సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా చోరీకి గురైన, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల రికవరీలో 33.71 శాతంతో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నట్టు సీఐడీ అడిషనల్ డీజీ మహేశ్ భగవత్ పేర్కొన్నారు. ఎనిమిది నెలల్లో 15,024 మొబైల్ ఫోన్లను గుర్తించడంతోపాటు యజమానులకు అప్పగించినట్టు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) యాప్ ద్వారా మొబైల్ ఫోన్లను తిరిగి గుర్తిస్తున్నట్టు తెలిపారు. పోలీస్ కమిషనర్లు, ఎస్పీలందరి కృషితోనే ఇది సాధ్యమైందని మహేశ్ భగవత్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment