
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డు అదపు లేకుండ పోతుంది. మరోసారి కేటుగాళ్లు రెచ్చిపోయారు. ఏకంగా రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఫోటోతో ఫేక్ వాట్సాప్ క్రియేట్ చేశారు. కమిషనర్ ఫోటోతో ఫేక్ నంబర్ నుంచి ప్రజలకు మెసేజ్‌లు చేస్తూ, మోసం చేసేందుకు యత్నిస్తున్నారు.
ఈనేపథ్యంలో రాచకొండ సీపీ మహేష్ భగవత్ స్పందించారు. 87647 47849 నంబర్‌తో ఫేక్ వాట్సాప్ డీపీని సైబర్ దొంగలు సృష్టించారని, ఈ వాట్సాప్ నంబర్ నుంచి వస్తున్న మెస్సేజ్‌లను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. నిందితుడిని పట్టుకునే పనిలో సైబర్ టీం పనిచేస్తోందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment