ఏపి కొత్త రాజధాని కోసం ఒప్పందం కుదుర్చుకున్న సింగపూర్ బృందం రంగంలోకి దిగింది. ఏపీ నూతన రాజధాని పరిధిలోని గ్రామాల్లో ఏరియల్ సర్వే నిర్వహించింది. తుళ్లూరు, రాయపూడి, నేలపాడు, శాఖమూరు, ఐనవోలు, మందడం, వెంకటపాలెం తదితర గ్రామాల్లో ఈ బృందం పర్యటించింది. రెండో విడతలో కృష్ణానది తీరంలోని లంక గ్రామాలపై ఏరియల్ సర్వే నిర్వహించారు. నివాసిత ప్రాంతాలతో పాటు వ్యవసాయ భూములను పరిశీలించారు. మరో వైపు ఈ ప్రాంత రైతులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. తమ భూములు లాక్కోవద్దని ఆందోళనకు దిగారు. నల్లజెండాలతో రైతులు నిరసన తెలిపారు.