
సాక్షి, హైదరాబాద్ సిటీ: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గన్స్ కలకలం చెలరేగింది. పలు ప్రాంతాల్లో గన్‌లతోపాటు బుల్లెట్లు కలకలం సృష్టించాయి. గత కొంత కాలంలో నగరంలో గన్‌కల్చర్ పెరిగిపోయింది. యధేచ్ఛగా తుపాకులు, గన్నులను విక్రయిస్తున్నారు. ఈ దందాపై గత కొద్దిరోజులుగా పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా శుక్రవారం ఉదయం తనిఖీల్లో భాగంగా అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరి వద్ద గన్‌లు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే మల్కాజిగిరి, ఎల్బీనగర్ ప్రాంతాల్లో మూడు గన్స్, ఆరు బుల్లెట్లును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాలడుతున్న గ్యాంగులకు సరఫరా చేయడానికి ఈ గన్స్ తీసుకొచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ రోజు శుక్రవారం సాయంత్రం 4 గంటలకు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment