సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు రాచకొండ పరిధిలో 10 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. రాచకొండ కమిషనరేట్‌లోని 13 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎన్నికలు జరుగనున్నాయని వెల్లడించారు. 1072 సాధారణ, 512 సమస్యత్మక, 53 అతి సమస్యత్మక పోలింగ్ ప్రాంతాలను గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. మద్యం, డబ్బుతో ఓటర్లను ప్రభావితం చేయాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. (చదవండి: ఆ వదంతులు నమ్మకండి)
29 చెక్‌పోస్ట్‌లు, 90 పికెట్స్, 104 వాహనాలు ఏర్పాటు చేసి నిఘా పట్టిష్టం చేశామని పేర్కొన్నారు. ఆరు ఫ్లెయింగ్ స్క్వాడ్, ఏసీపీ స్థాయి అధికారిని నోడల్ అధికారిగా నియమించామని తెలిపారు. కమిషనరేట్ పరిధిలో 533 నామినేషన్లు దాఖలయ్యాయని వెల్లడించారు. సోషల్ మీడియాలో దూషణలు, తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే చర్యలు తప్పవన్నారు. 353 మంది ఆయుధాలు డిపాజిట్ చేశారని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 10 మోంటెడ్ కెమెరా వాహనాలతో నిఘా పటిష్టం చేశామని పేర్కొన్నారు. 89 మంది రౌడీషీటర్లను బైండోవర్ చేశామని, 140 నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశామని కమిషనర్ పేర్కొన్నారు. (చదవండి: గ్రేటర్ ఎన్నికలు: ఎస్‌ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు..)
Comments
Please login to add a commentAdd a comment