73మంది ఎస్సైలకు స్థానచలనం
Published Thu, Jun 1 2017 6:28 PM | Last Updated on Sun, Sep 2 2018 3:51 PM
హైదరాబాద్: రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో భారీగా ఎస్‌ఐల బదిలీలు జరిగాయి. మల్కాజిగిరి, ఎల్‌బీనగర్, భువనగిరి జోన్లలోని లా అండ్ అర్డర్, ట్రాఫిక్, సీసీఎస్ తదితర విభాగాల్లో పనిచేస్తున్న 73 మంది ఎస్‌ఐలకు స్థానచలనం కలిగిస్తూ రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో చాలా కాలం నుంచి ఒకే పోలీసు స్టేషన్లలో పని చేస్తున్నవారే అధికంగా ఉన్నారు.
వీరందరినీ వివిధ విభాగాలతో పాటు ఇతర ఠాణాలకు బదిలీ చేశారు. ఇప్పటికే 21 మంది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేసిన మహేష్ భగవత్ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఎస్‌ఐలను బదిలీ చేశారని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.
Advertisement
Advertisement