
సాక్షి, హైదరాబాద్ : రాచకొండ పోలీస్ కమీషనరేట్ పరిధిలో విధులు నిర్వరిస్తున్న మహిళా పోలీసుల కోసం రాచకొండ సీపీ మహేష్ భగవత్ ‘మర్దానీ’ 2 చిత్రాన్ని ప్రదర్శించారు. ఉప్పల్‌లోని ఏషియన్ సినిమా థియేటర్లో ఈ సినిమాను ప్రదర్శించారు. మర్దానీ చిత్రంలో మహిళల భద్రత కోసం రాణి ముఖర్జీ ఎలా కృషి చేసిందే ప్రతీ ఒక్కరు అలాగే పనిచేయాలని సీపీ మహేష్ భగవత్ సూచించారు. 2020లో మహిళలపై ఒక్క నేరం కూడా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ నిరంతరం పనిచేస్తున్నాయని అన్నారు. శివారు ప్రాంతాల భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని సీపీ పేర్కొన్నారు.