medipally police station
-
25 మందికి వైరస్ పంచిన చిరు పార్టీ
సాక్షి, హైదరాబాద్: ఒక చిన్న బర్త్‌డే పార్టీ.. రెండు కుటుంబాల్లోని మొత్తం 25 మందిని రిస్క్‌లోకి నెట్టేసింది. వారందరికీ కరోనా వైరస్ సోకింది. వీరిలో ఇద్దరు ఇప్పటికే మృతి చెందగా, మిగిలినవారు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మలక్‌పేట్‌గంజ్‌లో పల్లినూనె వ్యాపారం చేసే వ్యక్తి (52) ద్వారా ఆయన భార్య సహా వనస్థలిపురంలో ఉంటున్న తల్లిదండ్రులకు, సోదరుడికి, ఆయన భార్యకు, వారి ఇద్దరి పిల్లలకు కరోనా వైరస్ సోకింది. ఈ విషయం తెలియక పల్లినూనె వ్యాపారి సోదరుడు ఏప్రిల్ 23న ఇంటి వద్దే తన బిడ్డ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. (కరోనా క్యాబ్‌లు వచ్చేశాయ్!) హుడా సాయి నగర్‌లోని ఐటీ ఉద్యోగి తల్లి సహా బీఎన్‌రెడ్డిలోని ఎస్కేడీనగర్ లోని సోదరి కుటుంబ సభ్యులు సహా పలువురు ఈ వేడుకకు హాజరయ్యారు. ఇలా ఒక చిన్న బర్త్‌డే పార్టీ.. ఆ రెండు కుటుంబ సభ్యులందరినీ ఇబ్బందు ల్లో పడేసింది. వీరిలో పల్లినూనె వ్యాపారి తండ్రి సహా రెండో కుమారుడు కూడా ఇప్పటికే మృతి చెందారు. ఇక మేడిపల్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వ్యక్తి ద్వారా మొత్తం 13 మందికి వైరస్ సోకింది. కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు, బంధువులతోపాటు ఆయన ఇంటి పక్కన ఉండే కార్పెంటర్ కుటుంబానికి కూడా కరోనా వచ్చింది. (కరోనాకు ధూమపానం మంచిదేనట!) -
చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్‌స్టేషన్
మేడిపల్లి: దేశంలోనే తొలిసారిగా గ్రేటర్ పరిధిలో ని మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో గురువారం చైల్డ్ ఫ్రెండ్లీ స్టేషన్‌ను ప్రారంభించనున్నా రు. బచ్పన్ బచావో సంస్థ, రాచకొండ పోలీస్ కమిషనరేట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ స్టేషన్‌ను ఏర్పాటు చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఒక ప్రకటనలో తెలిపారు. 1 నుంచి 18 ఏళ్ల పిల్లలు.. వారికి ఎదురయ్యే బాధలు, ఈవ్‌టీజిం గ్, ర్యాగింగ్ సమస్యలను ఈ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి వివరించవచ్చని పేర్కొన్నారు. మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ప్రత్యేకంగా కేటాయించిన రూమ్‌కు చిల్డ్రన్స్ పోలీస్‌స్టేషన్‌గా పేరు పెట్టారు. అందులో ప్రత్యేక శిక్షణ పొందిన యూనిఫాంలో లేని పోలీసులు ఉంటారు. పోలీసులంటే భయం లేకుండా ఈ చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి పిల్లలు ఫిర్యాదు చేయవచ్చు. అలాగే పలు ప్రాంతాల్లో తప్పిపోయిన పిల్లలు, విద్యార్థులను ఇక్కడకు తీసుకొస్తే వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వారి కుటుంబ సభ్యులు వచ్చే వరకు మంచి వాతావరణంలో ప్రత్యేకంగా చూసుకుంటారు. మానసిక వైద్య నిపుణులు కూడా అందుబాటులో ఉంటారు. ఈ పోలీస్‌స్టేషన్‌లో ఉచిత న్యాయ సలహాలు కల్పిస్తూ పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు, పచ్చదనం నెలకొ న్న వాల్‌పోస్టర్లు, టేబుళ్లు, కుర్చీలు, మంచాలు తదితర సౌకర్యాలు కల్పించారు. కళాశాలలో, స్కూళ్లలో విద్యార్థుల సమస్యలపై ఎలా ఫిర్యాదు చేయాలో కూడా విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని సీపీ మహేశ్ భగవత్ పేర్కొన్నారు. -
హైదరాబాద్ రోడ్డుపై కరెన్సీ సంచుల కలకలం
హైదరాబాద్: భారతదేశం మొత్తం కొత్త కరెన్సీ నోట్ల కోసం అల్లాడుతున్నవేళ.. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ రోడ్డుపై కరెన్సీ సంచుల వ్యవహారం కలకంలం రేపింది. మేడిపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్- వరంగల్ హైవేపైనున్న మేడిపల్లి గ్రామానికి శనివారం మధ్యాహ్నం జనం తండోపతండాలుగా వచ్చారు. అక్కడి సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(సీపీఆర్ఐ- కేంద్ర ప్రభుత్వ సంస్థ) వద్ద గుర్తుతెలియని వ్యక్తులు డబ్బు సంచులను వదిలేశారనే సమాచారంతో జనం అక్కడికి చేరుకుని, వెతుకులాట ప్రారంభించారు. భారీ జనసందోహం కారణంగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. సమాచారం తెలుసుకున్న మేడిపల్లి పోలీసులు సీపీఆర్ఐ వద్దకు చేరుకుని రోడ్లపైనున్న జనాన్ని చెదరగొట్టారు. కొద్ది నిమిషాల్లో ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. అసలా డబ్బు సంచుల వ్యవహారం ఒట్టి వదంతేనని పోలీసులు తేల్చారు. పుకార్లు నమ్మిన చాలా మంది డబ్బుల కోసం ఎగబడ్డారని, ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉందని మేడిపల్లి పోలీసులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది. దేశంలోని పలు ప్రాంతాల్లోనూ ఇలాంటి పుకార్లు చెలరేగుతున్నాయి. వాటిలో కొన్ని చోట్ల నిజంగానే పాత లేదా నకిలీ నోట్ల కట్టలు బయటపడుతున్న సంగతి తెలిసిందే. -
వివాహిత అదృశ్యం
బోడుప్పల్ (హైదరాబాద్): ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ వివాహిత కనిపించకుండా పోయిన సంఘటన మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బోడుప్పల్ వీరారెడ్డి కాలనీలో నివసించే దంపతులు డి. కవిత(40) బహుదూర్‌సింగ్ ఈ నెల 6న గొడవ పడ్డారు. ఆ తర్వాత కవిత ఇంట్లో నుంచి బయటకు వెళ్లి పోయింది. ఎక్కడ వెతికినా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆదివారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మనస్థాపంతో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
బోడుప్పల్: కుటుంబ కలహాలతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ శివశంకర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం బోడుప్పల్ శ్రీసాయినగర్‌లో నివసించే లారెన్స్ డిసౌజ, వెలైట్ డిసౌజ కుమారుడు లోయడ్ స్పాస్కై డిసౌజ (30) హబ్సిగూడలోని జెన్‌ప్యాక్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఓ యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. తల్లిదండ్రులు వ్యతిరేకించడంతో వారికి సర్ధి చెప్పి తల్లిదండ్రులతో కలిసి వుంటున్నారు. కుటుంబ కలహాలతో తీవ్ర మనస్థాపం చెందిన లోయడ్ స్పాస్కై ఇంట్లోని ఫ్యాన్‌కు తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వృద్ధురాలిపై అత్యాచారం ఆపై హత్య!
మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బోడుప్పల్‌కు చెందిన లక్ష్మమ్మ (50) అనే మహిళ గత అర్థరాత్రి దారుణ హత్యకు గురైంది. దీంతో స్థానికులు మంగళవారం ఉదయం మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. లక్ష్మమ్మ మృతికి గల కారణాలపై పోలీసులు స్థానికులను విచారిస్తున్నారు. మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లక్ష్మమ్మపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.