13న పెళ్లి.. ఇంతలోనే విషాదం | Uppal Woman Die With Covid Before Marraiage | Sakshi

13న పెళ్లి.. ఇంతలోనే విషాదం

May 3 2021 1:47 PM | Updated on May 3 2021 1:49 PM

Uppal Woman Die With Covid Before Marraiage - Sakshi

ఉప్పల్‌: కరోనా మహమ్మారి ఆ ఇంట్లో తీరని శోకాన్ని మిగిల్చింది. పెళ్లి బాజా మోగాల్సిన ఇంట్లో ఏకంగా నిశ్శబ్దం అలుముకుంది. ఈ ఘటన ఉప్పల్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉప్పల్‌ భరత్‌నగర్‌కి చెందిన కె.అనంతయ్య కూతురు.కె శ్రీవాణి (22) అనారోగ్యంగా ఉండటంతో పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో కుటుంబ సభ్యులు గత నెల 21న ఎల్‌బీనగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు.

ఆయినా కూడా ఫలితం లేకపోవడంతో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించింది. ఈ నెల 13న శ్రీవాణి వివాహం జరగాల్సింది ఉంది. దీంతో అనంతయ్య కుటుంబ విషాదంలో మునిగిపోయింది. అనంతయ్యకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. 

చదవండి: సెకండ్‌వేవ్‌: లాక్‌డౌన్‌పై సుప్రీం కీలక వ్యాఖ్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement