గత ప్రభుత్వాలు వ్యవస్థలన్నింటినీ (ఆఖరికి పాలనా సంబంధిత) నిర్వీర్యం చేశాయి. స్వలాభం చూసుకుని కార్పొరేట్ సెక్టార్‌లను విపరీతంగా ప్రమోట్ చేశాయి. ఫలితం.. పేదల బతుకులు మారలేదు. కానీ, 2019 నుంచి స్పష్టమైన మార్పు చూస్తున్నాం. ఆర్థికంగా బలోపేతం అయితేనే అన్నివర్గాలు సమాజంలో గౌరవంగా బతుకుతాయని వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి విశ్వసించారు. సంక్షేమ పథకాలతో ఆసరాగా నిలిచారు. అదే సమయంలో నాలుగు ప్రధాన అంశాల్లో సమాన న్యాయం కల్పించడం ద్వారా సామాజిక సాధికారత సాధించారు. అందుకే మరోసారి విజయ దుందుభికి ‘సిద్ధం’ అవుతున్నారు!
అమ్మ ఒడి.. దేశంలో ఎవరూ ఊహించని పథకం. ఓ పేద తల్లి ద్వారా ఆమె బిడ్డలకు ఆర్థిక సాయం అందించేందుకు తీసుకొచ్చిన పథకం. కానీ, ఈ పథకం ఉద్దేశం వేరు. విద్య ద్వారా ఏదైనా సాధించవచ్చనే బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాన్ని ఆచరణలోకి తెచ్చారనడానికి ఇదొక నిదర్శనం. నాడు నేడు కళ్లెదుటే కనిపిస్తున్న మరో ఉదాహరణ. విద్య రంగం ఒక్కటే కాదు.. వైద్యం, ఆరోగ్యం, అవకాశం(ఉపాధి కల్పన) రంగాల్ని గత ప్రభుత్వం విస్మరిస్తే.. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయా రంగాల్లో ప్రక్షాళన చేపట్టి సమూల మార్పులు తీసుకొచ్చారు.
నవరత్నాల రూపంలో ఈ 57 నెలల పాలనలో డీబీటీ(డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్) ద్వారా నేరుగా బటన్ నొక్కి జమ చేసిన సొమ్ము రూ.2లక్షల 50 వేల కోట్లపైనే. ఆ ఖర్చుల్లో 80 శాతం లబ్ధిదారులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్లే. 2 లక్షల10 వేల ఉద్యోగాలు ఇస్తే.. అందులో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇచ్చారు. ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేసిన పాలన నుంచి.. ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా తీర్చి దిద్దుతున్న క్రమం ఇప్పుడు చూస్తున్నాం. జనాల గుండెతడి తెలిసిన నాయకుడు కాబట్టే ఇదంతా సాధ్యమవుతోంది.
‘‘జగన్ పాలన అంబేద్కర్ ఆకాంక్షలకు ప్రతిబింబం. సామాజిక సమతుల్యానికి గీటురాయి. అలాంటి పాలనకు.. దళిత, గిరిజన బహుజన వర్గాల వ్యతిరేకి అయిన చంద్రబాబు మధ్య ఎన్నికల సమరం జరగబోతోంది. పెత్తందారుల పాచికలతో కుట్రలు, మోసాలతో.. డబ్బు వరదలై ప్రవహించినా జగన్ వెంట పేదకులాలన్నీ నిలవబోతున్నాయి’’
పొలిటికల్ ఎంపవర్‌మెంట్..
సామాజిక సమతుల్యత కోసం ఉద్యమాలు జరిగిన చరిత్ర మనది. అయితే అప్పటిదాకా నిమ్న వర్గాలకు రాజకీయ ప్రాధాన్యం లేని ఏపీలో జగన్ రాకతో మార్పు వచ్చింది. సోషల్ జస్టిస్ ఒక నినాదం కాదు.. తమ ప్రభుత్వ విధానమని నిరూపించారు జగన్. ఓ మారుమూల పల్లెలో పుట్టిన వ్యక్తి.. అది గిరిజనుడు, అలాగే మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి ఇవాళ మంత్రి పదవులు కాగలిగారు.
నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ పాలన అందించడమే కాదు.. వాళ్లకు రాజకీయ ప్రాధాన్యం కల్పించిన నాయకుడు దేశంలో వైఎస్ జగన్ తప్ప ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. నామినేటెడ్ పోస్టుల మొదలు వివిధ పదవుల్లో చోటు, మంత్రివర్గంలో స్థానం.. జాతీయస్థాయిలో పెద్దల సభ(రాజ్యసభ)లో ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా రాజకీయ సాధికారత నిరూపించారు. ఎందుకంటే.. పొలిటికల్ ఎంపవర్‌మెంట్ లేకుండా ఏ సమాజం కూడా ముందుకు పోదని.. తమ తరఫున ప్రతినిధులు ఉండాలని ప్రతీ వర్గం కోరుకుంటుందనేది ఆయన గ్రహించారు. కాబట్టే అలాంటి వర్గాలకు సాధికారత కల్పించి బాసటగా నిలిచారు సీఎం జగన్.
అంబేద్కర్ ఆదర్శాలను, ఆశయాల్ని, భారత రాజ్యాంగాన్ని ఆవలింపు చేసుకున్నారు కాబట్టే.. తాము ఇవాళ ఈ స్థానంలో ఉన్నామని పలువురు మంత్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఆయా సామాజిక వర్గాలకు చెందిన మంత్రులు ఏం చెప్పారో మాటా మంత్రీ పూర్తి ఇంటర్వ్యూలో చూసేయండి ..
Comments
Please login to add a commentAdd a comment