mahesh bhagavath
-
ఈ–చలానే పట్టించింది!
సాక్షి, సిటీబ్యూరో: ‘సాధారణంగా నేరం జరిగిన సమయం నుంచే పోలీసులు సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తుంటారు. కానీ, ఎల్బీనగర్ సీసీఎస్ క్రైమ్ ఇన్స్పెక్టర్ టీ రవి కుమార్ అలా చేయలేదు. చోరీ తర్వాత నంబర్ ప్లేట్ లేని బైక్‌పై పారిపోతుండగా కెమెరాల్లో రికార్డయిన నిందితుడు వేసుకున్న వైట్ కలర్ షర్ట్ ఆధారంతో కేసుకు మూలమైన సికింద్రాబాద్ పీఓటీ మార్కెట్లోని సీసీటీవీ కెమెరాలను జల్లెడ పట్టారు. ఓ బైక్ రైడర్ అదే వైట్ షర్ట్‌తో చోరీ కంటే కొన్ని గంటల ముందు మార్కెట్లో రెక్కీ చేసినట్లు గుర్తించారు. అయితే ఆ ఫుటేజీలో బైక్ నంబరు అస్పష్టంగా ఉండటంతో.. ఇన్స్పెక్టర్ మిగిలిన నంబర్లను కలిపేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాడు. చివరికి ఓ బైక్‌పై మెదక్‌లోని రామాయంపేటలో ఈ–చలాన్ జనరేట్ అయినట్లు గుర్తించారు. చలాన్‌లోని ఫొటోలను గమనించగా.. అందులో బైక్ రైడర్, చోరీలో పాల్గొన్న నిందితుడు ధరించిన వైట్ షర్ట్ ఒక్కటేనని తేలిపోయింది. ఇక ఇక్కడి నుంచి దర్యాప్తును ప్రారంభించిన రాచకొండ పోలీసులు చైతన్యపురి ఠాణా పరిధిలోని మహాదేవ్ జ్యువెల్లరీలో దోపిడీ, కాల్పుల కేసు పోలీసులు చేధించారు.’ వివరాలు వెల్లడిండిన రాచకొండ సీపీ మహేశ్ భగవత్.. - రాజస్థాన్‌లోని పాలి జిల్లాకు చెందిన మహేందర్ చౌదరి గజ్వేల్‌లో జయలక్ష్మి పేరిట జ్యువెల్లరీ షాపు నిర్వహిస్తున్నాడు. గతంలో ఈయన ఫిర్యాదుదారుడు రాజ్‌కుమార్ సురానా తమ్ముడి బంగారం షాపులో పనిచేశాడు. ప్రతి గురువారం పీఓటీ మార్కెట్ నుంచి నగరంలోని వేర్వేరు జ్యువెల్లరీ షాపులకు ఆభరణాలు డెలివరీ అవుతాయన్న విషయం మహేందర్‌కు తెలుసు. తన షాపు పెద్దగా నడవకపోవటంతో అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. భార్య గుడియా, బావ సిద్దిపేటలోని గౌరారంలో బంగారం షాపు ఉద్యోగి సుమేర్ చౌదరిలతో కలిసి పథకం వేశారు. రాజస్థాన్ నుంచి వలస వచ్చి రామాయంపేటలో బట్టల దుకాణం నిర్వహిస్తున్న భన్సీ రామ్ అలియాస్ మనీష్ దేవాసి, గజ్వేల్‌కు చెందిన మహ్మద్ ఫిరోజ్, కొండపాకకు చెందిన మనీష్ వైష్ణవ్, పాలకుర్తికి చెందిన రితేష్ వైష్ణవ్లతో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. రితేష్ తనకు పాత పరిచయస్తులైన హర్యానా, ఢిల్లీలకు చెందిన ప్రొఫెషనల్ నిందితులు సుమిత్ డాగర్, మనీష్, మానియాలను రంగంలోకి దింపారు. వీరికి తుపాకులు, డాగర్లను సమకూర్చాడు. - ఈనెల 1న భన్సీ రామ్, మానియా, సుమిత్, మనీష్ రామాయంపేట నుంచి సికింద్రాబాద్‌కు చేరుకున్నారు. గణపతి జ్యువెల్లర్స్ యజమాని రాజ్ కుమార్ సురానా, షాపులో ఉద్యోగి సుఖ్దేవ్ల కదలికలను గమనిస్తూ వారిని వెంబడించారు. రాత్రి 8 గంటల సమయంలో ఇరువురూ స్నేహపురి కాలనీలోని మహాదేవ్ జ్యువెల్లర్స్‌కు చేరుకున్నారు. సుమిత్, మనీష్ షాపులోకి చొరబడగా మానియా బయటి నుంచి షాపు షట్టర్‌ను మూసేశాడు. పక్కన సందులో భన్సీ రామ్ హోండా బైక్ మీద సిద్ధంగా ఉన్నాడు. షాపులో ఉన్న ఇద్దరు దుండగులు కల్యాణ్ చౌదరి, సుఖ్‌దేవ్‌లపై కాల్పులు జరిపి.. బంగారం బ్యాగుతో ఉడాయించి, బైక్‌లపై ఉప్పల్‌కు చేరుకున్నారు. హబ్సిగూడలో పల్సర్ బైక్‌ను వదిలేశారు. సుమిత్నూ ఇక్కడే వదిలేసి భన్సీరామ్ రామాయంపేటకు వెళ్లిపోయాడు. - అప్పటికే గజ్వేల్ నుంచి కారులో ఉప్పల్‌కు వచి్చన ప్రధాన నిందితుడు మహేందర్, ఫిరోజ్ సుమిత్‌ను ఎక్కించుకుని పాలకుర్తిలోని రితేష్ వైష్ణవ్ ఇంటికి చేరుకున్నారు. అదే రోజు రాత్రి హబ్సిగూడ వద్ద మనిష్, మానియాలు వదిలేసిన పల్సర్ బైక్‌ను సుమేర్ చౌదరి తీసుకొని, గుడియా జాత్తో కలిసి కొండపాకలోని మనీష్ వైష్ణవ్ ఇంటికి వెళ్లి బైక్, మారణాయుధాలను భద్రపరిచి, గౌరారంకు పరారయ్యారు. అనంతరం సుమేర్ కారు అద్దెకు తీసుకొని పాలకుర్తిలో ఉన్న మహేందర్, సుమిత్, మనీష్, మానియాలను తీసుకొని గజ్వేల్‌కు వెళ్లిపోయారు. రూ.4 లక్షల నగదు ఇచ్చి సుమిత్ నుంచి బంగారం బ్యాగు, తుపాకులను స్వా«దీనం చేసుకున్న మహేందర్ వీటిని గుడియా, సుమేర్లకు అందించగా.. వారు సొత్తుతో కొండపాకకు పారిపోయారు. - మహిళ కారులో ఉంటే పోలీసుల తనిఖీ నుంచి తప్పించుకోవచ్చని పథకం వేసిన ప్రధాన నిందితుడు మహేందర్, తన భార్య గుడియా, సుమిత్, మనీ‹Ù, మానియాలతో కలిసి రాష్ట్రం దాటేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే పోలీసులు గాలిస్తుండటంతో నిర్మల్‌లో గుడియాను వదిలేసి.. మహారాష్ట్రకు బయలుదేరారు. ఆమె తిరిగి బస్‌లో గజ్వేల్‌కు చేరుకుంది. అప్పటికే ఆధారాలను సమీకరించిన పోలీసులు.. గజ్వేల్‌లో గుడియా, సమీర్, ఫిరోజ్‌లను అరెస్టు చేశారు. రామాయంపేటలో భన్సీ రామ్, కొండపాకలో మనీష్ వైష్ణవ్, పాలకుర్తిలో రితేష్ వైష్ణవ్‌లను పట్టుకున్నారు. - నిందితుల నుంచి 2,701.8 గ్రాముల బంగారం, మూడు తుపాకులు, 7.65 ఎంఎం 25 లైవ్ బుల్లెట్లు, ఎయిర్ పిస్తోల్, డాగర్, నాలుగు ద్విచక్ర వాహనాలు, కారు, 6 సెల్ఫోన్లు, రూ.65 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన సూత్రధారి మహేందర్, సుమిత్, మనీ‹Ù, మానియా పరారీలో ఉన్నారు. -
రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఫోటోతో ఫేక్ వాట్సాప్
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డు అదపు లేకుండ పోతుంది. మరోసారి కేటుగాళ్లు రెచ్చిపోయారు. ఏకంగా రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఫోటోతో ఫేక్ వాట్సాప్ క్రియేట్ చేశారు. కమిషనర్ ఫోటోతో ఫేక్ నంబర్ నుంచి ప్రజలకు మెసేజ్‌లు చేస్తూ, మోసం చేసేందుకు యత్నిస్తున్నారు. ఈనేపథ్యంలో రాచకొండ సీపీ మహేష్ భగవత్ స్పందించారు. 87647 47849 నంబర్‌తో ఫేక్ వాట్సాప్ డీపీని సైబర్ దొంగలు సృష్టించారని, ఈ వాట్సాప్ నంబర్ నుంచి వస్తున్న మెస్సేజ్‌లను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. నిందితుడిని పట్టుకునే పనిలో సైబర్ టీం పనిచేస్తోందని తెలిపారు. -
నా భర్తను వెతికి పెట్టండి: కెనడాలో తెలుగు మహిళ ఆవేదన
సాక్షి, హైదరాబాద్: కెనడాలోని మాంట్రియల్లో ఉంటున్న దీప్తిరెడ్డి అనే వివాహిత తన భర్త కనిపించడం లేదని భారత విదేశాంగ శాఖకు ట్విటర్లో తెలిపింది. ఎటువంటి సమాచారం లేకుండా తన భర్త తనను వదిలేసి ఇండియాకు వచ్చేశారని వాపోయింది. ప్రస్తుతం, తాను గర్భవతిని ఉన్నట్లు వెల్లడించింది. తన భర్త అనుగుల చంద్రశేఖర్ రెడ్డి కెనడాలో మెక్‌గ్రిల్ యూనివర్సిటీలో రసాయన శాస్త్రవిభాగంలో పనిచేసేవారని తెలిపింది. తన భర్తకు చాలా సార్లు ఫోన్‌చేశాను.. నా సెల్ నంబరును నా భర్త తరపు కుటుంబ సభ్యులు బ్లాక్ చేశారని వాపోయింది. ఆగస్టు 9 నుంచి తన భర్త ఆచూకీ లేదని వాపోయింది. తాను.. భారత హైకమిషన్‌కు 2021 ఆగస్టు 20న ఫిర్యాదు చేశానని తెలిపింది. ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదని తన ట్వీట్లో తెలియజేసింది. కావాలనే నా భర్త ఆచూకీ తెలియకుండా చేస్తున్నారని తెలిపింది. కాగా, తన బావ శ్రీనివాస్ రెడ్డి చైతన్యపురిలో కానిస్టేబుల్‌గా పనిచేస్తుంటారని దీప్తి పేర్కొంది. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని తెలిపింది. తన భర్త ఆరోగ్యం పట్ల తీవ్ర ఆందోళనకు లోనవుతున్నానని తెలిపింది. దీప్తి వినతి మేరకు స్పందించిన విదేశాంగ శాఖ రాచకొండ పోలీసులకు సమాచారం ఇచ్చింది. రంగంలోకి దిగిన రాచకొండ పోలీసులు చంద్రశేఖర్ రెడ్డి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చదవండి: Krishna: కేఈబీ కెనాల్ లోకి దూసుకెళ్లిన ఇన్నోవా వాహనం -
మత్తు పదార్థాలు అమ్మే ముగ్గురు వ్యక్తులు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఎల్బీనగర్ జోన్ పరిధిలో మత్తు పదార్థాలు అమ్మే ముగ్గురు వ్యక్తులు ఎస్ఓటీ పోలీసుల చేతికి చిక్కినట్లు రాచకొండ కమిషనరేట్ సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖపట్నం ఏజెన్సీ నుంచి తెలంగాణకు హాషిష్ అయిల్ స్మగ్లింగ్ చేస్తున్నారని తెలిపారు. వారి వద్ద నుంచి ఒక మోటార్ సైకిల్, 3 మొబైల్ ఫోన్లు, రూ.800నగదు, 3 లీటర్ల హాషిష్ ఆయిల్‌ను పోలీసులు సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. చదవండి: అమ్మ ఆరోగ్యం కోసం లడ్డూ చోరీ వాటి మొత్తం విలువ రూ.9,80,800ఉంటుదని తెలిపారు. ఈ గ్యాంగ్‌లో నలుగురు సభ్యులు ఉన్నట్లు పేర్కొన్నారు. మళ్లప్పగరి శ్రీకాంత్‌రెడ్డి(మెదక్), వెంకటేష్(సంగారెడ్డి), కొండలరావు(విశాఖ)లను పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. గ్యాంగ్‌లోని మరో సభ్యుడు వెంకట్రాజు(విశాఖ) పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. గతంలో వీరిపై రాజమండ్రిలో కేసు నమోదైనట్లు వెల్లడించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కేసు నడిపి శిక్ష పడేలా చేస్తామని సీపీ తెలిపారు. -
ప్రేమ పేరుతో నమ్మించి.. వ్యభిచారంలోకి!
సాక్షి, హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్లో అదృశ్యమై.. హైదరాబాద్ చేరిన యువతి జాడను రాచకొండ పోలీసులు 10 గంటల వ్యవధిలోనే గుర్తించారు. రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్‌భగవత్ ఆదేశాలతో మనుషుల అక్రమ రవాణా విభాగ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ నేతృత్వంలోని బృందం టెక్నికల్ డాటా ఆధారంగా బాధితురాలి జాడను గుర్తించి రక్షించింది. పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమ బెంగాల్లో ఓ యువకుడు 23 ఏళ్ల యువతిని ప్రేమిస్తున్నానని నమ్మించాడు. శనివారం ఉదయం ఆమెను హైదరాబాద్‌కు తీసుకొచ్చాడు. వ్యభిచారం చేయాలని బలవంతం చేయడంతో బాధితురాలు తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. వారు వెంటనే ఈ విషయాన్ని అక్కడి పోలీసులకు చెప్పారు. దీంతో అక్కడ మహిళల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న శక్తివాహిని ఎన్జీవో సభ్యులు కూడా అప్రమత్తమై హైదరాబాద్‌లోని ప్రజ్వల ఎన్జీవో బృందానికి తెలిపారు. అదే సమయంలో పశ్చిమబెంగాల్ పోలీసులు, ప్రజ్వల సంస్థ ప్రతినిధులు రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ దృష్టికి తీసుకొచ్చారు. బాధితురాలు తల్లిదండ్రులకు చేసిన ఫోన్ కాల్ ఆధారంగా హైదరాబాద్‌లో ఉన్నట్లుగా గుర్తించి నిఘా పెట్టారు. కొన్ని గంటల వ్యవధి లోనే మరో ఫోన్ నంబర్ నుంచి తల్లిదండ్రులకు బాధితురాలు కాల్ చేయడంతో దాన్ని ట్రేస్ చేసి ఆ అమ్మాయిని రక్షించారు. ‘ఇరు రాష్ట్రాల పోలీసులు, శక్తివాహిని, ప్రజ్వల సంస్థల సభ్యులు ఈ అమ్మాయిని రక్షించేందుకు దాదాపు 5 గంటల పాటు శ్రమించారు. చివరికి శనివారంరాత్రి 11.30 గంటల ప్రాంతంలో రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసు ఛేదనలో సీపీ మహేశ్‌భగవత్ చూపిన చొరవ ప్రశంసనీయం’అని ప్రజ్వల సంస్థ నిర్వాహకు రాలు డాక్టర్ సునీతా కృష్ణన్ తెలిపారు. -
భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తాం
-
గ్రేటర్ పోరు: భారీ బందోబస్తు..
-
కరోనాను జయించిన వారియర్స్‌కు సన్మానం
సాక్షి, హైదరాబాద్ : కరోనాను జయించి తిరిగి విధుల్లోకి చేరిన పోలీసులను రాచకొండ సీపీ మహేష్ భగవత్ సన్మానం చేశారు. లాక్డౌన్ సమయంలో విధి నిర్వాహనలో భాగంగా కరోనా వారియర్స్‌గా ముఖ్యపాత్ర పోషించిన పలువురు పోలీసులు కోవిడ్ బారిన పడ్డారు. రాచకొండ కమిసనరేట్ పరిధిలో దాదాపు 500 మంంది పోలీసులు కరోనాను జయించి మళ్లీ విధుల్లోకి చేరారు. వారి సేవలను గుర్తించి సీపీ మహేష్ భగవత్ సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సీపీ సుధీర్ కుమార్, డిసిపి మల్కాజిగిరి రక్షిత మూర్తి సహా పలువురు పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
‘రాచకొండ మహిళా పోలీసులకు మర్దానీ-2 ప్రదర్శన’
సాక్షి, హైదరాబాద్ : రాచకొండ పోలీస్ కమీషనరేట్ పరిధిలో విధులు నిర్వరిస్తున్న మహిళా పోలీసుల కోసం రాచకొండ సీపీ మహేష్ భగవత్ ‘మర్దానీ’ 2 చిత్రాన్ని ప్రదర్శించారు. ఉప్పల్‌లోని ఏషియన్ సినిమా థియేటర్లో ఈ సినిమాను ప్రదర్శించారు. మర్దానీ చిత్రంలో మహిళల భద్రత కోసం రాణి ముఖర్జీ ఎలా కృషి చేసిందే ప్రతీ ఒక్కరు అలాగే పనిచేయాలని సీపీ మహేష్ భగవత్ సూచించారు. 2020లో మహిళలపై ఒక్క నేరం కూడా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ నిరంతరం పనిచేస్తున్నాయని అన్నారు. శివారు ప్రాంతాల భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని సీపీ పేర్కొన్నారు. -
‘అయ్యప్ప స్వాములపై ప్రచారం అవాస్తవం’
సాక్షి,సిటీబ్యూరో: పోలీస్ విధులు నిర్వహించే క్రమంలో సర్వీస్ నిబంధనల మేరకు ఉద్యోగులు వ్యవహరించాలని డీజీపీ ఆఫీస్ నుంచి వచ్చిన ఉత్తర్వులను మాత్రమే తాము అమలు చేస్తున్నామ ని రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్ భగవత్ అన్నారు. కేవలం అయ్యప్ప భక్తుల విషయంలో తాజాగా ఏ నిర్ణయం తీసుకోలేదని, అయితే ఈ విషయంపై కొందరు రాచకొండ పోలీస్‌లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. దీనిని ప్రజలు నమ్మ రాదని, తాము అన్ని మతాలను సమానంగా చూస్తామని సీపీ పేర్కొన్నారు. -
‘ఆమె’కు ఆమే భద్రత
‘ఇబ్రహీంపట్నంలోని ఓ కాలేజీకి చెందిన విద్యార్థిని షీ ఫర్ హర్ వలంటీర్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. శివగౌడ్ అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు ఫోన్లు చేసి వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఇబ్రహీం పట్నం పోలీసులు అతడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు.’ ‘అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఓ కాలేజీ విద్యార్థినికి బనవత్ గణేశ్ అనే యువకుడితో పరిచయం ఉంది. ఆమె తన స్నేహితురాళ్లతో కలిసి సంఘీ గుడికి వెళ్లిన సమయంలో అక్కడికి వచ్చి న అతను ఆమెతో సెల్ఫీలు దిగాడు. అతని వైఖరి నచ్చక బాధితురాలు అతడితో మాట్లాడం మానేసింది. అయితే బాధితురాలికి వివాహం నిశ్చయమైనట్లు తెలుసుకున్న గణేశ్ కాలేజీకి వచ్చి ప్రేమించాలంటూ ఆమెపై ఒత్తిడి చేశాడు. గతంలో తీసుకున్న ఫొటోలను అందరికీ పంపిస్తానంటూ బెదిరించాడు. దీంతో ఆందోళనకు గురైన బాధితురాలు ‘షీ ఫర్ హర్’ ద్వారా పోలీసులకు ఫిర్యాదుచేసింది. అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు.’ సాక్షి, సిటీబ్యూరో: కళాశాలల్లో మహిళలు, యువతుల భద్రత కోసం రాచకొండ పోలీసులు మూడేళ్ల క్రితం ప్రారంభించిన ‘షీ ఫర్ హర్’ సత్ఫలితాలనిస్తోంది. తద్వారా ర్యాంగింగ్, వేధింపులు తగ్గుముఖం పట్టాయి. బహిరంగ ప్రాంతాల్లో అమ్మాయిలను అటకాయించి వేధించేవారి భరతం పట్టేందుకు షీ బృందాలు పనిచేస్తున్నా కాలేజీ లోపల జరిగే వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదని రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ దృష్టికి రావడంతో ‘షీ ఫర్ హర్’ను ప్రారంభించి వారి రక్షణకు అండగా నిలిచారు. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూడకుండా వేధింపులపై ఫిర్యాదు చేసే ధైర్యం చేయని విద్యార్థినులకు మహిళా భద్రత చట్టాలపై అవగాహన కలిగించారు. ఈ షీ ఫర్ హర్ కార్యక్రమం కింద ఒక్కో కాలేజీ నుంచి ఇద్దరు సీనియర్ విద్యార్థినులను వలంటీర్లుగా ఎంపిక చేసి మహిళల చట్టాలపై చైతన్యం చేశారు. వీరు ఇక్కడ నేర్చుకున్న అంశాలను తోటి విద్యార్థినులకు సెమినార్ల ద్వారా వివరించారు. ఆయా కాలేజీల్లో వేధింపులు ఎదుర్కొనే విద్యార్థినుల సమస్యలు ‘షీ ఫర్ హర్’ దృష్టికి తీసుకు వస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. అయితే బాధితురాలి వివరాలు గోప్యంగా ఉంచి సదరు ఆకతాయిని తీవ్రతను బట్టి కేసు నమోదు చేస్తారు. లేదా కౌన్సెలింగ్ ఇచ్చి హెచ్చరిస్తారు. రాచ‘కొండ’ంత అండ... రాచకొండ పరిధిలో ‘షీ ఫర్ హర్’ వలంటీర్లుగా 625 ఉన్నారు. ఒక్కో కాలేజీ నుంచి ఇద్దరు సీనియర్ విద్యార్థినులకు షీ ఫర్ హర్ వలంటీర్లుగా ఎంపిక చేశారు. 2017లో 157 మంది, 2018లో 259 మంది, 2019లో 209 మంది షీ ఫర్ హర్ వలంటీర్లుగా చేరారు. వీరు ఆయా కళాశాలల్లో తోటి విద్యార్థినులకు ఎదురయ్యే వేధింపులను పోలీసుల దృష్టికి రావడంలో చురుగ్గా పనిచేస్తున్నారు. తద్వారా 2017లో 13 కేసులు, 2018లో ఆరు కేసులు, 2019లో మూడు కేసులు...మొత్తం మూడేళ్లలో 22 కేసులు నమోదయ్యాయి. అయితే చాలా వరకు ఫిర్యాదులు వచ్చినా ఆకతాయిలకు కౌన్సెలింగ్ చేసి ఈవ్‌టీజింగ్ ఎదురయ్యే అనర్థాలపై ముందస్తు హెచ్చరికలు చేశారు. దీనివల్ల చాలావరకు కాలేజీల్లో అమ్మాయిలకు వేధింపులు తగ్గుముఖం పట్టాయని షీ ఫర్ హర్ వలంటీర్లు పేర్కొంటున్నారు. రాచకొండ పోలీసుల అండతో భద్రత వాతావరణం నెలకొందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు అండగా ... కాలేజీల్లో ర్యాగింగ్ వల్ల గతంలో ఎన్నో గొడవలు జరిగాయి. ఈ నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో మహిళల రక్షణకు షీ బృందాలు పనిచేస్తున్నట్లుగానే కాలేజీల్లో విద్యార్థినుల కోసం విద్యార్థినులే పనిచేస్తే సత్పలితాలుంటాయన్న ఆలోచనతో మూడేళ్ల క్రితం ‘షీ ఫర్ హర్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అనుకున్నట్టుగానే కాలేజీ విద్యార్థినుల నుంచి మంచి స్పందన వచ్చింది. కేసులు తక్కువ ఉన్నా వీరి ప్రభావం కాలేజీల్లో ఎక్కువగా ఉంది. –మహేష్ భగవత్,రాచకొండ పోలీసు కమిషనర్ -
అప్పనంగా కిడ్నీలు కొట్టేస్తున్నారు
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా కిడ్నీ దాతలు కావాలంటూ సామాజిక మాధ్యమాల్లో(ఎస్‌ఓఎస్‌ఐఎంఎస్.కామ్ వంటి సైట్ల ద్వారా) చేసిన పోస్టుకు స్పందించిన దాతలకు కుదుర్చుకున్న డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్న ముగ్గురు సభ్యుల అంతర్జాతీయ ముఠాను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. గతంలో ముంబై, ఢిల్లీలో పట్టుకునేందుకు వెళ్లిన సమయంలో ప్రధాన నిందితుడు, భోపాల్ వాసి అమ్రిష్ ప్రతాప్ తప్పించుకుపోవడంతో లుక్అవుట్ నోటీసు జారీ చేయడంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఢిల్లీ విమానాశ్రయంలో పట్టుకొని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఆదివారం అప్పగించారు. అతడికి సహకరించిన ఢిల్లీవాసి రింకీ, నోయిడా వాసి సందీప్ కుమార్‌లను కూడా ట్రాన్సిట్ వారంట్‌పై సిటీకి తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా దాదాపు 40 వరకు బలవంతపు కిడ్నీల మార్పిడిలు చేసినట్టుగా అనుమానిస్తున్న ఈ ముఠా వివరాలను నాగోల్‌లోని రాచకొండ పోలీసు కమిçషనర్ క్యాంపు కార్యాలయంలో సీపీ మహేష్ భగవత్ సోమవారం మీడియాకు తెలిపారు. భారత్‌లో కిడ్నీ అవసరముందంటూ ఫేస్బుక్లో పోస్టును చూసిన నగరవాసి స్పందించి రూ.20లక్షలకు ఇచ్చేందుకు అంగీకరించాడు. ఈ ముఠా అతడిని ఈజిప్టు తీసుకెళ్లి బలవంతంగా కిడ్నీ మార్పిడి చేసి డబ్బులు ఇవ్వలేదు. ఇలా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. భార్య బాగు కోసం మోసాలబాట... ప్రస్తుతం ఢిల్లీలో స్థిరపడిన భోపాల్‌కు చెందిన అమ్రిష్ ప్రతాప్ అలియాస్ అంబారిష్ చిన్నతనంలోనే అమ్మనాన్నలను కోల్పోవడంతో తాత, నాన్నమ్మల వద్ద పెరిగాడు. 2006లో హిమాంగి అనే ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమెకు నాడీ సంబంధిత సమస్యలు రావడంతో ముంబై, న్యూఢిల్లీ నగరాల్లో చికిత్సకోసం దాదాపు రూ.40 నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చు చేశాడు. అయినా ఆమె ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఆర్థిక సమస్యల్లో పడ్డాడు. వీటని అధిగమించేందుకు తొలుత బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాల్లో పనిచేసిన అమ్రిష్ ప్రతాప్ మెడికల్ టూరిజమ్‌కు మారాడు. తొలుత చట్టవ్యతిరేకంగా అద్దెకు తల్లులు(సరోగసీ విధానం) నుంచి మొదలెట్టి ఆ తరవాత మానవ అవయవాల మార్పిడి వ్యాపారంవైపు మళ్లాడు. ఇలా డాక్టర్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, ప్రభుత్వ అధికారులు, ఏజెంట్లు, బ్రోకర్లతో కుమ్మక్కై ఈ మోసపు దందాకు తెరలేపాడు. డబ్బు అవసరమున్న వారిని గుర్తించి వారి అవయవాలు మార్పిడి చేసి డబ్బు ఇవ్వకుండా మోసం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఢిల్లీ వాసి రింకి, నోయిడా వాసి సందీప్ కుమార్‌తో పరిచయం ఏర్పడింది. టర్కీలో కిడ్నీ ఇచ్చేందుకు వచ్చిన సమయంలో సందీప్ కుమార్ ఈ మోసం గురించి తెలుసుకొని తానుకూడా అమ్రిష్ ప్రతాప్‌తో చేయికలిపి డబ్బు అవసరమున్న వారిని గుర్తించి ఇతడి చేతిలో పెట్టాడు. ఒక్కో కిడ్నీ మార్పిడికి రూ.50 లక్షల నుంచి కోటి వరకు రోగుల నుంచి ఈ ముఠా తీసుకునేది.ఇలా ఈ ముఠా రోగులు, దాతలను శ్రీలంకలో కొలంబోలొరి వెస్టర్న్ ఆస్పత్రి, ఈజిప్ట్ కైరోలోని అల్ ఫహద్ హాస్పిటల్, టర్కీ ఇజ్మిర్‌లోని కెంట్ ఆస్పతుల్లో 40 వరకు కిడ్నీ మార్పిడీలు చేశారు. డబ్బులివ్వకపోవడంతో వెలుగులోకి మోసం.. సందీప్ కుమార్ ఫేస్బుక్ ఖాతా రోహన్ మాలిక్ పేరుతో సృష్టించి భారత్‌లో కిడ్నీ అవసరముందంటూ చేసిన పోస్టు చూసిన రాచకొండ కమిషనరేట్ ప్రాంతానికి చెందిన ఓ బాధితుడు వారిని సంప్రదించారు. అనంతరం ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన ముఠాసభ్యుడొకరు వాట్సాప్‌లో బాధితుడితో సంప్రదింపులు జరిపాడు. రూ.20లక్షలు ఇస్తామంటూ ఆశ చూపాడు. ఢిల్లీకి రావాలంటూ ముఠా సభ్యులు అతనికి రైలు టికెట్ బుక్ చేశారు. గత జులై 20న అక్కడికి వెళ్లిన బాధితుడిని నోయిడాలోని ఓ హోటల్లో ఉంచారు. ఢిల్లీ మరికొన్నిచోట్ల వైద్య పరీక్షలు జరిపించారు. బాధితుడు రోగి బంధువుగా ధ్రువీకరణపత్రం సృష్టించారు. అనంతరం వైద్య వీసాపై అతణ్ని ఆగస్టులో టర్కీకి తీసుకెళ్లారు. అయితే శస్త్రచికిత్సకు ముందు డబ్బు ఇవ్వాలని బాధితుడు పట్టుబట్టడంతో అతని పాస్‌పోర్టు లాక్కొని బెదిరింపులకు దిగారు. అతడు భయపడటంతో శస్త్రచికిత్స చేయించి కిడ్నీ తీసేశారు. ఆ ముఠా బారి నుంచి బయటపడి హైదరాబాద్‌కు చేరుకున్న బాధితుడు ఈ ఏడాది ఫిబ్రవరి ఐదున రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు ఇది అంతర్జాతీయ ముఠా పనిగా గుర్తించారు. అమ్రిష్ ప్రతాప్‌ను పట్టుకోవడానికి ఢిల్లీ, ముంబైకి వెళ్లగా తప్పించుకొనిపోయాడు. అయితే లుక్ అవుట్ నోటీసు జారీతో ఢిల్లీ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు సింగపూర్ నుంచి వచ్చిన అమ్రిష్ ప్రతాప్‌ను పట్టుకొని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారమిచ్చారు. అతడిచ్చిన సమాచారంతో వారిని ట్రాన్సిట్ వారంట్‌పై సిటీకి తీసుకొచ్చారు. వీరిని పోలీసు కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని వివరాలు తెలుస్తాయని సీపీ మహేష్ భగవత్ అన్నారు.అమ్రిష్ ప్రతాప్‌పై 2016లో నల్గొండలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మాయిగూడెం పోలీసు స్టేషన్లలో రెండు కేసులు నమోదై ఉన్నాయన్నారు. దుబాయ్, వియత్నాం, చైనా, సింగపూర్, ఫిలిప్పీన్స్, బ్యాంకాక్, ఇండోనేసియా, మెక్సికోకు కూడా వెళ్లొచ్చని, అక్కడ కూడా కిడ్నీ మార్పిళ్లు ఏమైనా చేశాడా అనే విషయాలు కస్టడీలోకి తీసుకొని విచారిస్తే తెలుస్తాయని సీపీ అన్నారు. -
రెండో టెస్టుకు 1500 మందితో భారీ భద్రత
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో ఈనెల 12న భారత్, వెస్టిండీస్‌ల మధ్య జరగబోయే రెండో టెస్టుకు 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. విలేకరులతో మహేశ్ భగవత్ మాట్లాడుతూ..ఈ 1500 మంది పోలీసులతో పాటుగా స్టేడియం మేన్‌జ్‌మెంట్ కూడా ప్రత్యేకంగా ప్రైవేటు భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసిందని వెల్లడించారు. 100 సీసీ టీవీ కెమెరాలతో నిఘాను కట్టుదిట్టం చేశామని తెలిపారు. రెండో టెస్టుకు హాజరయ్యే ప్రేక్షకులు భద్రత అధికారుల సూచనలు పాటిస్తూ సెల్‌ఫోన్ తీసుకెళ్లవచ్చునని తెలిపారు. లాప్‌టాప్‌లు, కెమెరాలు, పవర్‌బ్యాంక్‌లు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, కాయిన్స్, లైటర్స్, హెల్మెట్స్, ఫెర్ప్యూమ్స్, బ్యాగ్స్, వాటర్ బాటిల్స్, బయటి తినుబండారాలకు అనుమతి లేదని వివరించారు. ఫోర్ వీలర్ వాహనాలకు 16 చోట్ల పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశామని, 4900 వరకు బైక్‌లను పార్కింగ్ చేసుకునేందుకు సౌకర్యాలు కల్పించామని వెల్లడించారు. -
‘చెడ్డీ గ్యాంగ్’ చిక్కింది!
సాక్షి, హైదరాబాద్: నగర శివారుల్లో వరుస చోరీలతో కలకలం సృష్టించిన కరడుగట్టిన అంతర్రాష్ట్ర చెడ్డీ గ్యాంగ్‌ను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. గుజరాత్‌లోని దహోడా జిల్లా సహోదా గ్రామానికి చెందిన అన్నదమ్ములు పారమౌర్ కిషన్ బాధ్య, పారమౌర్ రావోజీ బాధ్య, వీరి బంధువు గనవ భరత్ సింగ్‌ను ఆదిభట్ల ఔటర్ రింగ్‌రోడ్డు సమీపంలోని చెట్లపొదల్లో తచ్చాడుతుండగా రాచకొండ ఎస్వోటీ, సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.3,50,000ల విలువచేసే 10 తులాల బం గారం, కిలో వెండి ఆభరణాలు, రూ.3వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను గచ్చిబౌలిలోని రాచకొండ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో జాయింట్ కమిషనర్ సుధీర్‌బాబు, క్రైమ్స్ డీసీపీ నాగరాజుతో కలసి కమిషనర్ మహేశ్ భగవత్ బుధవారం మీడియాకు తెలిపారు. సహోదా గ్రామంలో దినసరి కూలీలుగా పనిచేసుకునే కిషన్, రావోజీ, భరత్ సింగ్‌తో పాటు మరో 8 మందిని అదే గ్రామానికి చెందిన రామ్‌జీ.. సూరత్‌లో పని కోసం తీసుకెళ్లి చోరీల బాట పట్టించాడు. అలా నేరాలబాట పట్టిన వీరు 2010లో ఆంధ్రప్రదేశ్‌పై దృష్టి సారిం చారు. 2012లో బోయిన్పల్లి పోలీసులు ఈ గ్యాంగ్ లో ఒకరిని, 2014లో మేడిపల్లి పోలీసులు మరికొంత మందిని అరెస్టు చేశారు. 2017లో మీర్‌పేట ఠాణా పరిధిలో జరిగిన చోరీ కేసులో దినేశ్ అరెస్టు కాగానే అతడి వేలిమద్రలు, వ్యక్తిగత వివరాలు తీసుకున్నారు. దినేశ్ జైలు నుంచి విడుదలయ్యాడు. అనంతరం మీర్‌పేట ఠాణా పరిధిలోని బడంగ్‌పేటలో, అగ్రికల్చర్ కాలనీలో చెడ్డీ గ్యాంగ్ చోరీలతో కలకలం సృష్టించింది. మియాపూర్, ఘట్కేసర్ ప్రాంతాల్లోనూ కలకలం సృష్టించింది. దీంతో వీరిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆయా చోరీల్లో పోలీసులకు లభించిన వేలిముద్రలతో చెడ్డీ గ్యాంగ్ దగ్గర తీసుకున్నవాటితో సరిపోయాయి. దీంతో ఇది చెడ్డీ గ్యాంగ్ పనే అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దినేశ్ నుంచి సేకరించిన వివరాల ప్రకారం సహోదా గ్రామానికి చేరుకున్నారు. అక్కడ వారికి నేరచరిత్ర లేదు: దినేశ్ గురించి అక్కడ పోలీసులను వాకబు చేయగా నేరచరిత్ర ఏమీ లేదని తేలింది. ఆ గ్రామంలో 35 కుటుంబాలు ఉండగా అంతా బంధువులే కావడం విశేషం. స్థానిక పోలీసుల సహకారంతో ఆ ఊరులోకి వెళ్లిన రాచకొండ పోలీసులకు చిత్రవిచిత్రాలు కనిపించాయి. ప్రతి ఇంటి ముందు ముళ్ల పొద ఉంది. పోలీసులకు దొరకకుండా తప్పించుకునేందుకు అనేక మార్గాలు ఉండటం కనిపించింది. దినేశ్ కోసం వచ్చారని తెలుసుకున్న ఆ గ్రామవాసులు మిగతావారిని కూడా అప్రమత్తం చేయడంతో తప్పించుకున్నారు. ఇలా నెలరోజుల పాటు అక్కడే ఉండి వారిని పట్టుకునే అవకాశం రాలేదు. కానీ ఆ గ్యాంగ్ సమాచారం తెలుసుకోగలిగారు. ఆదిభట్లలో అరెస్టు: పోలీసులు సహోదాలోనే ఉన్నట్లుగా భావించిన ఈ గ్యాంగ్ హైదరాబాద్ చేరుకున్నారు. ఆదిభట్ల ప్రాంతంలో ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో తచ్చాడుతున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ముగ్గురిని పట్టుకున్నారు. అనుమానం వచ్చి వారిని మీర్‌పేట ఠాణాకు తరలించారు. గతంలో సేకరించిన వేలిముద్రలతో ఇద్దరివి సరిపోలడంతో వారు చెడ్డీ గ్యాంగ్‌గా తేలింది. దినేశ్, సురేశ్, కిషన్‌లు ముఠాగా మారి చోరీలు చేస్తున్నారని తేలింది. ఇక్కడ చోరీలతో సొంతూర్లో దీపావళి.. ‘చోరీలు చేసేందుకు రైలు మార్గం ద్వారా వచ్చే వీరు 4 ప్రాంతాలను ఎంచుకొని ఒక్కో స్టేషన్లో దిగిపోతారు. ఆయా స్టేషన్లలో ఇద్దరు ఉంటే మరో ఇద్దరు వెళ్లి తాళాలు వేసి ఉన్న ఇళ్లను రెక్కీ చేసి వచ్చేవారు. శివారు ప్రాంతాల్లో ఉండే ఇళ్లను లక్ష్యంగా చేసుకునేవారు. పగటి వేళ అడవి లాంటి ప్రాంతంలో ఉండి రాత్రి కాగానే ప్యాంట్, షర్ట్ విప్పేసి చెడ్డీ వేసుకొని నడుంకు షర్ట్ చుట్టుకొని చెప్పులు చేతపట్టుకొని చోరీకి బయలుదేరతారు. శరీరానికి నూనెను రాసుకుంటారు. గోడలు ఎక్కి దూకే సందర్భంలో ప్యాంట్ వేసుకొని ఉంటే కిందపడే అవకాశముంటుందని చెడ్డీలు ధరిస్తారు. తాళాలు పగులగొట్టడంలో అనుభవమున్న ఇద్దరు ఆ పనిచూస్తారు. చోరీలు చేశాక ఒక ప్రాంతంలో కలుసుకుంటారు. చందానగర్ ప్రాంతంలో జరిగిన చోరీని దినేశ్ గ్యాంగ్ చేసినట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీపావళికి 2 నెలల ముందు, సంక్రాంతికి హైదరాబాద్ వచ్చి చోరీలు చేస్తుంటామని విచారణలో తెలిపారు. చోరీ చేసిన ఆభరణాలను గుజరాత్లో అమ్మి సొంతూరులో దీపావళి చేసుకుంటామన్నారు. వీరి అరెస్టుతో రాచకొండ కమిషనరేట్‌లో 8 చోరీలు, సైబరాబాద్ పరిధిలో 4, హైదరాబాద్ పరిధిలో ఒకటి, ఏపీలోని 15 కేసులు కొలిక్కివచ్చాయి. -
గోదాము కిరాయి ఇవ్వడం లేదని..
హైదరాబాద్: గోదాము కిరాయి ఇవ్వడం లేదని రూ.3 కోట్ల విలువైన పుస్తకాలను అమ్మేశాడు దాని యజమాని. బాధితుని ఫిర్యాదు మేరకు ముగ్గురిని అరెస్ట్ చేసిన రాచ కొండ ఎస్వోటీ టీమ్, మల్కాజిగిరి సీసీఎస్ పోలీస్‌లు 5 లారీల పుస్తకాలను స్వాధీనం చేసుకుని.. నిందితులను రిమాండ్‌కు తరలించారు. మంగళవారం ఎల్బీనగర్ సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో రాచకొండ సీపీ మహేశ్‌భగవత్ వివరాలు వెల్లడించారు. గాంధీనగర్‌కు చెందిన నికేతన్ దేవడిగ కాప్రా వంపుగూడ వద్ద గోదామును కిరాయికి తీసుకుని పుస్తకాలు ముద్రిస్తుంటాడు. తెలంగాణతోపాటు ఏపీ, ఛత్తీస్‌గఢ్‌కు భారత చరిత్ర, పర్యావరణ శాస్త్రం, అట్లాస్ ఆఫ్ మై వరల్డ్, సైన్స్, పిల్లలు, లైబ్రరీలకు పుస్తకాలు పంపిణీ చేస్తుంటా డు. గోదాము యజమాని నర్సింహారెడ్డికి నెలకు రూ.50 వేలు కిరాయి చెల్లించాలి. నికేతన్ ఆర్థిక పరిస్థితి సరిగా లేక కొంతకాలంగా కిరాయి చెల్లించకపోవడంతో లక్షల్లో బకాయిపడ్డాడు. అయితే నికేతన్ కిరాయి చెల్లించే స్థితిలో లేడని భావించిన నర్సింహారెడ్డి, అతని కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి కలసి ఈ నెల 4న గోదాము తాళం పగలగొట్టి రూ.3.24 కోట్ల విలువైన 10 ట్రక్కుల పుస్తకాలను బేగంపేటలోని ఎంఆర్ బుక్ సెంటర్ నిర్వాహకుడు ఎండీ రజీముద్దీన్‌కు రూ.15లక్షలకు అమ్మేశారు. రజీముద్దీన్ ముంబై సీఎస్టీ దగ్గరున్న ఆదినాథ్ బుక్ సేల్స్ ధమ్‌జీకి రూ.22 లక్షలకు అమ్మాడు. బాధితుని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న రాచకొండ ఎస్వోటీ టీమ్, మల్కాజిగిరి సీసీఎస్ పోలీసులు నర్సింహారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రజీముద్దీన్‌ను అరెస్ట్ చేసి ముంబై నుంచి 5 లారీల పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. ముంబైలో పుస్తకాలు కొనుగోలు చేసిన ధమ్‌జీపై కేసు నమోదు చేశారు. -
మహేశ్ భగవత్‌కు అరుదైన గౌరవం
సాక్షి, హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్‌కు మరోసారి అరుదైన గౌరవం దక్కింది. మహిళల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపినందుకు ఇప్పటికే అమెరికా కు చెందిన రియల్ హీరో అవార్డు అందుకున్న మహేశ్ భగవత్ తాజాగా కెనడాకు చెందిన ‘అసెంట్ కంప్లైన్సీ’సంస్థ నిర్వహించిన టాప్ 100 హ్యుమన్ ట్రాఫికింగ్ అండ్ సాల్వరీ ఇన్ఫ్లూయెన్స్ లీడర్లలో 47వ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. 13 ఏళ్లుగా మహిళల అక్రమ రవాణాను కూకటివేళ్లతో పెకిలించి వందలాది మంది మహిళలను ఆ వ్యభిచార కూపం నుంచి బయటకు తీసుకురాగలిగారని ఆ సంస్థ ప్రశంసించింది. వివిధ ప్రభుత్వ విభాగాలు, పౌర సేవా సంస్థలతో కలసి తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల్లో మహిళల అక్రమ రవాణా ముఠాల ఆటకట్టించగలిగారని పేర్కొంది. -
వన్ డే సీపీ ఇషాన్
‘సమయం మధ్యాహ్నం మూడు గంటలు. గచ్చిబౌలిలోని రాచకొండ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సందడి నెలకొంది. రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్‌తో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది ప్రవేశద్వారం వద్ద కోలాహలం కనిపించింది. అంతలోనే పోలీసు కమిషనర్ కారులో సీపీ డ్రెస్‌లో ఉన్న ఓ బాలుడు దిగాడు. మహేశ్ భగవత్ పుష్పగుచ్ఛం ఇచ్చి అతనికి స్వాగతం పలికారు. ఆరుగురు సాయుధ పోలీసులు ఆయుధాలతో గౌరవ వందనం చేశారు.భగవత్ ఆ చిన్నారిని మూడో అంతస్తులోని తన చాంబర్‌కు తీసుకెళ్లి అక్కడున్న ఆయన సీటులో కూర్చొబెట్టాడు. అతను నవ్వుతూ తన చేతిలోని కమిషనర్ కర్రను తిప్పుతూ అందరినీ చూస్తూ ఉండిపోయాడు’. ఏంటీ ఇదంతా చూస్తుంటే రాచకొండ పోలీసు కమిషనర్‌గా కొత్తగా వచ్చిన వ్యక్తికి మహేశ్ భగవత్ బాధ్యతలు అప్పగిస్తున్నట్టు అనిపిస్తుందా.. అయితే చదవండి. సాక్షి, సిటీబ్యూరో/రాయదుర్గం: విషయమేమిటంటే బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతూ నగరంలోని ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మెదక్ జిల్లా, కూచన్‌పల్లికి చెందిన ఆరేళ్ల బాలుడు దూదేకుల ఇషాన్. తన కోరికను నెరవేర్చేందుకు మహేష్ భగవత్ ‘వన్ డే పోలీసు కమిషనర్’గా అవకాశం కల్పించారు. పోలీసు ఆఫీసర్ కావాలన్న అతడి కోరికను మేక్ ఏ విష్ ఫౌండేషన్ సభ్యులు శశిచంద్ర, ప్రియాజోషి సీపీ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన అంగీకరించారు. ఈ సందర్భంగా ఆయన ఆ కుర్రాడి మోములో ఆనందం చూశారు. ఒకరోజు రాచకొండ కమిషనర్‌గా ఎలా అనిపిస్తుందని మీడియా ఇషాన్‌ను ప్రశ్నించగా ‘భహుత్ కుష్ హూ’ అని నవ్వుతూ తెలిపాడు. అందరితో కరచలనం చేస్తూ ఎంతో సంతోషంగా చేతిలోని కర్రను తిప్పుతున్న దృశ్యాన్ని చూసిన అతని తల్లిదండ్రులు చాంద్‌పాషా, హసీనా కన్నీటి బాష్ఫాలు రాల్చారు. కోరిక తీరిందిలా... మెదక్ జిల్లా కూచన్‌పల్లిలో వాల్‌పేయింటింగ్ చేస్తూ జీవనం సాగించే దూదేకుల చాంద్‌పాషా, హసీనా దంపతులకు ముగ్గురు సంతానం. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో సోఫియా మూడో తరగతి, ఇషాన్ రెండో తరగతి చదువుతున్నారు. ఐదేళ్ల తహసీన్ ఇంటివద్దే ఉంటుంది. భార్య హసీనా బీడీలు చుడతారని తెలిపాడు. చిన్నతనం నుంచే పోలీసు అవుతానని చెప్పే ఇషాన్‌కు బ్లడ్ క్యాన్సర్ ఉందని తేలడంతో తమకు దిక్కుతోచడం లేదన్నాడు. నగరంలోని ఎంఎన్‌జే ఆస్పత్రిలో చేర్పించామని, వైద్యులు బాగానే చికిత్స చేస్తున్నట్లు తెలిపాడు. ఇదే సమయంలో ‘మేక్ ఏ విష్ ఫౌండేషన్’ సభ్యులు తమ పిల్లాడి కోరికను తెలుసుకొని రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ దృష్టికి తీసుకొచ్చి నెరవేర్చడం ఆనందంగా ఉందన్నారు. ఒకరోజు సీపీతో మహేశ్‌భగవత్ సంభాషణ మహేశ్‌భగవత్: కైసా లగ్రే... ఇషాన్...? ఇషాన్: అచ్చా లగ్రా... హ.. హ.. హ..(నవ్వుతూ..) మహేశ్‌భగవత్: క్యాకరింగే పోలీస్ ఆఫీసర్ బన్కే ? ఇషాన్: లా అండ్ ఆర్డర్‌కు కంట్రోల్ కర్తా.. మహేశ్‌భగవత్: ఔర్ క్యా కరేగా.. ? ఇషాన్: చోరోంకో పకడ్కే జైల్ మే దాలూంగా.. ఔర్ సిగరేట్ పీనేవాలోంకో, గుట్కా కానేవాలోంకో జైల్‌మే దాలూంగా. మహేశ్‌భగవత్: ఔర్తోం కో క్యాకరేగా.. ? ఇషాన్: ఔరతోంకో ముష్కిల్ పైదా కర్నే వాలోంకో జైల్‌మే దాల్కే మార్తా మహేశ్‌భగవత్: ఔరతోంకో కైసా హెల్ప్ కర్తే.. ? ఇషాన్: నవ్వుతూ.. నైమాలూమ్... త్వరగా కోలుకోవాలి ఇషాన్‌కు ఆరేళ్లకే క్యాన్సర్ వ్యాధి సోకడం చాలా బాధగా ఉంది. బాలుడు త్వరగా కోలుకోవాలి. మేక్ ఏ విష్ సంస్థ ప్రతినిధులు కలిసి బాలుడి కోరిక వివరించగా వెంటనే అం గీకరించాను. క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స బాగా సాగుతోందని, తల్లిదండ్రులు కూడా చికిత్స తీరుపట్ల సంతృప్తిగా ఉన్నారు. విద్యార్థులు, యువకులు పోలీసులు, పోలీస్ ఆఫీస ర్లు కావాలనే కోరికను నెరవేర్చుకోవాలన్నారు. ఇప్పుడిప్పుడే చాలా మందికి పోలీసులమై ప్రజలకు న్యాయం చేయాలనే భావన కలుగుతోందన్నారు. –సీపీ మహేశ్‌భగవత్ -
73మంది ఎస్సైలకు స్థానచలనం
హైదరాబాద్: రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో భారీగా ఎస్ఐల బదిలీలు జరిగాయి. మల్కాజిగిరి, ఎల్బీనగర్, భువనగిరి జోన్లలోని లా అండ్ అర్డర్, ట్రాఫిక్, సీసీఎస్ తదితర విభాగాల్లో పనిచేస్తున్న 73 మంది ఎస్ఐలకు స్థానచలనం కలిగిస్తూ రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో చాలా కాలం నుంచి ఒకే పోలీసు స్టేషన్లలో పని చేస్తున్నవారే అధికంగా ఉన్నారు. వీరందరినీ వివిధ విభాగాలతో పాటు ఇతర ఠాణాలకు బదిలీ చేశారు. ఇప్పటికే 21 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేసిన మహేష్ భగవత్ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఎస్ఐలను బదిలీ చేశారని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. -
దొంగనోట్ల ముఠా అరెస్టు
సాక్షి, సిటీబ్యూరో: పెద్ద నోట్ల రద్దును అవకాశంగా తీసుకొని రూ.100, రూ.50, రూ.20, రూ.10 నకిలీ నోట్ల చెలామణి చేస్తున్న ముఠాను రాచకొండ ఎస్వోటీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఎనిమిది సభ్యులు గల ఈ ముఠాలో ఆరుగురిని అరెస్టు చేసి రూ.50వేల నగదు, జిరాక్స్ మెషీన్లు, రూ.2,22,310ల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో జాయింట్ సీపీ శశిధర్ రెడ్డి, ఎస్వోటీ ఇన్ స్పెక్టర్ నర్సింగ్‌రావులతో కలిసి కమిషనర్ మహేష్ భగవత్ వివరాలు వెల్లడించారు. హత్యకేసులో చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్న ఇబ్రహీంపట్నానికి చెందిన గణేశ్‌కు నకిలీ కరెన్సీ కేసులో పట్టుబడిన సిరిసిల్లా జిల్లాకు చెందిన అంజయ్యతో పరిచయం ఏర్పడింది. జైలు నుంచి విడుదలైన తర్వాత అతను తన మిత్రుడు సాయినాథ్తో కలిసి దొంగనోట్లు తెచ్చుకునేందుకు సిరిసిల్లా జిల్లా వెంకటపూర్ గ్రామానికి వెళ్లాడు. అంజయ్య లేకపోవడంతో అతని స్నేహితుడు సత్యం సూచన మేరకు నిజామాబాద్‌కు చెందిన శ్రీకాంత్‌ను కలిశాడు. అసలు కరెన్సీకి మూడింతలు నకిలీ కరెన్సీ ఇచ్చేలా ఒప్పందం కుదర్చుకున్న శ్రీకాంత్ సాయినాథ్ నుంచి రూ.2,90,000 తీసుకున్నాడు. అనుకున్న సమయానికి అతను దొంగ నోట్లు ఇవ్వ లేకపోవడంతో ఈ ఏడాది జనవరి 10న అంజయ్యను కలిసి రూ.లక్ష ఇచ్చాడు. నకిలీ కరెన్సీ ఇచ్చేందుకు కొంత సమయం కావాలని చెప్పడంతో ఈ విషయాన్ని సాయినాథ్ సిరిసిల్లా జిల్లా పెద్దూర్‌కు చెందిన చీకోటి సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లడంతో అతను తన మిత్రులు విజయ్‌కుమార్, కళ్యాణ్‌లను పరిచయం చేశాడు. వారు సికింద్రాబాద్‌లో ఒక కలర్ జిరాక్స్ మెషీన్ ను కొనుగోలు చేసి సిరిసిల్లలో నకిలీ కరెన్సీ ముద్రించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. తమ మిత్రుడైన కొహెడకు చెందిన శ్రీధర్ గౌడ్‌తో కలిసి మరో చిన్న జిరాక్స్ మెషీన్ కొనుగోలు చేసి నకిలీ కరెన్సీని ముద్రించి మార్కెట్లో చెలామణి చేసేవారు. ఇదే సమయంలో పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించడంతో దానిని అనుకూలంగా మలచుకుని పెద్ద మొత్తంలో చిన్న నోట్లను ముద్రించారు. వీటిని మార్కెట్లో చెలామణి చేసే విషయంలో అంజయ్య, సత్యనారాయణలతో చర్చించారు.అయితే అంజయ్యపై నిఘా వేసి ఉన్న రాచకొండ ఎస్వోటీ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందడంతో ఇబ్రహీంపట్నంలోని రమేశ్ ఇంటిపై దాడి చేసి ఆరుగురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న కళ్యాణ్, శ్రీకాంత్‌ల కోసం గాలిస్తున్నారు. -
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు
చైతన్యపురి: నేరాల నియంత్రణ, నేర నిరూపణకు సీసీ కెమెరాలు ఎంతో దోహదం చేస్తున్నాయని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. ప్రభాత్‌నగర్ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రూ. 11 లక్షలతో ఏర్పాటు చేసిన 22 సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ యూనిట్‌ను చైతన్యపురి పోలీస్ స్టేషన్ లో డీసీపీ తఫ్సీర్ ఇక్బాల్, ఏసీపీ వేణుగోపాలరావుతో కలిసి మహేష్‌భగవత్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎల్బీనగర్ జోన్ పరిధిలోని అన్ని కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని, శాంతిభద్రత కాపాడటంలో పోలీసులకు సహకరించాలని కమిషనర్ కోరారు. కెమెరాల ఏర్పాటుకు ముందుకొచ్చిన మహేష్‌భగవత్ కాలనీ మాజీ అధ్యక్షుడు గంగుల గోవర్దన్ రెడ్డి, అధ్యక్షుడు యాదగిరి ముదిరాజ్‌లను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. స్థానిక కార్పొరేటర్ జిన్నారం విఠల్‌రెడ్డి మాట్లాడుతూ.. త్వరలో మూడు కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. కార్యక్రమంలో ఏఎస్పీ రాహుల్, ట్రాఫిక్ ఏసీపీ రమేష్, చైతన్యపురి సీఐ గురురాఘవేంద్ర, ఎస్ఐలు కోటయ్య, సత్యనారాయణ, నర్సింహ, రత్నం, లింగం, లక్ష్మణ్, ప్రభాత్‌నగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
వ్యభిచారం చేసే ఇళ్లు సీజ్!
సాక్షి, సిటీబ్యూరో: అద్దె ఎక్కువ ఇస్తామన్నారని ముందు, వెనుక ఆలోచించకుండా ఎవరికి బడితే వారికి ఇల్లు కిరాయికి ఇచ్చేయకండి. ఇంట్లో దిగిన వారు వ్యభిచార కార్యకలాపాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కితే... ఇక ఆ ఇల్లు సీజ్ అయిపోతుంది. నగరంలో వ్యభిచార దందా నియంత్రించే దిశగా రాచకొండ పోలీసులు ముందుకెళ్తున్నారు. ఎల్బీనగర్, మల్కాజిగిరి జోన్లలో ఈ ఏడాది జులై ఒకటి నుంచి ఇప్పటివరకు మహిళల అక్రమ రవాణాపై 23 కేసులు నమోదు చేసి.. 75 మంది నిందితులను అరెస్టు చేశారు. ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్‌కు చెందిన 40 మంది బాధితులకు వ్యభిచార కూపం నుంచి విముక్తి కల్పించారు. అంతటితో ఆగకుండా ఇటువంటి ఆరాచకాలు సాగకుండా ఉండేందుకు వ్యభిచార గృహాలను సీజ్ చేసే దిశగా చర్యలు చేపట్టారు. రాచకొండ పోలీసుల అభ్యర్థన మేరకు నాలుగు అపార్ట్మెంట్లను తహసీల్దార్ తనకున్న ఎగ్జిక్యూటివ్ మేజి స్ట్రేట్ అధికారాలతో అధికార పరిమితులతో సీజ్ చేయాలని ఆదేశాలిచ్చారు. వీటిలో సరూర్‌నగర్ మండలం అల్కాపురిలోని ఓ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్, దిల్సుఖ్నగర్ లలితానగర్‌లో ఒక ఫ్లాట్, కర్మన్‌ఘాట్ జ్యోతినగర్‌లో ఒక ఫ్లాట్, కొత్తపేట న్యూ మారుతీనగర్‌లో ఒక ఫ్లాట్‌ను స్థానిక తహసీల్దార్ వెంకటేశ్వర్లు సీజ్ చేస్తూ ఆదేశాలిచ్చారు. అలాగే రాచకొండ పోలీసుల అభ్యర్థన మేరకుSవ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫ్లాట్స్‌కు సంబంధించిన మరో ఆరు అపార్ట్మెంట్లకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ వివరాలను గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ఎల్బీనగర్ డీసీపీ తఫ్సీర్ ఇక్బాల్, ఎస్ఓటీ అదనపు డీసీపీ రాంచంద్రారెడ్డిలతో కలిసి రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ వెల్లడించారు. అపార్ట్మెంట్లు, ఇళ్లలో వ్యభిచార దందాలో నిర్వాహకులను పట్టుకునే క్రమంలో ఆ ఇళ్లలో మైనర్లు దొరికితే మూడేళ్ల పాటు ఆ ఇంటిని సీజ్ చేసే అధికారం మేజిస్ట్రేట్‌కు ఉందని, మేజర్లు దొరికితే మూడు నెలల నుంచి ఏడాది పాటు ఆ ఇంటిని సీజ్ చేసే అధికారం ఉందని మహేష్ భగవత్ తెలిపారు. అసాంఘిక హోటళ్లపై చర్యలే... రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని కొన్ని హోటళ్లలో వ్యభిచారం జరుగుతున్నట్టు మా వద్ద సమాచారం ఉంది. అటువంటి పనులు మానుకోకపోతే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు. వ్యభిచార దందాలో దొరికిపోతే ఆ హోటల్ లైసెన్స్‌ను మూడు నెలలు నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేస్తారని, వ్యభిచారం చేస్తూ మైనర్లు పట్టుబడితే సదరు హోటల్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. అనంతరం రాచకొండ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ నర్సింగ రావు, ఇన్స్పెక్టర్ సురేందర్‌లకు రివార్డులు అందజేశారు. కిరాయిదారులపై దృష్టి పెట్టండి... ఇంటిని కిరాయికి తీసుకున్న వారిపై యజమానుల పర్యవేక్షణ ఉండాలి. ఎక్కువ అద్దె ఇస్తున్నారని ఎవరికి పడితే వారికి ఇల్లు కిరాయికి ఇచ్చి.. వారు ఏం చేస్తున్నారో పట్టించుకోకపోతే ఇబ్బందులు తప్పవు. అద్దెకుండే వారు వ్యభిచారం నిర్వహిస్తూ పట్టుబడ్డ సందర్భంలో ఆ ఇంటిని సీజ్ చేస్తాం. నాకు మేజిస్ట్రేట్ హోదా రాగానే వ్యభిచార నిర్వాహకులపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తా. – మహేష్ భగవత్, రాచకొండ సీపీ