సీసీ పుటేజిలో నిందుతులకు సంబంధించిన ఫోటో
సాక్షి, మేడ్చల్: తుపాకితో బెదిరించి బంగారు దుకాణంలో చోరికి ప్రయత్నించిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. సినిమా దృశ్యాన్ని తలపించిన ఈ ఘటన జవహర్ నగర్, కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం.. దుమ్మాయిగూడలోని దుబాయ్ బిల్డింగ్ వద్ద ఉన్న జ్యువెలరీ షాప్‌లో ఆరుగురు అగంతకులు తుపాకితో బెదిరించి చోరికి ప్రయత్నించారు. చోరీ సమయంలో ముఠా సభ్యులు అక్కడ ఉన్నవారిని బెదిరించడానికి గాల్లోకి కాల్పులు జరిపారు. పారిపోతున్న సమయంలో రోడ్డుపైన వెళ్తున్న వ్యక్తిని బెదిరించి బైక్ లాక్కుని ఉడాయించారు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ చోరికి యత్నించింది అంతర్ రాష్ట్ర ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు ప్రారంభించారు. అయితే జ్యువెలరీ షాప్‌లో బంగారం ఎంత చోరికి గురైందో తెలియాల్సివుంది.
Comments
Please login to add a commentAdd a comment