ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీలు నవంబర్ 2వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీలు నవంబర్ 2వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. పై లీన్ తుపాను, భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాలను వారు పరిశీలిస్తారు. వీరు గురువారం ఈ ఏరియల్ సర్వే నిర్వహించాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల రెండో తేదీకి వాయిదా పడింది. 2వ తేదీ ఉదయం 11 గంటలకు ఢిల్లీ నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడినుంచి హెలికాప్టర్‌లో శ్రీకాకుళం జిల్లాలో ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. ఆ తరువాత ఒడిశాలోని గంజాం జిల్లాలో తుపానుకు దెబ్బతిన్న ప్రాంతాలో కూడా నష్టాన్ని పరిశీలిస్తారు.