సాక్షి, హైదరాబాద్ : కరోనాను జయించి తిరిగి విధుల్లోకి చేరిన పోలీసులను రాచకొండ సీపీ మహేష్ భగవత్ సన్మానం చేశారు. లాక్‌డౌన్ సమయంలో విధి నిర్వాహనలో భాగంగా కరోనా వారియర్స్‌గా ముఖ్యపాత్ర పోషించిన పలువురు పోలీసులు కోవిడ్ బారిన పడ్డారు. రాచకొండ కమిసనరేట్ పరిధిలో దాదాపు 500 మంంది పోలీసులు కరోనాను జయించి మళ్లీ విధుల్లోకి చేరారు. వారి సేవలను గుర్తించి సీపీ మహేష్ భగవత్ సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సీపీ సుధీర్ కుమార్, డిసిపి మల్కాజిగిరి రక్షిత మూర్తి సహా పలువురు పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment