సీఎం పర్యటనకు సర్వం సిద్ధం
దామరచర్ల :ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనకు సర్వం సిద్ధమైంది. ఏరియల్ సర్వే కోసం ముఖ్యమంత్రి మంగళవారం మండలానికి వస్తుండడంతో అధికారులు సోమవారం ఏర్పాట్లను పరిశీ లించారు. మండల కేంద్రానికి 9 కిలోమీటర్ల దూరంలో వీర్లపాలెం గ్రామ శివారులో, మండల కేంద్రం నుంచి అడవిదేవులపల్లి వెళ్లే దారిలో రెండు హెలీపాడ్‌లను సిద్ధం చేశారు. అలాగే అక్కడే అధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యేందుకు వీలుగా శామీయాలు ఏర్పా టు చేశారు. రోడ్డు వెంట వాహనాలు పార్కింగ్ చేసేందుకు చదును చేశారు. తహసీల్దార్ రమాదేవి దగ్గరుండి పనులను పరిశీలించారు. రోడ్డు నిర్మాణం , విద్యుద్దీకరణ పనులను పూర్తి చేశారు. పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బాంబ్ స్వ్కాడ్ సీఎం పర్యటించి ప్రాంతాల్లో విసృ్తత తనిఖీలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ డీఎస్‌పీ సందీప్ గోనె, సీఐలు పాండు రంగారెడ్డి, నరసింహారెడ్డి , దామరచర్ల ఎస్‌ఐ జానయ్య తదితరులు పాల్గొన్నారు.
హెలీపాడ్ పరిశీలన
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పర్యటన సందర్భంగా సోమవా రం జిల్లా కలెక్టర్ చిరంజీవులు హెలీ పాడ్ ఏర్పాట్లను పరిశీలించారు. మం డల పరిధిలోని వీర్లపాలెం, ముదిమాణిక్యం, కొత్తపల్లి, తాళ్లవీరప్పగూడెం, ఇర్కిగూడెం గ్రామాల పరిదిలో మంగళవారం సీఎం ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఏరియల్ సర్వే ముగిసిన తరువాత మండల కేంద్రానికి 9కిలో మీటర్ల దూరంలో వీర్లపాలెం గ్రామ శివారులో అటవీ ప్రాంతంలో సీఎం దిగనున్నారు. ఇందు కోసం రెండు హెలీపాడ్‌లను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే సమావేశానికి కావాల్సిన టెంట్లు, తాగునీటి వసతి, విద్యుత్ సౌకర్యం తదితర ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట ఏజేసీ ఎస్.వెంకట్‌రావు, ఏఎస్‌పీ, ఓఎస్డీ పి.రాధా కృష్ణారావు, ఆర్‌అండ్‌బీ ఎస్సీ లింగయ్య, ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, డీఈ నిరంజన్, ఏఈ సైదులు, సూర్యాపేట, దేవరకొండ ఆర్డీవోలు శ్రీనివాస్‌రెడ్డి, గుగులోతు రవినాయక్ తదితరులు ఉన్నారు.
సీఎం టూర్ షెడ్యూల్..
11.30 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
11.35 గంటలకు హెలికాప్టర్ ఎక్కుతారు.
12.00 గంటలకు దామరచర్ల మండలం వీర్లపాలెంలోని హెలిపాడ్ వద్ద ల్యాండింగ్
12.00-12.15 గంటల వరకు సీఎంకు అధికారుల భూ వివరాల బ్రీఫింగ్
12.15-12.45 వరకు ఏరియల్ సర్వే
12.45 గంటలకు మఠంపల్లి మండలం పెద్దవీడులోని హెలిపాడ్ వద్ద ల్యాండింగ్
12.45-1.00 వరకు సీఎంకు అధికారుల భూ వివరాల బ్రీఫింగ్
1.00 -1.10 వరకు భూ వివరాలపై సమీక్ష
1.15-2.00 గంటల వరకు లంచ్ బ్రేక్
2.00 గంటలకు హెలిపాడ్‌కు చేరుకుని తిరిగి హైదరాబాద్‌కు పయనమవుతారు.
ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష
మఠంపల్లి : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం మఠంపల్లి మండలంలో పర్యటించనున్నందున సోమవారం కలెక్టర్ పర్యటన ఏర్పాట్లను అధికారులతోకలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కృష్టపట్టె ప్రాంతంలో పవర్ ప్లాంట్ల నిర్మాణానికి స్థల అనుకూలతపై సీఎం ఏరియల్ సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఏఎస్‌పీ రాధాకృష్ణ, టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ శంకరమ్మ, ఐడీసీ డెరైక్టర్ శివారెడ్డి తదితరులు ఉన్నారు.