సాక్షి, హైదరాబాద్: నగర వాసులు నైట్ కర్ఫ్యూని విధిగా పాటించాలని రాచకొండ కమిషనరేట్ సీపీ మహేష్ భగవత్ కోరారు. సెకండ్ వేవ్‌లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయని.. ఇప్పటికే రాష్ట్రంలో 5,900 కేసులు నమోదు అయ్యాయన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో ఈరోజు నుంచి మే1 ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. బార్లు, హోటల్స్, రెస్టారెంట్లు, మాల్స్, షాప్స్ రాత్రి ఎనిమిది గంటలకు ముసివేయాలి. ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు, మెడికల్, ఎమర్జెన్సీ సర్విస్, మీడీయా ఉద్యోగులు ఐడికార్డ్స్ వెంట పెట్టుకోవాలి అని సూచించారు.
ఇక ‘‘నగరం మొత్తం మీద 46 చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేశాం. చాలా సీరియస్‌గా కర్ఫ్యూ అమలు ఉంటుంది. కర్ఫ్యూ నిర్వహణలో భాగంగా పాట్రోల్ మోబైల్స్, బ్లూ కోట్స్ రంగంలోకి దింపాము. నిభందనలు ఉల్లంఘించిన వారిపై సెక్షన్ 51 నుంచి 60 వరకు డిజార్డర్ మానేజ్ మెంట్, ఐపీసీ సెక్షన్ 188 కింద కేసులు నమోదు చేస్తాం. మాస్క్ ధరించకుంటే వెయ్యిరూపాలు జరిమానా విధిస్తాం. ప్రతి ఒక్కరు విధిగా మాస్క్, శానిటైజేషన్, సోషల్ డిస్టెన్స్ పాటించాలి. ప్రతి ఒక్కరు పోలీసులకు సహకరించాలి’’ అని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment