సాక్షి, హైదరాబాద్: గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రాచకొండలో 12 శాతం క్రైమ్ రేట్ తగ్గిందని, కానీ మహిళలపై వేధింపుల కేసులు మాత్రం 11 శాతం పెరిగాయని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ మురళీధర్ భగవత్ తెలిపారు. దోపిడీలు, దొంగతనాల కేసుల్లోనూ 53 శాతం రికవరీ అయ్యాయన్నారు. సైబర్ క్రైమ్ అరికట్టేందుకు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ యోదా పేరుతో కొత్త కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని తెలంగాణలోనే తొలిసారిగా సీపీ మహేష్ భగవత్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాచకొండ ఇయర్ ఎండింగ్ క్రైమ్ రివ్యూను వెల్లడించారు. (చదవండి:ఫ్లాగ్ మార్చ్‌లో రికార్డు!)
రాచకొండలో మర్డర్ 52 , అత్యాచారాలు 323, కిడ్నాప్ 137 కేసులు నమోదు చేశామని కమిషనర్ పేర్కొన్నారు. దొంగతనం 1863, చీటింగ్ 1539, హత్యాయత్నాలు 116 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ ఏడాది రాచకొండ పరిధిలో 11 892 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. డయల్ 100కు రోజూ 1,66,181కు తక్కువ కాకుండా ఫిర్యాదులు వచ్చాయన్నారు. స్పెషల్ ఆపరేషన్ టీమ్ చెందిన కేసులు 892 ఉండగా రూ.5 కోట్ల 95 లక్షల ఆస్తి రికవరీ చేశామన్నారు. 2,525 మిస్సింగ్ కేసులు నమోదవగా, 2233 కేసులు ఛేదించామని తెలిపారు. ఈఏడాది 89 గుర్తు తెలియని మృతదేహాలను గుర్తించామన్నారు. రాచకొండలో నమోదైన కేసుల గురించి సీపీ పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి.. (చదవండి:15 రోజుల్లో పెళ్లి.. ఒక్కొక్కరిదీ ఒక్కోగాథ)
నేరాలు:
మానవ అక్రమ రవాణా కేసులు 41
ఎక్స్సైజ్ కేసులు 202
అక్రమంగా పీడీఎస్ రైస్ తరలింపు కేసులు 105
సైబర్ క్రైమ్ కేసులు 704
సోషియల్ మీడియా కేసులు 4, 9026గా ఉన్నాయి.
ట్రాఫిక్ :
► డ్రంక్ అండ్ డ్రైవ్ 3, 203, ఇందులో 324 మందిని జైలుకు పంపాము.
► డ్రంక్ డ్రైవ్ చేసిన వారికి రూ. 63 ,79 000 జరిమానాలు విధించాము.
► ఎంవీ యాక్ట్ కింద 15 లక్షల 56 వేల కేసులు నమోదు చేయగా కోటి 70 లక్షల రూపాయల జరిమానాలు విధించాము.
► రాచకొండలో 2047 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 533 మంది మృతి చెందారు. ఔటర్ రింగ్ రోడ్డుపై 31 యాక్సిడెంట్లు జరగ్గా, 15 మంది మృతి చెందారు.
► ఈ ఏడాది షీ టీమ్స్ 332 కేసులు నమోదు చేశాము.
► బాల్య వివాహాలు ఆపి 92 మందిని, ఆపరేషన్ ముస్కాన్ కింద 259 మంది పిల్లలను రెస్క్యూ చేశాము.
► రాచకొండలో 1052 మంది పోలుసులకు కరోనా సోకగా, అందులో 1022 రికవరీ అయ్యారు. 70 మంది పోలుసులు ప్లాస్మా దానం చేశారు.
► రాజా దర్బార్ ద్వారా 1453 ఫిర్యాదులు వస్తే 927 ఫిర్యాదులు పరిష్కారం అయ్యాయి.
► 1186 రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశాము.
► మూఢనమ్మకాలపై కళాబృందాలు ద్వారా 74 గ్రామాల్లో అవగాహన కల్పించాము
► నైజేరియన్ మోసాలు 40 , ఏటీఎం క్లోనింగ్ 15 , లోన్ ఫ్రాడ్స్ 42 కేసులు నమోదు చేశాము.
► సోషియల్ మీడియా ద్వారా అమ్మాయిలని వేధించిన 26 మందిని అరెస్ట్ చేశాము.
► ఈ ఏడాది శంషాబాద్ విమానాశ్రయంలో 35 కిలోల బంగారం పట్టుబడగా దాని విలువ రూ.15 కోట్లుగా ఉంటుందన్నారు.
► 2019 లో రూ.19కోట్లు విలువ చేసే 58.145 కేజీల బంగారం పట్టుకున్నాము.
Comments
Please login to add a commentAdd a comment