
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’నిందితుల ఎన్‌కౌంటర్ కేసుపై విచారణకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటుచేసింది. ఏడుగురు సభ్యుల ఈ విచారణ బృందానికి రాచకొండ సీపీ మహేశ్ భగవత్ నేతృత్వం వహించనున్నారు. వనపర్తి ఎస్పీ అపూర్వరావు, మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, రాచకొండ అడిషనల్ డీసీపీ సురేందర్‌రెడ్డి, సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి, రాచకొండ ఐటీ సెల్‌కు చెందిన శ్రీధర్‌రెడ్డి, కోరుట్ల సీఐ రాజశేఖర్ రాజు, సంగారెడ్డి డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ వేణుగోపాల్‌రెడ్డిలు ఈ సిట్‌లో సభ్యులుగా ఉన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. ప్రభుత్వం ఈ సిట్‌ను ఏర్పాటు చేసింది. చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్ జరిగిన తీరు, దానికి దారి తీసిన పరిస్థితులపై సిట్ దర్యాప్తు చేసి కోర్టుకు నివేదిక సమర్పించనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ఆదివారం ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment