యాదగిరిగుట్ట: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం చిన్నజియర్ స్వామితో కలిసి యాదగిరిగుట్టలో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఉదయం 11 గంటలకు జియర్‌స్వామితో కలిసి హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరిన కేసీఆర్ 11.30 యాదగిరిగుట్టకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన యాదగిరిగుట్ట ఆలయ ప్రణాళికను చిన్నజియర్ స్వామికి వివరించారు. అనంతరం అధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. ఒంటి గంటవరకు అక్కడ ఆలయ పరిసరాలను, ప్రధాన గర్భాలయంలో ఆయన జియర్‌స్వామితో కలిసి చర్చిస్తారు. అనంతరం హెలికాప్టర్‌లో తిరిగి హైదరాబాద్ వెళ్తారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి దివ్యక్షేత్రాన్ని.. వాటికన్ సిటీ తరహాలో తెలంగాణలో అభివృద్ధి చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సీఎం నాలుగుసార్లు యాదగిరిగుట్టకు వచ్చి అభివృద్ధికి సంబంధించిన కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే సేకరించిన భూమిని యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిసంస్థకు అప్పగించారు. మరో వెయ్యి ఎకరాలు సేకరించడానికి జిల్లా రెవెన్యూ యంత్రాంగం ముమ్మరంగా కసరత్తు చేసింది.
గుట్టలో కేసీఆర్, జియర్ స్వామి ఏరియల్ సర్వే
Published Thu, Mar 5 2015 11:50 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM
Advertisement
Advertisement