కాకినాడ సిటీ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈనెల 15న జిల్లాకు రానున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు పశ్చిమగోదావరి జిల్లా పట్టిసీమ నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి జిల్లాలోని పోలవరం ఎడమ కాలువ ప్రాంతాన్ని ఏరియల్ సర్వేలో పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు సామర్లకోటలోని జిల్లాపరిషత్ గరల్స్ హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి కారులో సామర్లకోట మండలం వేట్లపాలెం చేరుకుని నీరు-చెట్టు కార్యక్రమంలో పాల్గొని, బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
వేట్లపాలెంలో కొద్దిసేపు విరామం తరువాత మూడు గంటలకు సామర్లకోట చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి 3.30 గంటలకు ధవళేశ్వరం చేరుకుంటారు. అక్కడ జరిగే డెల్టా రూపశిల్పి, అపర భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్ జయంతి వేడుకల్లో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు ధవళేశ్వరం నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి మధురపూడి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 5.15 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ పయనమవుతారు. సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. రెండు వారాల వ్యవధిలోనే సీఎం జిల్లాకు రెండోసారి రానున్నారు.
15న ముఖ్యమంత్రి జిల్లాకు రాక
Published Wed, May 13 2015 2:13 AM | Last Updated on Tue, May 29 2018 11:47 AM
Advertisement
Advertisement