
సాక్షి, అమరావతి: అల్లూరి సీతారామరాజు జిల్లాలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. గోదావరి వరదలపై మంత్రులు, అధికారులు, అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు గుడివాడ అమర్‌నాథ్, వేణు గోపాలకృష్ణ ఏరియల్ సర్వే చేపట్టారు.
చదవండి: ధవళేశ్వరం బ్యారేజీ వద్ద విశ్వరూపం
సీఎం ఆదేశాలతో ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. మందులు, ఆహార సరఫరా తాగునీరు,పాలు అందుబాటులో ఉండే విధంగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఎటపాక, చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, దేవీపట్నం మండలాల్లో ఏరియల్ వ్యూ ద్వారా పరిస్థితులను మంత్రులు సమీక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment