కరోనా కల్లోలం.. ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ కీలక నిర్ణయం | Mumbai Schools to Remain Shut Till January 31 Amid Covid Spike | Sakshi
Sakshi News home page

కరోనా కల్లోలం.. ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ కీలక నిర్ణయం

Published Mon, Jan 3 2022 5:51 PM | Last Updated on Mon, Jan 3 2022 9:25 PM

Mumbai Schools to Remain Shut Till January 31 Amid Covid Spike - Sakshi

ముంబై: భారత్‌లో కోవిడ్‌, ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు ఆర్థిక రాజధాని ముంబైలోనూ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు అధికంగా నమోదవుతుండంతో ముంబైలోని పాఠశాలల మూసివేత జనవరి 31 వ వరకు కొనసాగుతుందని ప్రకటించింది. 1 నుంచి 9, అలాగే 11 వ తరగతి వరకు పాఠశాలలు మూసివేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. 10, 12 తరగతి విద్యార్థులు యథావిధిగా పాఠశాలకు హాజరవుతారని పేర్కొంది. 1నుంచి 9 తరగతి విద్యార్థులకు ముందుగా నిర్ధేశించిన విధంగా ఆన్‌లైన్‌ క్లాస్‌లు కొనసాగుతాయని పేర్కొంది.
చదవండి: Omicron: జనవరి మూడో వారం నాటికి 2 లక్షల యాక్టివ్‌ కేసులు!

రాష్ట్రం మొత్తంలో 11,877 కొత్త కరోనావైరస్ కేసులు నమోదవగా.. ఒక్క ముంబైలో 8,063 కోవిడ్‌ కేసులు వెలుగుచూశాయి. మహారాష్ట్రలో ఆదివారం  ఇది ముందు రోజు కంటే 29 శాతం ఎక్కువ. దీంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య 29,819కు చేరింది. అదేవిధంగా ముంబైలో ఒమిక్రాన్‌ కేసులు 328కి పెరిగాయి. మరోవైపు రాష్ట్రంలో కొత్తగా 50 ఒమిక్రాన్ వేరియంట్‌ కేసులు నమోదయ్యాయి. పుణె నుంచి అత్యధికంగా 38 మంది ఒమిక్రాన్‌ బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్‌ బాధితుల సంఖ్య 510కి చేరుకుంది. 
చదవండి: రైల్వే ట్రాక్‌పై తలపెట్టి సుసైడ్‌.. లోకో పైలట్‌ ఎమర్జెన్సీ బ్రేక్‌ వేయడంతో..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement