సాక్షి, హైదరాబాద్ : టెక్నాలజీ సహాయంతో మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు టెక్నాలజీ సహాయంతో మొబైల్ కొనుగోలు చేసేటప్పడు ఆన్‌లైన్ ద్వారా డబ్బులు చెలించినట్టు నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారు. వీరి వద్ద నుంచి పోలీసులు 5 లక్షల రూపాయల విలువైన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
దీనిపై రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ మాట్లాడుతూ.. ఈ కేసులో అరెస్టయిన నిందితులు గతంలో ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు. వీరిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు ఐదు రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయని తెలిపారు. టెక్నాలజీ ఉపయోగించి వీరు మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి మోసాలకు పాల్పడే వారికి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటివరకు వీరు 9 కేసుల్లో నిందితులుగా ఉన్నారని అన్నారు. నిందితుల దగ్గర నుంచి 11 ఒప్పో, 8 వివో, 2 సామ్‌సంగ్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. నిందితులను రిమాండ్‌కు తరలిచామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment