ఢిల్లీ: ఢిల్లీ జీ-20 సదస్సులో మన తెలంగాణ కళాకారులకు అరుదైన గౌరవం దక్కింది. సమ్మిట్‌లో 20 దేశాల డెలిగేట్స్ చొక్కాలకు బ్యాడ్డీలను మన కరీంనగర్ ఫిలిగ్రీ కళాకారులే తయారుచేశారు. కోణార్క్ సూర్యదేవాలయంలోని రథచక్ర నమూనాలో సిల్వర్‌తో బ్యాడ్జీలను తయారు చేశారు. జీ20 సందర్భంగా రెండు వందల బ్యాడ్జీలను భారత ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది.
జీ-20 సమ్మిట్‌లో స్టాల్ ఎగ్జిబిషన్ నిర్వహించేందుకు మన తెలంగాణ కళాకారులకు అనుమతి లభించింది. సిల్వర్ ఫిలిగ్రీ ఆఫ్ కరీంనగర్ హ్యాండీక్రాఫ్ట్స్ వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ అశోక్ ఆధ్వర్యంలో జీ-20లో స్టాల్ నిర్వహణ కొనసాగుతోంది.
గతంలో ఇవాంకా ట్రంప్‌తో పాటు పలు దేశాల డెలిగేట్స్ పర్యటన నేపథ్యంలోనూ కరీంనగర్ ఫిలిగ్రీకి ఈ తరహా గౌరవం దక్కింది. దివంగత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా కరీంనగర్ ఫిలిగ్రీ కళాకారులు నేషనల్ అవార్డ్ కూడా అందుకున్నారు.
ఇదీ చదవండి: జీ-20 సదస్సు... ఢిల్లీ చేరుకున్న బ్రిటన్ ప్రధాని రిషి సునాక్
Comments
Please login to add a commentAdd a comment