బాలీవుడ్ హీరోయిన్ రాణీ ముఖర్జీ ప్రధానపాత్రలో నటించనున్న ‘మర్దానీ 3’ సినిమా ప్రకటన వచ్చింది. ప్రదీప్ సర్కార్ దర్శకత్వంలో రాణీ ముఖర్జీ లీడ్ రోల్ చేసిన ‘మర్దానీ’ చిత్రం 2014 ఆగస్టు 22 విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ సినిమాకి సీక్వెల్‌గా గోపీ పుత్రన్ డైరెక్షన్‌లో రూపొందిన ‘మర్దానీ 2’ సినిమా 2019 డిసెంబరు 13న రిలీజై బ్లాక్‌బస్టర్ అయింది. తొలి, ద్వితీయ భాగాల్లో సిన్సియర్ పోలీసాఫీసర్ శివానీ శివాజీ రాయ్‌పాత్రలో రాణీ ముఖర్జీ నటనకు ప్రశంసలు దక్కాయి.
ఇక ‘మర్దానీ 2’ ఐదవ వార్షికోత్సవం సందర్భంగా ‘మర్దానీ 3’కి సంబంధించిన మేకింగ్ వీడియోను యశ్ రాజ్ ఫిల్మ్స్ విడుదల చేసింది. ఈ చిత్రానికి అభిరాజ్ మినవాలా దర్శకత్వం వహించనున్నారు. ఈ సందర్భంగా రాణీ ముఖర్జీ మాట్లాడుతూ– ‘‘2025 ఏప్రిల్‌లో ‘మర్దానీ 3’ చిత్రం షూటింగ్‌ను ప్రారంభించబోతున్నామని తెలియజేయటానికి ఎంతో సంతోషంగా ఉంది.
పోలీస్ డ్రెస్ వేసుకుని అద్భుతమైనపాత్ర (శివానీ శివాజీ రాయ్) ను చేయటం నాకెప్పుడూ ప్రత్యేకమే. ఈపాత్ర చేయటం ద్వారా ప్రేక్షకుల నుంచి నాకు అపరిమితమైన ప్రేమాభిమానాలు లభించాయి. ‘మర్దానీ 3’లోనూ పవర్‌ఫుల్‌పోలీస్ ఆఫీసర్‌గా నటించనుండటం ఎంతో గర్వంగా ఉంది. మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూ, విధి నిర్వహణలో ప్రాణ త్యాగానికి సైతం వెనుకాడని ధైర్యవంతులైనపోలీస్ ఆఫీసర్స్‌కి ఈ సినిమా అంకితం. తొలి, మలి భాగాలను మించేలా ‘మర్దానీ 3’లో గొప్ప సన్నివేశాలున్నాయి’’ అని తెలిపారు. కాగా ‘రైల్వే మెన్’ మూవీ ఫేమ్ ఆయుష్ గు΄్తా ‘మర్దానీ 3’కి స్క్రిప్ట్‌ను అందించారు.
Comments
Please login to add a commentAdd a comment