డిప్యుటేషన్‌పై పోలీసుల నియామకాలు | police Appointments by diputation | Sakshi
Sakshi News home page

డిప్యుటేషన్‌పై పోలీసుల నియామకాలు

Published Tue, Sep 20 2016 12:04 AM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM

డిప్యుటేషన్‌పై పోలీసుల నియామకాలు - Sakshi

డిప్యుటేషన్‌పై పోలీసుల నియామకాలు

చౌటుప్పల్‌: నల్లగొండ జిల్లా నుంచి సైబరాబాద్‌ ఈస్ట్‌ కమిషనరేట్‌లో విలీనమైన పోలీస్‌స్టేషన్లలో జిల్లాకు చెందిన పోలీసులను డిప్యుటేషన్‌పై నియమిస్తామని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ ఎం.భగవత్‌ తెలిపారు. చౌటుప్పల్‌ మండలం తుఫ్రాన్‌పేటలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. రంగారెడ్డి జిల్లాలోని పోలీస్‌స్టేషన్లు కూడా సైబరాబాద్‌లో విలీనమైనప్పుడు సిబ్బందిని డిప్యుటేషన్‌పైనే తీసుకున్నారని, వారు ఇప్పటికీ అలాగే పని చేస్తున్నారన్నారు. సైబరాబాద్‌ ఈస్ట్, వెస్ట్‌ కమిషనరేట్ల విభజనకు సంబంధించి గవర్నర్‌ ఆర్డినెన్సు ఇచ్చారని, చట్టసభల్లో ఆమోదం కూడా పొందిందన్నారు. ప్రభుత్వం జీఓ జారీ చేయగానే కమిషనర్‌ పాలన ప్రారంభమవుతుందని తెలిపారు.  భువనగిరి టౌన్, రూరల్, వలిగొండ పోలీస్‌స్టేషన్లను యాదాద్రి జిల్లాలో, సంస్థాన్‌ నారాయణపురం పోలీస్‌స్టేషన్‌ను ఈస్ట్‌ కమిషనరేట్‌లో కలపాలని విజ్ఞప్తులు వచ్చాయని, ఈమేరకు పరిశీలన జరుగుతుందన్నారు. ఆయన వెంట చౌటుప్పల్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.నవీన్‌కుమార్‌ ఉన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement