
సాక్షి, హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్‌కు మరోసారి అరుదైన గౌరవం దక్కింది. మహిళల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపినందుకు ఇప్పటికే అమెరికా కు చెందిన రియల్ హీరో అవార్డు అందుకున్న మహేశ్ భగవత్ తాజాగా కెనడాకు చెందిన ‘అసెంట్ కంప్‌లైన్సీ’సంస్థ నిర్వహించిన టాప్ 100 హ్యుమన్ ట్రాఫికింగ్ అండ్ సాల్వరీ ఇన్‌ఫ్లూయెన్స్ లీడర్‌లలో 47వ స్థానాన్ని సొంతం చేసుకున్నారు.
13 ఏళ్లుగా మహిళల అక్రమ రవాణాను కూకటివేళ్లతో పెకిలించి వందలాది మంది మహిళలను ఆ వ్యభిచార కూపం నుంచి బయటకు తీసుకురాగలిగారని ఆ సంస్థ ప్రశంసించింది. వివిధ ప్రభుత్వ విభాగాలు, పౌర సేవా సంస్థలతో కలసి తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల్లో మహిళల అక్రమ రవాణా ముఠాల ఆటకట్టించగలిగారని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment