారు. అత్యవసరమైనవి కాకపోతే.. టెండర్ల ద్వారానే చేపట్టవచ్చు కదా అని ప్రశ్నించారు. దీంతో మొదట్లో నామినేషన్ పనులకు బ్రేకులు పడ్డాయి. అయితే, చివరకు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లే పనిచేశాయి. కర్నూలు, పాణ్యంకు చెందిన నేతలు అప్పట్లో సుమారు రూ.50 కోట్ల పనులను నామినేషన్‌పై తీసుకున్నారు. ఇవన్నీ కార్యకర్తలకు ఇచ్చేందుకేనని చెప్పి తీసుకున్న అధికార పార్టీ నేతలు.. ఆచరణలో మాత్రం కమీషన్లు దండుకున్నారు. పనులను కాస్తా తిరిగి కాంట్రాక్టర్లకే అప్పగించారు. ఒక్కో కాంట్రాక్టర్ నుంచి ప్రధాన నేతలకు రూ.25 వేల నుంచి రూ.30 వేల చొప్పున కమీషన్లు అందాయి. తిరిగి ఇప్పుడు మరోసారి కార్యకర్తల పేరుపై నామినేషన్ ప్రాతిపదికన పనులు తీసుకునేందుకు కర్నూలు, పాణ్యం నియోజకవర్గాలకు చెందిన అధికార పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. రూ.5 కోట్ల కమీషన్లు! కర్నూలు కార్పొరేషన్లో ఏ టెండర్లు పిలిచినా గతంలో 15 శాతం వరకూ తక్కువ ధరకే వేసేవారు. అయితే, అధికార పార్టీ నేత రంగంలోకి దిగిన తర్వాత ప్రతి టెండరు తనకు మాత్రమే దక్కేలా చేసుకోవడంతో పాటు రింగుకు పాల్పడుతున్నారు. ఫలితంగా ఒక్కో టెండరు 5 నుంచి 10 శాతం వరకూ అధిక ధరకు వేసే పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల కార్పొరేషన్ ఖజానాకు గండి పడుతోంది. ఇప్పుడు నామినేషన్లపై తీసుకునే పనులకు కూడా టెండర్లను పిలిస్తే 15 శాతం వరకూ తక్కువ ధరకే చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకొచ్చే అవకాశం ఉంది. అయితే, అధికార పార్టీ నేతల పేరుతో తీసుకోనుండడంతో అంచనా ధరకే పనులను అప్పగించనున్నారు. అది కూడా ఎంపిక చేసిన వారికి నామినేషన్‌పై మాత్రమే. ఇక్కడ ఇంజినీర్లతో ముందుగానే కుమ్మక్కై చేసిన పనులకే తిరిగి అంచనాలు వేయించడంతో పాటు అధికంగా కూడా వేయించి భారీగా దండుకోనున్నారు. మొత్తం 500 పనులకు గానూ ఒక్కో పని అంచనా విలువ రూ.5 లక్షలుగా నిర్ణయించిన నేపథ్యంలో మొత్తం రూ.25 కోట్ల పనుల్లో 20 శాతం కమీషన్ అంటే రూ.5 కోట్ల మేర దండుకునేందుకు ఇద్దరు అధికార పార్టీ నేతలు సిద్ధమయ్యారు. -
పత్రికల్లో రైల్వే టెండర్ ప్రకటనలు బంద్
న్యూఢిల్లీ: వార్తా పత్రికలు, మ్యాగజీన్లలో టెండర్ల ప్రకటనలు ఇవ్వడం ఆపేయాలని రైల్వేబోర్డు నిర్ణయించింది. ప్రస్తుతం రైల్వేశాఖ అన్ని పనులకు ఈ–టెండర్లు ఆహ్వానిస్తున్న తరుణంలో ప్రత్యేకంగా పేపర్లలో ప్రకటనలు ఇవ్వడం అనవసరమని అభిప్రాయపడింది. అంతేకాకుండా దీనిద్వారా రైల్వేలు చేస్తున్న ఖర్చు గణనీయంగా తగ్గుతుందని పేర్కొంది. ఈ మేరకు రైల్వే బోర్డు ఉత్వర్వులను జారీచేసింది. వెబ్సైట్లో టెండర్ వివరాలు ఉంచిన తేదీనే టెండర్ పబ్లిషింగ్ చేసిన తేదీగా భావించాలని రైల్వే బోర్డు అందులో తెలిపింది. టెండర్లు తెరిచేందుకు తీసుకునే కనీస సమయం కూడా ఇందుకు అనుగుణంగానే ఉంటుందని స్పష్టం చేసింది. -
మహాశివరాత్రి పనులకు టెండ‘రింగ్’
వేములవాడ, న్యూస్‌లైన్ : వేములవాడ రాజన్న ఆలయంలో మహాశివరాత్రి జాతర సందర్భంగా చేపట్టనున్న పనులకు టెండర్ ప్రక్రియ సోమవారం ముగిసింది. ఒకే పనిని రెండు మూడు పనులుగా విభజించి నిబంధనలను అతిక్రమించిన ఆలయ అధికారులు.. కాంట్రాక్టర్లకు టెండర్లు కట్టబెట్టడంలోనూ కనీస నియమాలు పాటించలేదు. ముందుగా అనుకున్నట్టే పలువురు కాంట్రాక్టర్లు రింగయి పనులను దక్కించుకున్నారు. మొత్తం 20 పనుల్లో.. నాంపెల్లి గుట్టపై ప్రధాన దేవాలయం చుట్టూ గాల్వాల్యూమ్ షెడ్డు నిర్మాణం, ధర్మగుండం వద్ద 5హెచ్‌పీ పంపులు, డీజిల్ ఇంజిన్ ఏర్పాటుకు టెండర్లు దాఖలు కాలేదు. మిగిలిన 18 పనుల్లో తొమ్మిది పనులకు రింగైన కాంట్రాక్టర్లు అధిక ధరలు కోట్ చేశారు. మిగతా తొమ్మిది పనుల్లో రెండింటికి అంచనాల ప్రకారం.. మరో ఏడింటికి లెస్‌కు కోట్ చేసి పనులను దక్కించుకున్నారు. కాంట్రాక్టర్లు రింగయ్యారన్న అనుమానం వచ్చిన ప్రతీసారి టెండర్లను రద్దుచేసి బహిరంగవేలం వేసే అధికారులు.. ఈసారి మాత్రం సీల్డు టెండర్లలో పేర్కొన్న విధంగానే పనులను అప్పగించేందుకు సిద్ధపడ్డారు. ఎక్సెస్, లెస్ ఇలా.. ఆలయ ఆవరణలో రెండు నెలలు తాత్కాలిక పందిళ్లు వేసే పనికి రూ.4.60 లక్షలు కాగా, 4శాతం ఎక్సెస్, పది రోజులకు రూ.4.80 లక్షల పనికి 8శాతం లెస్, ఏడు నెలలు 12 ఫీట్ల ఎత్తుతో పందిళ్ల ఏర్పాటుకు రూ.4.99 లక్షలు కాగా, 4.95శాతం ఎక్సెస్, 16 ఫీట్ల ఎత్తుతో పందిళ్ల ఏర్పాటుకు రూ.1.90 లక్షలకు, 4.95 ఎక్సెస్‌కు టెండర్లు దాఖలయ్యాయి. నాంపెల్లి గుట్టపై పందిళ్లు వేసే పనికి రూ.95 వేలు కాగా, యథాతథంగా, ప్రధానాలయానికి రంగులు వేసే పనికి రూ.2.75 లక్షలు, ధర్మగుండం, ఆర్సీసీ ఆర్చీగేట్లకు రంగులు వేసే పనులకు రూ.2.25 లక్షలు కాగా, ఈ రెండు పనులు 5శాతం లెస్‌కు కోట్ చేశారు. అనుబంధ దేవాలయానికి రంగులు వేసే పనికి రూ.4.60 లక్షలుగా నిర్దేశించగా, 10శాతం లెస్తో ఇద్దరు కాంట్రాక్టర్లు కోట్ చేశారు. దీంతో డ్రాతీసి ఈ పనులను అప్పగించేందుకు అధికారులు నిర్ణయించారు. నందీశ్వర కాంప్లెక్స్‌లోని బ్లాక్‌నంబర్-1, బ్లాక్ నంబర్-2 వసతిగదుల్లో ఎలక్ట్రిక్ కీట్యాగ్ స్విచ్సిస్టం ఏర్పాటుకు ఒక్కో బ్లాక్ రూ.లక్ష చొప్పున నిర్ణయించగా, 4.25 శాతం ఎక్సెస్‌కు, ప్రధాన ఆలయం ఆవరణలోని ఫ్లై-ఓవర్ బ్రిడ్జిల ప్లాట్‌ఫారాలకు అల్యూమినియం ప్లేట్లు బిగించేందుకు రూ 1.20 లక్షలు కాగా, 2శాతం ఎక్సెస్‌కు, నాంపెల్లి గ్రామ రహదారిపై కేదారేశ్వర పెట్రోల్ బంక్‌వద్ద రూ.4.70 లక్షలతో నిర్ధేశించిన ఐరన్ ఆర్చిగేట్ ఏర్పాటు పనులను అంచనాల ప్రకారం దక్కించుకున్నారు. అనుబంధ ఆలయాల ముందుభాగంలో గ్రానైట్ ఫ్లోరింగ్ పనులను రూ.4.70 లక్షలు నిర్ణయించగా, 4.99 శాతం ఎక్సెస్‌కు, బస్‌డిపో వద్ద ఆలయానికి చెందిన ఖాళీ స్థలం చుట్టూ రూ.145 లక్షలతో కంచె ఏర్పాటు పనికి 4.99 శాతం లెస్తో, బాలానగర్ వద్దనున్న ఆలయం ఖాళీస్థలం చుట్టూ రూ.3.40 లక్షలతో ఫెన్సింగ్ వేసే పనిని 6శాతం లెస్తో దక్కించుకున్నారు. మొదటి బైపాస్ శివారులోని ఖాళీ స్థలంచుట్టూ 1.75 లక్షలతో ఫెన్సింగ్ పనిని 4.99శాతం లెస్తో, జాతరగ్రౌండ్‌లోని గోశాల షెడ్డు ఎత్తును పెంచేందుకు రూ.1.20 లక్షల పనికి 2శాతం ఎక్సెస్‌తో, నగరేశ్వరస్వామివారి ఆలయానికి విమానగోపురం పునర్నిర్మాణానికి రూ.12 లక్షల పనిని 4.81శాతం ఎక్సెస్‌తో కాంట్రాక్టర్లకు అప్పగించారు.