
విజయదశమి లేదా దసరా వేడుకల్లో భాగంగా మహర్నవమి రోజు బాలీవుడ్ స్టార్లు ప్రసిద్ధ ఉత్తర బొంబాయి సర్బోజనిన్ ఆలయానికి తరలి వచ్చారు. ప్రత్యేక పూజలు చేసి దేవి ఆశీర్వాదాలు పొందారు.
సాక్షి, ముంబై: పవిత్ర దుర్గా నవరాత్రి ఉత్సవాల్లో బాలీవుడ్ హీరోయిన్లు సందడి చేశారు. రానున్న విజయదశమి లేదా దసరా వేడుకల్లో భాగంగా మహర్నవమి రోజు బాలీవుడ్ స్టార్లు ప్రసిద్ధ ఉత్తర బొంబాయి సర్బోజనిన్ ఆలయానికి తరలి వచ్చారు. ప్రత్యేక పూజలు చేసి దేవి ఆశీర్వాదాలు పొందారు.
ముఖ్యంగా ప్రముఖ హీరోయిన్, అజయ్ దేవగణ్ భార్య కాజోల్, హీరోయిన్ రాణి ముఖర్జీ, అమిత్ కుమార్, సినీ గాయకుడు షాన్ అతని తల్లి, టీవీ నటి, కపిల్ శర్మ ఫో ఫేం సుమోన చక్రవర్తి, జాన్ కుమార్ సాను, డెబినా బోన్నర్జీ, గుర్మీత్ చౌదరి, బప్పా బి లాహిరి, తనీషా లాహిరి, దేబు ముఖర్జీ , శర్బానీ ముఖర్జీ తదితర స్టార్లు ఉత్తర బొంబాయి సర్బోజనిన్ దుర్గను సందర్శించుకున్నారు. ముంబైలోని పురాతన , అతిపెద్ద దుర్గా పూజా మండపాల్లో ఇది కూడా ఒకటి. కాగా కరోనా మహమ్మారి, కఠిన ఆంక్షల మధ్య ఇది వరుసగా రెండో ఏడాది కూడా వర్చువల్‌గా సాగుతోంది. రెండు డోసుల టీకాలు తీసుకున్నవారికి మాత్రమే అనుమతి నిస్తుండటం విశేషం.
చదవండి : Durga Puja : బాలీవుడ్ హీరోయిన్ సందడి