చైల్డ్‌ ఫ్రెండ్లీ పోలీస్‌స్టేషన్‌ | Child Friendly Police Station In Medchal District Medipalli | Sakshi
Sakshi News home page

చైల్డ్‌ ఫ్రెండ్లీ పోలీస్‌స్టేషన్‌

Published Thu, Nov 14 2019 3:12 AM | Last Updated on Thu, Nov 14 2019 3:12 AM

Child Friendly Police Station In Medchal District Medipalli - Sakshi

మేడిపల్లి: దేశంలోనే తొలిసారిగా గ్రేటర్‌ పరిధిలో ని మేడ్చల్‌ జిల్లా మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో గురువారం చైల్డ్‌ ఫ్రెండ్లీ స్టేషన్‌ను ప్రారంభించనున్నా రు. బచ్‌పన్‌ బచావో సంస్థ, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఈ స్టేషన్‌ను ఏర్పాటు చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 1 నుంచి 18 ఏళ్ల  పిల్లలు.. వారికి ఎదురయ్యే బాధలు, ఈవ్‌టీజిం గ్, ర్యాగింగ్‌ సమస్యలను ఈ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి వివరించవచ్చని పేర్కొన్నారు. మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ప్రత్యేకంగా కేటాయించిన రూమ్‌కు చిల్డ్రన్స్‌ పోలీస్‌స్టేషన్‌గా పేరు పెట్టారు.

అందులో ప్రత్యేక శిక్షణ పొందిన యూనిఫాంలో లేని పోలీసులు ఉంటారు. పోలీసులంటే భయం లేకుండా ఈ చైల్డ్‌ ఫ్రెండ్లీ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి పిల్లలు ఫిర్యాదు చేయవచ్చు. అలాగే పలు ప్రాంతాల్లో తప్పిపోయిన పిల్లలు, విద్యార్థులను ఇక్కడకు తీసుకొస్తే వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి వారి కుటుంబ సభ్యులు వచ్చే వరకు మంచి వాతావరణంలో ప్రత్యేకంగా చూసుకుంటారు. మానసిక వైద్య నిపుణులు కూడా అందుబాటులో ఉంటారు. ఈ పోలీస్‌స్టేషన్‌లో ఉచిత న్యాయ సలహాలు కల్పిస్తూ పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు, పచ్చదనం నెలకొ న్న వాల్‌పోస్టర్లు, టేబుళ్లు, కుర్చీలు, మంచాలు తదితర సౌకర్యాలు కల్పించారు. కళాశాలలో, స్కూళ్లలో విద్యార్థుల సమస్యలపై ఎలా ఫిర్యాదు చేయాలో కూడా విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని సీపీ మహేశ్‌ భగవత్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement