Tridandi chinajeer swamy
-
సర్వమానవ సమానత్వానికే..
సాక్షి, హైదరాబాద్: రామానుజాచార్య సర్వ మానవ సమానత్వం కోసం కృషి చేశారని, జాతి, కుల, మత, లింగ వివక్షలు కూడదని బోధించారని అందుకే దీనిని సమతా పండుగ (ఫెస్టివల్ ఆఫ్ ఈక్వాలిటీ)గా పిలుస్తున్నామని త్రిదండి చినజీయర్ స్వామి తెలిపారు. విశ్వమంతా ఒకే కుటుంబం అనే భావనను, వసుదైవ కుటుంబం స్ఫూర్తిని అందించేందుకే ఈ పండుగ నిర్వహిస్తున్నామని చెప్పారు. శంషాబాద్‌లోని ముంచింతల్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సమతా స్ఫూర్తి కేంద్రంలో రామానుజాచార్యుల వెయ్యేళ్ల జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సహస్రాబ్ది సమారోహం సంరంభం బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ మహోత్సవాలకు చినజీయర్ స్వామి సారథ్యం వహించారు. తాము తలపెట్టిన మహా యజ్ఞం నుంచి వెలువడే పొగ, పరిమళాల వల్ల మానవాళి ఆరోగ్యానికి, పర్యావరణానికి మేలు కలుగుతుందన్నారు. ఈ మహా క్రతువులో వేలాది మంది పాల్గొంటుండడం ఆనందంగా ఉందన్నారు. ఆధ్యాత్మిక పారవశ్యంలో భక్తులు తొలుత రామానుజాచార్యుల శోభాయాత్రను కనుల పండుగగా నిర్వహించారు. సాయంత్రం ప్రపంచంలోనే మున్నెన్నడూ జరగనంత భారీ స్థాయిలో లక్ష్మీనారాయణ మహా యజ్ఞానికి అంకురార్పణ చేశారు. కనీవినీ ఎరుగని రీతిలో 5 వేల మంది రుత్వికులు, 1,035 హోమ కుండాలు, 144 హోమశాలలు, 2 ఇష్టి శాలలు ఈ మహా క్రతువులో భాగం అయ్యాయి. యాగానికి సిద్ధం చేయడంలో భాగంగా భూమి శుద్ధి చేసి విష్వక్సేనుడి పూజ చేశారు. అలాగే హోమద్రవ్యాల శుద్ధి, వాస్తు శాంతిలో భాగంగా వాస్తు పురుషుడిని ప్రతిష్టించి పూజ నిర్వహించారు. యాగశాలల్లో రుత్వికులు వేద మంత్రోచ్ఛారణ చేస్తూ, మంత్రరాజంగా పేరొందిన అష్టాక్షరి మహా మంత్రాన్ని పఠిస్తూ, ఇతిహాసాలు, పురాణాలు, ఆగమాలు పారాయణం చేస్తూ.. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులలో ఆధ్యాత్మిక పారవశ్యాన్ని నింపారు. అష్టాక్షరి మహామంత్ర జపం 12 రోజుల పాటు నిర్విరామంగా సాగనుంది. ఉత్సవాలు ముగిసే సమయానికి మొత్తంగా కోటిసార్లు జపించాలనే భారీ లక్ష్యాన్ని చేరుకోనుంది. తరలివచ్చిన స్వాములు, విదేశీ భక్తులు, ప్రముఖులు ఈ సమతా పండుగకు దేశ విదేశాల నుంచి భక్తులు, రుతి్వకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అహోబిల జీయర్‌స్వామి, దేవనాథ జీయర్ స్వామి, రామచంద్ర జీయర్ స్వామి, రంగ రామానుజ జీయర్ స్వామి, అష్టాక్షరి జీయర్ స్వామి, వ్రతధర జీయర్ స్వామి తదితర అతిరథ మహారథులనదగ్గ స్వాములు తరలివచ్చారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఏపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తదితర ప్రముఖులు పాల్గొన్నారు. అమెరికా నుంచి వందలాదిగా భక్తులు, 20 మంది రుత్వికులు రావడం విశేషం. యూరప్ నుంచి, ఆస్ట్రేలియా, యూఏఈ నుంచి కూడా భక్తులు హాజరయ్యారు. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న నగర యువత సైతం ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సెలవు పెట్టి మరీ వాలంటీర్లుగా ఇక్కడ సేవలు అందిస్తుండడం విశేషం. -
మూర్తీ’భవించిన రామానుజ స్ఫూర్తి
శంషాబాద్ రూరల్: నేటి సమాజంలో పెరిగిపోతున్న అసమానతలను రూపుమాపడానికి, రామానుజుల స్ఫూర్తిని అందించడానికి సమతామూర్తి కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌స్వామి చెప్పారు. బుధవారం నుంచి జరుగనున్న శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహం ఉత్సవాల నేపథ్యంలో శాంతి భద్రతల కోసం వచ్చిన పోలీసులకు ఆయన ప్రవచనం చేశారు. రామానుజుల విశిష్టతను తెలియజేశారు. కూలీలు మొదలుకొని రైతుల, చిరు ఉద్యోగులు ఈ బృహత్తర కార్యక్రమానికి విరాళాలు ఇచ్చారన్నారు. ఇక్కడ జరుగుతున్న కార్యక్రమానికి ప్రభుత్వ సహకారం చాలా ఉందన్నారు. సమారోహ ఉత్సవాలకు బుధవారం అంకురార్పణ చేయనున్నట్లు తెలిపారు. ఉత్సవాలను విజయవంతం చేయడానికి అన్ని విభాగాలతో సమన్వయంతో ముందుకు సాగాలని సిబ్బంది, అధికారులకు సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సూచించారు. సమతామూర్తి విగ్రహావిష్కరణ ఘట్టానికి సుమారు 7 వేల మంది పోలీస్ అధికారులు, సిబ్బంది బందోబస్తులో నిమగ్నం కానున్నారు. ప్రధాన యాగశాల ఏర్పాట్లు పూర్తి రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం నుంచి ప్రారంభమయ్యే పూజా కార్యక్రమాలకు ప్రధాన యాగశాలను సిద్ధం చేశారు. మరోవైపు సినీ చిత్ర కళాకారుడు ఆనంద్‌సాయి ఆధ్వర్యంలో ప్రవచన మండపంలో వేదికను అందంగా ముస్తాబు చేస్తున్నారు. రెండు వేల మంది సామర్థ్యంతో ఏర్పాటు కానున్న ఈ మండపం నుంచే ప్రముఖులు, ఆధ్యాత్మిక గురువులు వారి ప్రసంగాలు, ప్రవచనాలు ఇవ్వనున్నారు. యాగశాల సమీపంలో ప్రభుత్వ వైద్యశాఖతో పాటు యశోద ఆస్పత్రి ఆధ్వర్యంలో వైద్య సేవల ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఏటీఎం సౌకర్యం కల్పిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. -
గుట్టలో కేసీఆర్, జియర్ స్వామి ఏరియల్ సర్వే
-
గుట్టలో కేసీఆర్, జియర్ స్వామి ఏరియల్ సర్వే
యాదగిరిగుట్ట: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం చిన్నజియర్ స్వామితో కలిసి యాదగిరిగుట్టలో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఉదయం 11 గంటలకు జియర్‌స్వామితో కలిసి హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరిన కేసీఆర్ 11.30 యాదగిరిగుట్టకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన యాదగిరిగుట్ట ఆలయ ప్రణాళికను చిన్నజియర్ స్వామికి వివరించారు. అనంతరం అధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. ఒంటి గంటవరకు అక్కడ ఆలయ పరిసరాలను, ప్రధాన గర్భాలయంలో ఆయన జియర్‌స్వామితో కలిసి చర్చిస్తారు. అనంతరం హెలికాప్టర్లో తిరిగి హైదరాబాద్ వెళ్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి దివ్యక్షేత్రాన్ని.. వాటికన్ సిటీ తరహాలో తెలంగాణలో అభివృద్ధి చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సీఎం నాలుగుసార్లు యాదగిరిగుట్టకు వచ్చి అభివృద్ధికి సంబంధించిన కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే సేకరించిన భూమిని యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిసంస్థకు అప్పగించారు. మరో వెయ్యి ఎకరాలు సేకరించడానికి జిల్లా రెవెన్యూ యంత్రాంగం ముమ్మరంగా కసరత్తు చేసింది. -
నేడు యాదగిరిగుట్టకు సీఎం కేసీఆర్
-
నేడు గుట్టకు కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: యాదగిరిగుట్ట క్షేత్రం అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గురువారం ఉదయం మరోసారి గుట్టకు వెళ్లనున్నారు. పదిరోజుల వ్యవధిలో యాదగిరి క్షేత్రాన్ని సందర్శించటం ఇది మూడోసారి కావటం విశేషం. యాదగిరీశుని ఆలయాన్ని గత నెల 25, 27న సీఎం సందర్శించారు. దేవాలయ అభివృద్ధిలో భాగంగా చేపట్టబోయే పనులకు సంబంధించి ప్రతిపాదిత నమూనాలు, ప్రాంతాలను పరి శీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా పట్టువస్త్రాలు కూడా సమర్పించారు. తుది నమూనాలు, ప్రణాళికలు సిద్ధం చేసేముందు శాస్త్రబద్ధంగా మరోసారి సరిచూసుకోవాలని ఆయన భావిస్తున్న నేపథ్యంలో క్షేత్రానికి గురువారం చినజీయర్ స్వామిని వెంట తీసుకెళ్లాలని నిర్ణయించారు. అక్కడ చేపట్టే పనులను సీఎం వివరించనున్నారు. చినజీయర్‌స్వామి సూచనలు విన్న తర్వాతే ప్రణాళికలు ఖరారు చేయబోతున్నారు. సీఎం కేసీఆర్, చిన జీయర్‌స్వామీజీ హెలికాప్టర్లో వెళ్లనున్నారు. ఉదయం 11గంటలకు వారు గుట్టకు చేరుకుం టారని అధికారులు తెలిపారు. వీరికన్నా ముందే అధికారు లు రోడ్డుమార్గాన ఆలయానికి చేరుకుంటారు.