
పూజలు చేస్తున్న అమృతసాగర్ తదితరులు
సంస్థాన్ నారాయణపురం(మునుగోడు) : రాచకొండలో ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు, అద్భుతమైన శిలాసంపద ఉన్నందున ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఇబ్రహీంపట్నం నియోజక వర్గ ఇన్‌చార్జి అమృతసాగర్ అన్నారు. మంగళవారం రాచకొండలోని స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి, మైసమ్మ దేవాలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉర్సు ఉత్సవాలనులు పురస్కరించుకుని దర్గాలో ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. తెలంగాణలో వైఎస్సార్‌సీపీకి 30సీట్లు వస్తాయన్నారు. ఆమె వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కేస రి సాగర్, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ప్రభాకర్ జం గయ్య తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment