
కుషాయిగూడ: నగరంలోని ఉప్పల్‌కు చెందిన యువకుడు, కెనడాకు చెందిన యువతి హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఉప్పల్‌కు చెందిన రోహిత్, కెనడాకు చెందిన కియర్ర ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాల అనుమతితో ఆదివారం మల్లాపూర్‌లోని ఓ కల్యాణ మండపంలో పెళ్లి చేసుకున్నారు. ఎంఎస్ కోసం కెనడాకు వెళ్లిన రోహిత్.. చదువు పూర్తయిన అనంతరం అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు.
ఆయన పనిచేసే సంస్థలో కియర్ర తండ్రి జేసన్ క్లబ్ పని చేస్తున్నారు. జేసన్ ఇంట్లో జరిగే పలు శుభకార్యాలకు వెళ్లిన రోహిత్‌కు, కియర్రకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమకు దారి తీసి పరిణయానికి బాటలు వేసింది. నూతన వధూవరులను మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ ఆశీర్వదించారు.
(చదవండి: వాహనదారులకు అలర్ట్ ఈ రూట్స్‌లో వెళ్లకండి.. ట్రాఫిక్ మళ్లింపులు కలవు)
Comments
Please login to add a commentAdd a comment