సాక్షి, హైదరాబాద్: కెనడాలోని మాంట్రియల్‌లో ఉంటున్న దీప్తిరెడ్డి అనే వివాహిత తన భర్త కనిపించడం లేదని భారత విదేశాంగ శాఖకు ట్విటర్‌లో తెలిపింది. ఎటువంటి సమాచారం లేకుండా తన భర్త తనను వదిలేసి ఇండియాకు వచ్చేశారని వాపోయింది. ప్రస్తుతం, తాను గర్భవతిని ఉన్నట్లు వెల్లడించింది. తన భర్త అనుగుల చంద్రశేఖర్ రెడ్డి కెనడాలో మెక్‌గ్రిల్ యూనివర్సిటీలో రసాయన శాస్త్రవిభాగంలో పనిచేసేవారని తెలిపింది. తన భర్తకు చాలా సార్లు ఫోన్‌చేశాను.. నా సెల్ నంబరును నా భర్త తరపు కుటుంబ సభ్యులు బ్లాక్ చేశారని వాపోయింది.
ఆగస్టు 9 నుంచి తన భర్త ఆచూకీ లేదని వాపోయింది. తాను.. భారత హైకమిషన్‌కు 2021 ఆగస్టు 20న ఫిర్యాదు చేశానని తెలిపింది. ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదని తన ట్వీట్‌లో తెలియజేసింది. కావాలనే నా భర్త ఆచూకీ తెలియకుండా చేస్తున్నారని తెలిపింది. కాగా, తన బావ శ్రీనివాస్ రెడ్డి చైతన్యపురిలో కానిస్టేబుల్‌గా పనిచేస్తుంటారని దీప్తి పేర్కొంది. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని తెలిపింది. తన భర్త ఆరోగ్యం పట్ల తీవ్ర ఆందోళనకు లోనవుతున్నానని తెలిపింది. దీప్తి వినతి మేరకు స్పందించిన విదేశాంగ శాఖ రాచకొండ పోలీసులకు సమాచారం ఇచ్చింది. రంగంలోకి దిగిన రాచకొండ పోలీసులు చంద్రశేఖర్ రెడ్డి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
చదవండి: Krishna: కేఈబీ కెనాల్ లోకి దూసుకెళ్లిన ఇన్నోవా వాహనం
Comments
Please login to add a commentAdd a comment