![Amid Omicron Scare Curfew Imposed in Mumbai for 2 Days - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/11/Lokdow.jpg.webp?itok=TDe1ZPT1)
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, ముంబై: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముంబైలో రెండు రోజుల పాటు కర్ఫ్యూ విధించింది. డిసెంబర్ 11, 12 రెండు రోజుల పాటు నగరంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. ఈ రెండు రోజులు ఊరేగింపులు, సభలు, సమావేశాలకు అనుమతి లేదని వెల్లడించారు.
(చదవండి: రెండో డోసు పూర్తైన 9 నెలలకు బూస్టర్! )
ప్రస్తుతం భారత దేశ వ్యాప్తంగా 33 ఒమిక్రాన్ కేసులుండగా.. ఒక్క మహారాష్ట్రలోనే 17 కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఒక్క రోజే ఏడు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో మూడున్నరేళ్ల చిన్నారి కూడా ఉంది. ఇక ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా కన్నా 2-4 రెట్లు అధిక ప్రమాదమే కాక.. వ్యాప్తి రేటు ఎక్కువగా ఉంటుందని డబ్ల్యూహెచ్‌ఓతో సహా నిపుణులు హెచ్చరిస్తుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
చదవండి: తీవ్రతపై త్వరలో స్పష్టత!
Comments
Please login to add a commentAdd a comment